టాలీవుడ్ బ్యూటీ రష్మిక బీచ్‌లో వ్యాయామాలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘నా మొదటి బీచ్ వర్కౌట్.. నేను మొదటిసారి బీచ్‌లో వ్యాయామాలు చేశాను. చాలా అలసిపోయాను కానీ బాగా అనిపించింది. అలల హోరు.. సముద్రపు వాసన.. సూర్యాస్తమయాన్ని చూడడం.. ఇసుక తిన్నెల్లో నడవడం.. వీటికి ఫిదా అయ్యాను’ అని చెప్పుకొచ్చింది.
దక్షిణాది తార త్రిష తను ‘మిస్ చెన్నై’ టైటిల్ గెలిచిన సందర్భంగా దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘30/09/1999.. నా జీవితాన్ని మార్చిన రోజు’ అంటూ మిస్ చెన్నై 1999 అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తన తండ్రి ఒడిలో నిద్రపోతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘విశ్రాంతి తీసుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఏదీ ఉండదు. హాయిగా తల దాచుకున్నాను.. నాన్నా.. నువ్వు చాలా బెస్ట్’ అని రాసుకొచ్చింది.
గాయని లిప్సిక ‘న్యూయార్క్ డైరీస్’ అంటూ గతంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ భానుశ్రీ ‘ట్రైబల్ లవ్’ అంటూ గిరిజన యువతిగా ముస్తాబైన ఫొటోని పోస్ట్ చేసింది.
ప్రముఖ నటి భూమికా చావ్లా ఏదో ఆలోచిస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘చెప్పడానికి ఏమీ లేనప్పుడు నిశ్శబ్దంగా ఉండండి.. ఆ నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను అనుభూతి చెందండి’ అని రాసుకొచ్చింది.
సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి జిమ్‌లో తన స్నేహితులతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో నిహారికా కొణిదెల కూడా ఉన్నారు.
బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్ సముద్రపు ఒడ్డున సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బ్యూటీ ఛార్మీ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నాకు అన్ని నిబంధనలు తెలుసు.. కానీ నిబంధనలకే నేను తెలియదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...