
నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
నటి ప్రగతి నవ్వుతోన్న తన ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఏదైనా కావాలని మీరు బలంగా కోరుకున్నప్పుడు విశ్వం మొత్తం దానిని సాధించడంలో మీకు సహకరిస్తుంది..’ అని చెప్పుకొచ్చిందీ భామ.
మెగా కోడలు ఉపాసన ‘ఫ్రైడే ఫీలింగ్’ అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
అందాల నటి భూమికా చావ్లా బ్లూ డ్రస్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఈ ప్రపంచానికి మీరు చేయగలిగిన మంచి పని ఏంటంటే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడమే’ - అంటోందీ భామ.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ‘జ్ఞాపకాలు’ అంటూ తన పిల్లలు గౌతమ్, సితార కలిసున్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మేము ఒకసారి వేసవిలో బాద్రాగాజ్ని సందర్శించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. పర్వతాల మధ్య నుంచి వచ్చే మేఘాలు, స్వచ్ఛమైన గాలి, పచ్చటి గడ్డి... ఆ సుందర దృశ్యాలను మర్చిపోలేకపోతున్నాను. ఆ జ్ఞాపకాలతోనే ఈ సంవత్సరం గడిచిపోతోంది. త్వరలోనే మళ్ళీ అక్కడికి వెళ్లాలని ఆశిస్తున్నా..’ అని చెప్పుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ తార జరీన్ ఖాన్ తన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘అన్ని తరగతి గదులకు నాలుగు గోడలు ఉండవు’ అని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కొవిడ్‌పై పోరులో తమ వంతు కృషి చేస్తోన్న హెల్త్‌కేర్ వర్కర్స్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. అలాగే తన వంతుగా వారిలో పాజిటివిటీ నింపడానికి ‘Strong Together’ అని రాసి ఉన్న యాంటీ మైక్రోబియల్ టీ షర్ట్‌లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ‘మీ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతోన్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ స్ట్రాంగ్ టుగెదర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించిందీ భామ.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సరదాగా కన్ను కొడుతూ, ముద్దు పెడుతున్నట్లున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ చెట్టుపై ఉన్న ద్రాక్ష పండ్లను తింటున్నట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఆర్గానిక్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
బాలీవుడ్ తార, కాలమిస్ట్ ట్వింకిల్ ఖన్నా తన మోముపై ఇంద్రధనస్సు పడినట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘సరైన ప్రాంతంలో సరైన సమయంలో చెప్పాల్సిన విషయం ఇది. నేను అక్కడ కూర్చొని పని చేసుకుంటుండగా ఒక అలసిపోయిన ఇంద్రధనస్సు నా మొహంపై విశ్రాంతి తీసుకుంది’ అని రాసుకొచ్చిందీ తార.
వీరితో పాటు అందాల తారలు పార్వతి నాయర్, తేజస్వి, హీనా ఖాన్, అమైరా దస్తూర్, పూజా హెగ్డే, వర్షిణీలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూద్దాం రండి...