‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ ఆనందంతో గెంతులేస్తున్నట్టుగా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని రాసుకొచ్చింది.
అందాల భామ పార్వతీ నాయర్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఉత్సాహంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ భామ భూమీ పెడ్నేకర్ నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘నేను నవ్వుతున్నప్పుడు మీరు నా కళ్లు చూడలేరు’ అని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ నటి సమంత అక్కినేని ‘బ్లాక్ అండ్ వైట్ సిరీస్’ అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ల్యాప్‌టాప్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నట్టుగా ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘వర్క్ ఫ్రం హోమ్ చివరి దశకు వచ్చింది.. కరోనా విడిచిపెట్టలేదు కానీ కఠిన జాగ్రత్తలు తీసుకొని సెట్స్‌లోకి తిరిగి అడుగు పెట్టాల్సి ఉంటుంది’ అని రాసుకొచ్చింది.
బుల్లితెర నటి సుజితా ధనుష్ తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘ఫొటోగ్రఫీ ఒక అందమైన కళ’ అని రాసుకొచ్చింది.
మెగా కోడలు ఉపాసనా కొణిదెల ఆలోచిస్తున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సంతోషంగా లేకపోవడానికి ముఖ్య కారణం అతిగా ఆలోచించడమే.. సానుకూల దృక్పథం అంటే పరమానందం’ అని రాసుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ ‘మీరు అనుకున్నదాని కోసం ధైర్యంగా ముందుకు వెళ్లండి.. లేకపోతే అసలు ప్రయత్నించకండి’ అని చెప్పుకొచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఓ కొటేషన్‌ని పోస్ట్ చేసింది. ‘తప్పు చేయడానికి ఎప్పుడూ భయపడకండి.. అలాగే చేసిన తప్పుని మాత్రం రెండోసారి చేయకండి’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా తన భర్తతో సరదాగా గడిపిన జ్ఞాపకాలను వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
వీరితో పాటు రష్మీ గౌతమ్, మంచు లక్ష్మి, శివాత్మిక, కాజల్ అగర్వాల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...