నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
బాలీవుడ్ సుందరి షమితా షెట్టి తనకి ముద్దుపెడుతున్న ఓ బాబు ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మిస్సింగ్ మై నాటీ లిటిల్ బేబీ’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ అబ్బాయి ఎవరో కాదు.. తన సోదరి శిల్పా శెట్టి కొడుకు. ఈ పోస్ట్‌కి ‘మీరిద్దరూ నా బేబీసే’ అంటూ శిల్ప రిప్లై ఇచ్చింది.
‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ రిహార్సల్లో భాగంగా తీసిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు ప్రగ్యని వారి చేతుల మీద నిలబెట్టుకొన్నట్టుగా ఉంది.
టాలీవుడ్ భామ రితికా సింగ్ ఓ కొటేషన్ ని పోస్ట్ చేసింది. ‘ ‘పోలిక అసూయ, ద్వేషానికి దారి తీస్తుంది. సూర్యచంద్రుల్లాగా ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అవి రెండూ వాటి సమయం వచ్చినప్పుడు ప్రకాశిస్తాయి. అలాగే సమయం వచ్చినప్పుడు మన ప్రతిభ కూడా బయటపడుతుంది. కాబట్టి మీ ప్రత్యేకతలపై మీరు దృష్టి సారించండి’ అంటూ చెప్పుకొచ్చిందీ భామ.
అందాల భామ మీనా తన సహనటుడు మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
టాలీవుడ్ సుందరి మంచు లక్ష్మి ‘ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం’ సందర్భంగా కొంతమంది విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ ఆన్లైన్ పాఠాలు వింటోన్న ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘నేర్చుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దానిని మీ నుండి ఎవరూ తీసుకెళ్లలేరు. ఈ పిల్లలను చూడండి.. తమ బంగారు భవిత కోసం ప్రతికూల పరిస్థితుల్లో కూడా చదువుకుంటున్నారు’ అంటూ టీచ్ ఫర్ ఛేంజ్, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.
డ్యాన్సర్ దీప్తీ సునైనా తన తాజా డ్యాన్స్ వీడియో ప్రోమోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామ రుహానీ శర్మ తన పెట్‌తో సరదాగా గడుపుతోన్న వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు వితిక, ఊర్వశీ రౌతెలా, పునర్నవి, భూమిక, ధన్యాబాలక్రిష్ణ, భానుశ్రీ, సోఫీ చౌదరి, రాధికలు తమ తాజా ఫొటోలను పోస్ట్ చేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం రండి...