టాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ - 'మీ పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయండి' అంటూ తన కూతురు సితార బుక్ చదువుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి 'బ్రెయిన్ ఫుడ్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
డ్యాన్సర్ దీప్తీ సునైన చీరకట్టులో దిగిన తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఇది మంచియని.. అది చెడ్డదని తూకాలు వేయగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే.. పైవాడు’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ రవీనా టాండన్ తన పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ లక్ష్మీ రాయ్ ‘హల్లో మండే’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ తన గార్డెన్లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘విత్తనం నుంచి మొక్క ఎదుగుతున్న క్రమాన్ని చూడడం కన్నా తృప్తి, ఆనందం ఇంకేముంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య ఏడు లక్షలకు చేరింది. ఈ సందర్భంగా తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ఇది నాకు ఎంతో అపురూపమైనది.. పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ఫాలోవర్స్, లవ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ గాయని నేహా కక్కర్ ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా తన భర్తతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...