క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మీకు తగిలిన గాయాలే మిమ్మల్ని కొత్తగా తీర్చిదిద్దడంలో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని మర్చిపోకండి’ అని రాసుకొచ్చింది.
‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సూర్యాస్తమయ వెలుగుల్లో నది ఒడ్డున సేద తీరుతోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా వ్యాయామం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది.
‘గీతాంజలి’ భామ అంజలి పోలీస్ గెటప్‌లో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ధైర్యంగా తలుపు తట్టే వారి కోసం ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి’ అంటూ క్రైమ్, డిటెక్టివ్, నిశ్శబ్దం హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ జలపాతం దగ్గర సరదాగా గడిపిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు తన భర్త కరణ్ సింగ్‌తో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. అలాంటి గొప్ప ప్రేమికుడు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం’ అని చెప్పుకొచ్చింది.
‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘నేనెప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోలేదు.. కానీ రియల్‌గా ఉండాలనుకున్నాను’ అని రాసుకొచ్చింది.
‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ షూటింగ్లో భాగంగా పల్లెటూరి పిల్లలా తయారైన ఫొటోని పోస్ట్ చేసింది.
డాటర్స్ డే(ఆదివారం) సందర్భంగా పలువురు తారలు తమ కూతుళ్లతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వీరిలో మంచులక్ష్మి, మీనా, ఝాన్సీలు ఉన్నారు.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి వాటిని మీరూ చూసేయండి!