నటి ప్రగతి ‘ఆన్ డ్యూటీ’ అంటూ షూటింగ్లో భాగంగా దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తన కూతురు నిర్వాణతో సరదాగా గడుపుతోన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా- ‘నిజంగా పేరెంటింగ్ చాలా కష్టం.. దానిలో ఎలాంటి సందేహం లేదు.. కానీ, ఒక తల్లిగా, నా బిడ్డ పైన ఉన్న అపారమైన ప్రేమ కారణంగా నాకు తనని (నిర్వాణ) పెంచడం చాలా ఈజీగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలను అభిమానులతో పంచుకుంది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తాజా ఎపిసోడ్ ఇంట్రో సాంగ్‌కి స్టెప్పులేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
అందాల నటి ఛార్మీ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా తండ్రితో దిగిన చిన్నప్పటి, ప్రస్తుత ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘నా బలం.. నా జీవితం.. నాకు అన్నీ డాడీనే’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి మల్లికా శెరావత్ డ్యాన్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది.
అందాల తార రాశీ ఖన్నా వివిధ రకాల వ్యాయామాలు చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
బుల్లితెర బ్యూటీ ఇషితా దత్తా ‘త్రో బ్యాక్’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
దక్షిణాది భామ మీనా అంటే తెలియని వారుండరేమో. ఆరేళ్ల వయసులోనే సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. అయితే ఓ అభిమాని మీనా పుట్టిన రోజు (సెప్టెంబర్ ౧౬) సందర్భంగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వివిధ సినిమాల్లో నటించిన పాత్రలకు సంబంధించిన ఆమె ఫొటోలను సేకరించి వాటికి వీడియో రూపం ఇచ్చాడు. అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోని తన ఖాతాలో పోస్ట్ చేసిందీ తార.
తెలుగు భామ హరితేజ ‘శశివదనే శశివదనే’ పాటకు కూర్చునే చక్కటి హావభావాలు పలికించింది. ‘సరదాగా అలా’ అంటూ ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది.
ముంబై బ్యూటీ శ్రద్ధా దాస్ 'ఒక తెలుగు సినిమా షూటింగ్ అనంతరం' అంటూ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...