బాలీవుడ్ సుందరి కాజోల్ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తనతో దిగిన ఫొటోని పంచుకుంటూ ‘నేను నీతో ఉన్నప్పుడు ఒక సైన్యంతో ఉన్నంత భావన కలుగుతుంది.. ఒక మహిళలో ఉండే అన్ని కోణాలను నాపై చూపించిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే మమ్మా.. లవ్ యూ సో మచ్. నీ బిడ్డగా నాకు జన్మనిచ్చినందుకు ఎప్పుడూ నీకు రుణపడి ఉంటాను’ అంటూ తల్లిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ బ్యూటీ.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ లక్ష్యాలను మీరు చేరుకోని సమయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన కూతురు నిషాతో పెయింటింగ్ వేస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార నేహా ధూపియా ‘కొవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆకాశం వైపు చూస్తోన్న తన ఫొటోని పోస్ట్ చేసింది.
‘RX100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ విమానాశ్రయంలో పీపీఈ కిట్ ధరించిన షార్ట్ వీడియోని అభిమానులతో పంచుకుంది.
యాంకర్ సుమా కనకాల తన భర్త రాజీవ్ కనకాలతో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘జీవితం, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఫొటో ఇది’ అని చెప్పుకొచ్చింది.
యాంకర్ ఝాన్సీ సోఫాలో కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘ధ్యానం చేయడానికి కావాల్సిందల్లా ప్రశాంతంగా కూర్చోవడమే’ అని ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది.
టాలీవుడ్ భామ రేణూదేశాయ్ తన ఫ్రెండ్‌తో సరదాగా గడుపుతున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘స్నేహం అనేది ఆహారం, వ్యంగ్యం, అసందర్భం, పరాచికాలు.. వంటి అంశాల ప్రాతిపదికగా బలపడాలి' అంటూ చక్కటి స్నేహానికి ఎలాంటి నియమాలు, షరతులు లేవని చెప్పకనే చెప్పింది.
అందాల తార భూమికా చావ్లా పది సంవత్సరాల క్రితం దిగిన తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
సింగర్ గీతా మాధురి తన పాప (దాక్షాయణి ప్రకృతి) ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజెన్లు - 'పాప చాలా క్యూట్ గా ఉంది.. అచ్చం మీలాగే' - అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు భామ నందినీ రాయ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘ప్రేమతో నిండిన అందమైన హృదయం ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేయండి మరి...