నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
మాటల మరాఠీ, యాంకర్ సుమా కనకాల ‘వాట్సప్ కష్టాలు’ అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చాటింగ్ కోసం ఏ అంశానికి ఎలాంటి ఎమోజీలు ఉపయోగిస్తుంటారో ఫన్నీగా చెబుతోంది సుమక్క.
టాలీవుడ్ సుందరి కామ్నా జెఠ్మలానీ వివిధ రకాల వ్యాయామాలు చేస్తోన్న వీడియోలను అభిమానులతో పంచుకుంది.
‘మహానటి’ కీర్తీ సురేష్ ఓనమ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘ఫ్యామిలీ తర్వాతే ఎవరైనా..’ అని చెప్పుకొచ్చిందీ సుందరి. అంతేకాదు.. హ్యాపీ ఓనమ్, ఓనమ్ 2020, ఫ్యామిలీ టైమ్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ‘మాన్సూన్ మ్యూజింగ్స్’ అంటూ తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘కంచె’ భామ ప్రగ్యా జైస్వాల్ కేక్ పట్టుకొన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కేక్ తయారుచేయడానికి నాన్న పుట్టినరోజు కంటే మంచి కారణం మరొకటి ఏముంటుంది?’ అని చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళిన వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ గుడి శిల్ప కళా వైభవాన్ని చాటే విధంగా ఉన్న ఈ వీడియోకి ‘వెయ్యి స్తంభాల గుడి గొప్పదనం’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
బాలీవుడ్ భామ దియా మీర్జా తన అందమైన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మనసుతో చూస్తేనే నిజమైన అందం ఏంటో తెలుస్తుంది..’ అని చెప్పుకొచ్చింది.
‘బిగ్‌బాస్’ తార సావిత్రి ‘ఇస్మార్ట్ జోడి’ అంటూ తన భర్తతో దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్ మోదక్‌లు తయారు చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
అందాల భామ దిశా పటానీ తన పెట్‌తో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
కన్నడ భామ ప్రణీత పీపీఈ కిట్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ‘కర్మ’ అంటే ***** కాదు. అదొక అద్దం..’ అంటూ ఓ కొటేషన్ రాసుకొచ్చారు.
మనకు నష్టం కలిగినప్పుడు తప్ప, ఇతరులకు మన వల్ల ఎంత నష్టం జరిగిందో తెలియదు.. అది తెలిపేదే 'కర్మ' – అంటూ నిర్వచనం ఇస్తున్నారు స్మృతి.
వీరితో పాటు అందాల తారలు రేణూ దేశాయ్, రాశీ ఖన్నా, ట్వింకిల్ ఖన్నా, నమ్రత, మల్లికా శెరావత్, షమితా శెట్టి, రుహానీ శర్మల ఇన్‌స్టా పోస్టులపై కూడా ఓ లుక్కేయండి!