ప్రపంచ కృతజ్ఞతా (గ్రాటిట్యూడ్) దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అనుష్కా శర్మ, శిల్పా శెట్టి ఇప్పటివరకు తమ జీవితంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ఇన్స్టా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
డ్యాన్సర్ దీప్తీ సునైనా తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎవరైతే ఒంటరిగా ఎగురుతారో వారి రెక్కలు చాలా దృఢంగా ఉంటాయి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ హీనాఖాన్ పోల్కా డాట్స్ డ్రస్ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అందాల భామ లక్ష్మీ రాయ్ తన అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు.. కానీ నిజాయతీగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ దీపికా సింగ్ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మీరు ఒక్క సోషల్ మీడియాలోనే కాదు.. నిజ జీవితంలో సంతోషంగా ఉన్నారో లేదో నిర్ధారించుకోండి’ అని రాసుకొచ్చింది.
సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది.
‘మీరు మంచి ఫొటోగ్రాఫర్ కావాలంటే.. ఆసక్తికరమైన అంశాల ముందు నిలబడండి’ అంటూ జిమ్ రిచర్డ్సన్ కొటేషన్ని ఈ ఫొటోకు జత చేసింది.
తెలుగు భామ సమీరా రెడ్డి తన పిల్లలు సరదాగా ఆడుకుంటోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
జర్మన్ మోడల్ ఎవ్లీన్ శర్మ సోఫాలో నిద్ర పోతున్నట్టుగా దిగిన ఫొటోని పంచుకుంటూ ‘ప్రేమే సమాధానం’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపైన కూడా ఓ లుక్కేయండి..