నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
నటి ప్రగతి తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీకు మీరే ఒక ఫైటర్.. గతంలో మీరు అధిగమించిన సమస్యలను, పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు కూడా అలాగే పోరాడండి.. పారిపోకండి..’ అంటూ కరోనా కష్ట కాలంలో తన అభిమానులకి ధైర్యం చెబుతోందీ సూపర్ మామ్.
నటి నమ్రతా శిరోద్కర్ తన భర్త మహేష్ బాబు వ్యాయామం చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘ఆయన వ్యాయామం అంతా ఇక్కడే కొనసాగిస్తారు.. ఆయన హోమ్ జిమ్.. సరైన పుట్టిన రోజు బహుమతి.. మాస్టర్ డెన్.. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎక్కడ వెతకాలో తెలిసింది కదా..!’ అంటూ మహేష్ ఫిట్నెస్ సీక్రెట్ గురించి చెప్పకనే చెప్పిందీ భామ.
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ‘పోస్ట్ ప్యాకప్ షాట్’ అంటూ తన అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హిమజ తెలుగుతనం ఉట్టిపడేలా దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
అందాల భామ సన్నీ లియోనీ తన స్నేహితురాలు నురియాతో కలిసి ఈత కొడుతున్న వీడియోని పోస్ట్ చేసింది. దీనికి ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చండి.. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపుగా అయిపోయింది.. అవును.. 2020 లాగే ఈ బ్యాక్ ఫ్లాప్ (వెల్లకిలా పడుకుని ఈత కొట్టడం) కూడా నన్ను ఇబ్బంది పెడుతోంది. నురియా లాంటి మంచి ఫ్రెండ్ తో సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా అందమైన ఫొటోని పోస్ట్ చేసింది. 'కోరుకోవడం అంటే నిజంగా అర్థం చేసుకోవడం.. ప్రతి అంశాన్నీ గాఢంగా ప్రేమించడం..' అంటూ దీనికి కాప్షన్ ఇచ్చింది.
కన్నడ భామ ధన్యా బాలకృష్ణన్ ‘స్టే కామ్, స్టే ఫోకస్డ్’ అంటూ అందమైన ఫొటోని అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ భామలు మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లు కలిసి వ్యాయామం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని మంచు లక్ష్మి అభిమానులతో పంచుకుంది. ‘కలిసి వ్యాయామం చేస్తున్నప్పుడు.. మరింత దృఢంగా, వేగంగా ముందుకు వెడతాం.. ఏ పనినైనా కలిసి చేస్తేనే బాగా చేయగలం. రకుల్ నీకు కూడా అలాగే అనిపించిందా?’ అంటూ రాసుకొచ్చిందీ భామ. అంతేకాదు.. ఈ వీడియోలో నిర్వాణ కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోకండి’ అంటూ గుర్తు చేసింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన అభిమానులకి వీడియో సందేశాన్నిచ్చింది. దీనికి ‘ఈ సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు’ అంటూ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చిందీ భామ.
వీరితో పాటు అందాల భామలు నభా నటేష్, వర్షిణి, భూమికా చావ్లా, కాజోల్, మల్లికా శెరావత్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధాదాస్, భానుశ్రీలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి..