టాలీవుడ్ భామ మంచు లక్ష్మి తన కూతురు నిర్వాణతో కలిసి వ్యాయామం చేస్తోన్న వీడియోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘సోమవారాలప్పుడు వ్యాయామం చేయడానికి మరొకరు పుష్ చేయాల్సిన అవసరం లేదని ఈ మధ్యనే కనుగొన్నాను. ఎలానో తెలుసా? నాకు మంచి సపోర్టర్, వర్కౌట్ పార్టనర్ దొరికింది. నా నివీనే ఆ పార్టనర్. సోమవారం ఉదయం కలిసి వ్యాయామం చేయడమే మేము నేర్చుకొన్న కొత్త విషయం’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ తారలు కాజోల్, షారుఖ్ ఖాన్లు నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రం విడుదలై నేటికి 25 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా కాజోల్ ఆ చిత్రంలోని కొన్ని పాటలను అభిమానులతో పంచుకుంది. వాటిని మీరూ ఓసారి చూసేయండి మరి...
అందాల తార సురభి నీటి బుడగలతో ఆడుకుంటోన్న తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ వితిక తన తాజా ఫొటోని పంచుకుంటూ ‘జీవితం అనేది ఒక విలువైన బహుమతి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని చెప్పుకొచ్చింది.
బుల్లితెర నటి దీపికా సింగ్ రెడ్ డ్రస్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కలర్ సైకాలజీ ప్రకారం ఎరుపు రంగు తపన, శక్తి, శ్రద్ధ & బలానికి చిహ్నం’ అని రాసుకొచ్చింది.
బాలీవుడ్ భామ కరీనా కపూర్ తన స్నేహితుడు చెప్పిన కొన్ని ఫిట్నెస్ చిట్కాలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
గాయని లిప్సిక ‘ఆంధ్రుడు’ చిత్రంలోని ‘ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా..’ పాటలోని కొన్ని చరణాలను పాడిన వీడియోని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా వ్యాయామం చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎక్కడ ఫోకస్ ఉంటుందో ఎనర్జీ అక్కడే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
ముంబయి భామ సోనాలీ బింద్రే ‘వ్యాయామం తర్వాతి మెరుపు’ అంటూ వర్కౌట్ తర్వాత దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ‘మూడ్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసేద్దామా...