నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
టాలీవుడ్ భామ రేణూ దేశాయ్ అందమైన తన ఫొటోని పోస్ట్ చేస్తూ- “మనలో అందాన్ని నింపుకొంటే తప్ప ప్రపంచమంతా వెతికినా దానిని కనుక్కోలేం" అంటూ - రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసిన కోట్ని జత చేసింది.
మాటల మరాఠీ, యాంకర్ సుమ ‘స్టార్ మహిళ’ కార్యక్రమం సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ప్రియమైన అభిమానులారా.. నిన్నటి ‘స్టార్ మహిళ’ కార్యక్రమం ఎంతో సరదాగా గడిచింది’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ సుందరి మల్లికా శెరావత్ తను ఇంట్లో ఉన్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘క్వారంటైన్ జీవితం’ అనే క్యాప్షన్‌ని జత చేసింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ వితిక తన తాజా ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ప్రతికూల పరిస్థితులను ఇంతకుముందు ఎలా జయించారో.. ఇప్పుడు కూడా అలానే జయిస్తారు’ అంటూ తన అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతోందీ సుందరి.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార, తన బెస్టీ ఆద్యతో (దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె) ఆడుకుంటోన్న వీడియోని తన అభిమానులతో పంచుకుంది.
అందాల భామ నిత్యా మేనన్ ‘Breathe: Into The Shadows’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్‌కి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'తెర వెనక కిచెన్‌లో మేము... తెర ముందు కిచెన్‌లో నేను..' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ భామ.
గాయని శ్రేయా ఘోషల్.. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్ మరణంపై స్పందించింది. ఈ సందర్భంగా- ‘ఆయన స్వరంలో, సంగీతంలో ఉండే దైవ శక్తి శ్రోతలను భగవంతునితో మమేకమయ్యేలా చేస్తుంది. ఒక శకం ముగిసింది. పండిట్ జీ ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను. దేశంలోని గొప్ప కళాకారులలో ఒకరిని కోల్పోవడం తీరని లోటు. నా జీవిత ప్రయాణంలో ఆయన్ని కలుసుకోవడం, ఆయన ఆశీర్వాదాలు పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. పండిట్ జీ.. మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’- అంటూ ఆయనపై తనకున్న అభిమానాన్ని తెలిపిందీ సింగర్.
యాంకర్ శ్యామల ‘నీవెవరో నీవెవరో’ పాటకు తను పెదవి కలిపిన వీడియోని పోస్ట్ చేసింది.
వీరితో పాటు అందాల తారలు అదా శర్మ, సమంత, హెబ్బా పటేల్, కత్రినా కైఫ్, హీనా ఖాన్, సన్నీ లియోనీ, రవీనా టాండన్, తేజస్వీలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి...