అందాల భామ నయనతార తన ప్రియుడు విఘ్నేష్‌తో గోవాలో విహరిస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈరోజు విఘ్నేష్ తన పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా ‘బర్త్ డే వైబ్స్’ అంటూ నయనతారతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేశారు.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘ఫాలో మీ’ అంటూ తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే నటుడు అఖిల్‌తో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘చాలా రోజుల తర్వాత షూటింగ్‌కి వచ్చాను. ఎట్టకేలకు జీవితం ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉంది. కరోనా కాలంలో.. రొమాంటిక్ కామెడీ సన్నివేశాన్ని తీసే క్రమంలో సెట్లో మేమిద్దరం మాత్రమే సామాజిక దూరాన్ని పాటించలేదు’ అంటూ ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం’, ‘షూటింగ్ టైమ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది. అంతేకాదు ‘ప్రామిస్.. మేమిద్దరం మాత్రమే మాస్క్ ధరించలేదు.. లేకపోతే సినిమాలో మమ్మల్ని గుర్తుపట్టలేరు’ అంటూ తాము నటిస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా టైటిల్‌ని మరో హ్యాష్ట్యాగ్గా జోడించింది.
అందాల తార భూమికా చావ్లా ‘ఒంటరిగా ఉన్నానని ఎప్పుడూ బాధపడకండి.. ఎందుకంటే విశ్వం మొత్తం మీలోనే ఉంటుంది’ అంటూ ఓ కొటేషన్‌ని పోస్ట్ చేసింది.
‘RX100’బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ‘హలో హైదరాబాద్’ అంటూ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బ్యూటీ అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ టీజర్‌ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మీ నిశ్శబ్దమే మిమ్మల్ని రక్షిస్తుంది’ అని రాసుకొచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 2 న ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
అందాల తార అదా శర్మ గోడలపై ఉన్న దేవుళ్ల పెయింటింగ్స్ ముందు దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ కిచెన్ గార్డెన్‌ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ ‘మా ఫ్యామిలీ అంతా కలిసి కిచెన్ గార్డెన్‌ని ఏర్పాటు చేశాం.. ఆసక్తికరమైన, కొత్త అంశాలను ప్రయత్నించడానికి ఎప్పుడూ వెనకాడకండి’ అంటూ చెప్పుకొచ్చింది.
డ్యాన్సర్ దీప్తీ సునైన ఇంట్లోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
గాయని లిప్సిక ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ''ప్రతి రెండు గంటలకు ఒకసారి- ‘తర్వాత ఏం తిందామా' అని ఆలోచిస్తుంటే ఇలాగే ఉంటుంది.. మీరూ ఇంతేనా?'' - అంటూ వీటికి క్యాప్షన్ ఇచ్చింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటినీ చూసేయండి మరి..