బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ ‘త్రో బ్యాక్’ అంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఇది 23 సంవత్సరాల క్రితం ‘హమేషా’ చిత్ర షూటింగ్ సందర్భంగా దిగింది’ అని చెప్పుకొచ్చింది.
అందాల భామ కామ్నా జెఠ్మలానీ వ్యాయామం చేస్తోన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి...
1. వ్యాయామానికి ముందు వార్మప్ చేయాలి.
2. వ్యాయామం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.
3. స్ర్టెచింగ్ వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి’ అంటూ తన కూతురితో దిగిన సెల్ఫీ ఫొటోను మాత్రం చూడడం మర్చిపోవద్దని చెప్పింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
యాంకర్ సుమా కనకాల నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘చాలా ఆనందంగా ఉన్నప్పుడే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది.. నా భర్త రాజీవ్‌తో చేసిన ఈ ‘క్యాష్’ ప్రోగ్రాం ఎంతో సంతోషం కలిగించింది' ఈ శనివారం సాయత్రం 9:30కి ఈటీవీలో వచ్చే ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి’ అంటూ ఈటీవీ హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్, నటి బిపాసా బసు హెయిర్ కేర్ కి సంబంధించి కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఉల్లిపాయ రసం వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాల గురించి వివరించింది. ‘మొదట రెండు ఎర్రటి ఉల్లిపాయల పైపొట్టు తీశాను. వాటి నుంచి రసాన్ని తీశా.. ఆ రసాన్ని మాడుపై అప్లై చేశా.. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి ఒక గంట వరకు అలాగే ఉండనిచ్చా.. ఆ తర్వాత తలస్నానం చేసి కండిషనర్ అప్లై చేశా.. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటాను. ఇది జుట్టు రాలడాన్ని ఆపి మరింత పెరిగేలా చేస్తుంది. నేను కేవలం ఉల్లిగడ్డలతోనే చేశాను.. మీకు కావాలంటే కొబ్బరినూనె (వర్జిన్ కోకొనట్ ఆయిల్), లావెండర్ నూనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ తన సోదరునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
బాలీవుడ్ సుందరి ప్రియాంకా చోప్రా ‘న్యూ హెయిర్, డోంట్ కేర్’ అంటూ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది.
సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ నుంచి వస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
తెలుగు భామ సమీరా రెడ్డి తన పిల్లలతో సరదాగా గడుపుతోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ తార శివజ్యోతి అబ్బాయిల గురించి ఓ వీడియోని పోస్ట్ చేసింది. ‘కప్‌బోర్డ్‌లో ఉన్న షర్ట్ వెతుక్కోమంటే కనపడట్లేదు అంటారు.. కానీ స్పీడ్‌గా బైక్ మీద వెళ్తూ వందమంది అమ్మాయిల్లో కూడా ఏ అమ్మాయి బాగుంది అంటే ఠక్కున చెప్పేస్తారు. అదీ వాళ్ల ట్యాలెంట్..’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార అనన్యా పాండే పచ్చని ప్రకృతి నడుమ నవ్వుతూ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘స్మైలీ.. (చిరునవ్వు) చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది’ అంటూ స్మైలీ ఎమోజీని జోడించింది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...