బాలీవుడ్ ముద్దుగుమ్మ మాధురీ దీక్షిత్ దంపతులు నేడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ‘ప్రతి వార్షికోత్సవం మా ప్రయాణంలో మరొక కొత్త సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది.
అందాల భామ కియారా అడ్వాణీ ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసేయండి మరి...
మాటల మరాఠీ, యాంకర్ సుమ కనకాల తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కేరళ ముద్దుగుమ్మలు అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవిలు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోని పోస్ట్ చేసిన అనుపమ ‘మీలో ఎవరికైనా మేరీ, మలర్‌లు గుర్తున్నారా? సాయిపల్లవీ.. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నువ్వంటే నాకెంతో ఇష్టం.. నేను నీ అభిమానిని’ అని రాసుకొచ్చింది.
గాయని లిప్సిక ‘దేవదాస్’ చిత్రంలోని ‘అడిగీ అడగలేక ఒక మాటే అడగనా.. తెలిపీ తెలపలేక ఒక మాటే తెలపనా..’ అనే పాట పాడిన వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అనుకున్నంత సులభం కాదు ఈ పాట అని అర్థమయ్యింది.. నాకు ఇష్టమైన పాట’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ తార మల్లికా శెరావత్ ‘మీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఎరుపు రంగుతో నింపేయండి’ అంటూ రెడ్ డ్రస్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ అనుష్కా శర్మ సూర్యరశ్మి కోసం ఎండలో నిలబడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఓ పాపతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ప్రగతి జుట్టు పొడవు ఆ పాప ఎత్తుతో సమానంగా ఉండడం విశేషం.
నటి, నిర్మాత మంచు లక్ష్మి పుట్టినరోజు వేడుకల కోసం గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ట్రిప్‌కి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా-
‘ఎక్కడున్నాం.. ఏమున్నాయి.. అన్నది కాదు.. ఎవరితో ఉన్నాం అన్నది ముఖ్యం.. ! నేనిలా ఉండడానికి కారణం నా ఫ్రెండ్సే.. ఈ బర్త్‌డే ట్రిప్‌ని మరింత స్పెషల్ గా, ఓ మంచి జ్ఞాపకంలా మార్చిన అందరికీ నా కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్’ అని రాసుకొచ్చింది.
దిల్లీ సుందరి రాశీ ఖన్నా పల్లెటూరి పిల్లలా లంగావోణీలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ రష్మీ గౌతమ్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ తన సోదరి నిషా అగర్వాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు ముద్దుగుమ్మలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలను చూసేద్దాం రండి...