scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఇది ఫ్యామిలీ టైమ్..!

Latest posts of celebrities in Instagram

బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ పౌట్‌ పోజ్‌లో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ఇంటికి వెళుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని పోస్ట్‌ చేసింది. దీనికి తన సోదరి కరిష్మా ‘హర్రీ.. నిన్ను చాలా మిస్సయ్యాను’ అని రిప్లై ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on



అందాల తార సన్నీ లియోన్‌ తన భర్త డేనియల్‌తో కలిసి దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘నా సర్వస్వం అయిన నీకు (డేనియల్‌) పుట్టిన రోజు శుభాకాంక్షలు. జీవితం విలక్షణమైనది, కఠినమైనది. కొన్ని సందర్భాల్లో నేను దానిని సరిగా హ్యాండిల్ చేయలేను.. కానీ నీ ప్రేమ, శ్రద్ధతో నువ్వు మమ్మల్ని బాగా చూసుకున్నావు. మంచి భర్తగా, తండ్రిగా ఉన్న నీకు ధన్యవాదాలు. నా ప్రియమైన శ్రీవారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరాన్ని బాగా ఎంజాయ్‌ చేద్దాం..’ అని రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on



జర్మన్‌ మోడల్‌ ఎవ్లీన్‌ శర్మ ‘త్రోబ్యాక్‌’ అంటూ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌తో దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రకృతితో మమేకమైన ఆ షూటింగ్‌ రోజులను చాలా మిస్సవుతున్నాను.. ‘యే జవానీ హై దీవానీ’ సినిమా షూటింగ్‌ అయితే అస్సలు మర్చిపోలేకపోతున్నాను. మనాలీలో జరిగిన షూటింగ్ అనుభవాలు నాకు ఎప్పుడూ మధురమే.. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లారా?’ అంటూ పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on



అందాల భామ మీనా ‘ఫ్యామిలీ టైమ్‌’ అంటూ దృశ్యం-2 సినిమా షూటింగ్‌ సందర్భంగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16) on



తెలుగు భామ సమీరా రెడ్డి తన పాప నవ్వుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నా లాండ్రీ బాస్కెట్‌లో ఎవరు కనిపించారో తెలుసా? ఇంకెవరూ..? మా నైరానే.. తనెప్పుడూ ఫన్‌గా ఉండడానికి ప్రయత్నిస్తుంటుంది’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera) on



టాలీవుడ్‌ భామ కామ్నా జెఠ్మలానీ వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్న వీడియోలను అభిమానులతో పంచుకుంది.

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10) on



అందాల భామ అదా శర్మ దిండు పట్టుకుని డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘డ్యాన్స్‌ చేయడానికి భాగస్వామి లేని వారి పేరుని ట్యాగ్‌ చేయండి. నా దగ్గర సొల్యూషన్‌ ఉంది. నా డ్యాన్స్‌ పార్టనర్‌ని కలవండి’ అని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah) on



దిల్లీ బ్యూటీ కృతి సనన్ 'మోటివేట్ కావడానికి సోమవారమే అక్కర్లేదు' అంటూ వివిధ రకాల వ్యాయామాలు చేస్తోన్న వీడియోలను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. దీనికి ‘క్వారంటైన్‌ వర్కౌట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon) on



అందాల భామ ఖుష్బూ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Khush (@khushsundar) on



వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai) on


View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel) on


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on


View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh) on


View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial) on


View this post on Instagram

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on


View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109) on





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram