మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్ పేపర్ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్, ప్రాక్టీస్ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్, అథెంటిక్ పవర్, కోర్ బిలీఫ్స్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ షమితా శెట్టి ‘ముంకి, టుంకి’ అంటూ తన సోదరి శిల్పా శెట్టితో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి శిల్పా శెట్టి ‘నా టుంకి’ అంటూ రిప్లై ఇచ్చింది.
అందాల భామ పార్వతీ నాయర్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘దేన్నైనా పొందడం కష్టం.. మర్చిపోవడం మరింత కష్టం’ అని చెప్పుకొచ్చింది.
గాయని కౌసల్య ‘హాఫ్ డికేడ్ ఛాలెంజ్’ అంటూ 2015, 2020లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అయిదు సంవత్సరాల వ్యత్యాసం.. మన వయసు ఎంత అన్నది ముఖ్యం కాదు. మన రోజువారీ పనులే మనల్ని సరైన మార్గంలో తీసుకెళ్తాయి. ఇప్పుడు మీ వంతు. మీరు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనండి. ఇతరులకు ఈ ఛాలెంజ్‌ని విసరండి’ అని రాసుకొచ్చింది.
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన షూటింగ్ టీమ్‌తో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ నివేదా థామస్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ ఇషితా దత్తా తన డ్రస్‌కు మ్యాచయ్యే నెయిల్ పాలిష్ వేసుకొని దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ ‘ఈషా రెబ్బా’ వ్యాయామం చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు పలువురు తారలు తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై ఓ లుక్కేద్దాం రండి...