
నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
కన్నడ భామ ప్రణీత లాక్డౌన్ సమయంలో దిగిన ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ‘ఇది మెజెస్టిక్ బస్టాండ్. ఎక్కడ చూసినా నిర్జీవంగా ఉంది. నిత్యం ప్రయాణికులు, బస్సులతో రద్దీగా ఉండేది. ఇంతకుముందెన్నడూ ఇలా చూడలేదు. ఇకముందు కూడా ఇలా చూడకూడదని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చిందీ భామ. అంతేకాదు.. దీనికోసం పర్మిషన్ తీసుకున్నానని గుర్తు చేసింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘జీవితం నిస్సారంగా, నిరాశాజనకంగా ఉన్నప్పుడు మీరే రంగులద్దండి’ అని చెప్పుకొచ్చిందీ భామ.
అందాల భామ లక్ష్మీ రాయ్ ‘గుడ్ మార్నింగ్’ చెబుతూ తన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ సుందరి అమీషా పటేల్ ‘వర్క్ మోడ్.. దుబాయ్’ అంటూ దుబాయ్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
'జెంటిల్మెన్' భామ సురభి గార్డెన్లో దిగిన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ప్రతి మహిళలో ఒక మహారాణి దాగి ఉంటుంది’ అని చెప్పుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తన కూతురు గార్డెన్లో బుడగలు వదులుతూ ఆడుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘నా బుడగల్ని ఎవరూ పగలకొట్టకండి’ అనే క్యాప్షన్‌ని జోడించిందీ భామ.
టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జున ఈ రోజు 61వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు తారలు తనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. వీరిలో రష్మిక మందన, మంచు లక్ష్మి, ఖుష్బూ, శ్యామల, లాస్య, మధుప్రియలు ఉన్నారు. ఆ ఫొటోలను ఓసారి చూద్దాం రండి...
వీరితో పాటు అందాల తారలు భూమికా చావ్లా, పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేత, రుహానీ శర్మ, వేదికలు తమ తాజా ఫొటోలను పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి..