నటి నమ్రత తన భర్త మహేష్ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది.
ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
యాంకర్ ఝాన్సీ పోలీస్ గెటప్‌లో ఉన్న వివిధ ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘నటి జీవితం.. యూనిఫాంలో వివిధ పాత్రలు.. సినిమా.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. త్వరలో కొత్త ఉత్సాహంతో మీ ముందుకు వస్తా’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ తన చెల్లితో సరదాగా గడిపిన ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి 'మీ చెల్లి మీతో ఉంటే ప్రతిదీ బానే ఉంటుంది' అని రాసుకొచ్చింది.
అందాల భామ రాశీ ఖన్నా తన తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ చుట్టూ జరిగే ప్రతి ఒక్క సంఘటనకు మీ స్పందన అవసరం ఉండదు.. కొన్నిసార్లు మౌనంగా కూర్చుని నవ్వితే సరిపోతుంది’ అని రాసుకొచ్చింది.
యాంకర్ సుమ తన వాక్చాతుర్యంతోనే కాకుండా ఆర్టిస్ట్‌గా కూడా అభిమానులను అలరిస్తోంది. తాజాగా తను ఓ స్కెచ్ వేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘స్పాంటేనియస్‌గా మాట్లాడే యాంకర్ లాగే నాలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉంది. ఎన్నో విజయవంతమైన రియాలిటీ, ఆటల కార్యక్రమాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ కుమార్‌కి ఈ స్కెచ్‌ని అంకితమిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.
ప్రముఖ నటి స్నేహా ఉల్లాల్ తలనొప్పి గురించి తెలియజేసే ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఎలాంటి తలనొప్పి వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో నొప్పి ఎక్కువ ఉంటుందో ఈ ఫొటో తెలియజేస్తోంది.
అయితే ఇక్కడ గమ్మత్తేంటంటే- నాలుగో బొమ్మలో తలతో పాటు మొహమంతా నొప్పిగా ఉన్నట్లు కనిపిస్తోంది.. దానికి కారణం ఏంటో తెలుసా?
మొక్కలు కూడా నొప్పిని అనుభవిస్తాయని ఎవరైనా చెప్పినప్పుడు అలా మన తలంతా నొప్పితో విలవిల్లాడుతుందట.. అంటే మొక్కల్ని బాధ పెట్టద్దంటూ పరోక్షంగా సందేశమిస్తోందీ భామ. బాగుంది కదూ..!
టాలీవుడ్ బ్యూటీ సమంత, మెగా కోడలు ఉపాసన జిమ్‌లో కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని ఉపాసన తన అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ విద్యుత్ వెలుగుల మధ్య చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ నటి ఛార్మి తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తన తల్లితో దిగిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ- ‘ఒక తల్లి మాత్రమే బిడ్డ ఏం చెప్పకుండానే తనకేం కావాలో అర్ధం చేసుకోగలదు.. ఈ ప్రపంచానికి మన తల్లుల అవసరం ఎంతో ఉంది. నీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలి మమ్మా.. ఎంతో అందమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది.
అందాల భామలు నివేదా థామస్, అదితీ రావు హైదరీలు తాము నటించిన ‘వి’ సినిమాలోని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా- ‘ప్రతి ఫొటోలోనూ ఓ కథ ఉంది.. వీటిలో మీకు నచ్చిందేది’ అని రాసుకొచ్చారు ఈ భామలు.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...