
టాలీవుడ్ భామ సమంత జిమ్‌లో దిగిన తన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా 'మీ మనసే మీ బలం.. అదే మీ శత్రువు.. అందుకే దానికి బాగా శిక్షణ ఇవ్వండి'- అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి మాధురీ దీక్షిత్ ‘త్రోబ్యాక్’ అంటూ గతంలో తన ఫ్యామిలీతో సరదాగా గడిపిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘కుటుంబంతో సరదాగా గడిపితే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే’ అని చెప్పుకొచ్చింది.
డ్యాన్సర్ దీప్తీ సునైన ‘మీ చిరునవ్వే నా బలం’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్లో మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. అదే అటైర్‌తో ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేసిన వీడియోని కూడా పోస్ట్ చేసింది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ ఫ్లోరల్ ప్రింట్లో మెరిసిపోతున్న తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘వసంత ఋతువులో విరబూసే పూలంటే నాకు ఎంతో ఇష్టం.. అవి నా హృదయాన్ని పులకించేలా చేస్తాయి.. మరి మీరు ఏ సీజన్లో ఉన్నారు’ అంటూ స్ప్రింగ్, ఆస్ట్రేలియా హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
టాలీవుడ్ బ్యూటీ అనుష్క ‘అంతర్జాతీయ సంజ్ఞల భాషా దినోత్సవం’ సందర్భంగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘శబ్దాన్ని ఆపి నిశ్శబ్దాన్ని గుర్తించండి’ అని రాసుకొచ్చింది.
అందాల భామ దిశా పటానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసింది.
‘నా అభిమానుల సంఖ్య 40 మిలియన్లకు చేరుకోవడం అంటే 60 కేజీల బరువుని 10 సార్లు ఎత్తినట్లుంది.. మీరు అందిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను’ అంటూ తనకు వర్కవుట్స్ అంటే ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పింది.
బాలీవుడ్ సుందరి షమితా షెట్టి ప్రకృతి అందాల నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోలను పోస్ట్ చేసింది.
‘ఎప్పుడూ నవ్వడానికి ఓ కారణం వెతకండి.. ఇది మీ జీవిత కాలాన్ని పెంచకపోవచ్చు. కానీ, మీ జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుంది..' అంటూ పాజిటివిటీ, ప్రకృతి, లవ్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ‘జ్ఞాపకాలు... ఈ ‘లెజెండ్’ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం’ అని ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది. దీనికి మరో నటి ప్రియమణి ‘నాకు ఆయనే గురువు’ అని రిప్లై ఇచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...