నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
టాలీవుడ్ భామ రేణూ దేశాయ్ తన జుట్టు విరబోసినట్టుగా ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘హ్యుమిడిటీ వల్ల నా జుట్టంతా చింపిరిగా మారింది.. పిచ్చుకలు కచ్చితంగా నా జుట్టుపై గూళ్లు కడతాయి.. దయచేసి వాటిని లెక్కించండి’ అంటూ తన స్నేహితులను జత చేసిందీ భామ.
వుమెన్ పాపులర్ షో ‘స్టార్ మహిళ’ రెండవ సీజన్ నేటి (ఆగస్టు 17) నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా యాంకర్ సుమ కార్యక్రమంలోని ఓ స్టిల్‌ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉందండోయ్.. అదేంటంటారా..? కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? దీనికి సమాధానం మీకు తెలుసా? అయితే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేసేయండి మరి..
కొత్త పెళ్లి కూతురు, దగ్గుబాటి వారి కోడలు మిహికా బజాజ్ తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...
బాలీవుడ్ భామ దిశా పటానీ తను వ్యాయామం చేస్తున్న ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.
‘RX100’ భామ పాయల్ రాజ్‌పుత్ ఫేస్ యాప్‌తో చేసిన తన వీడియోలను పోస్ట్ చేసింది. దీనికి ‘హా హా.. ఫేస్ యాప్ చాలా అద్భుతంగా ఉంది. మీ డ్రీమ్ క్యారక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది చక్కటి మార్గం.. మరి, మీకు వీటిలో ఏది నచ్చింది?’ అని రాసుకొచ్చిందీ భామ.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వరల్డ్ కప్ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘వరల్డ్ కప్ జ్ఞాపకాలు.. జీవితకాల అనుభవం.. మరవలేని ఆ సిక్సర్.. ఇవన్నీ మేము మిస్ అవుతాం మహీ.. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు’ అని అంటోందీ సుందరి.
బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ ‘మండే మోటివేషన్’ అంటూ తను వ్యాయామం చేస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార ఇలియానా తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోతో పాటు నిద్రపోతున్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘వీకెండ్ మూడ్: అంచనాలకు, వాస్తవాలకు మధ్య తేడా ఇదే’ అని రాసుకొచ్చింది.
వీరితో పాటు అందాల తారలు శ్రియ, హిమజ, ఊర్వశీ రౌతెల, లావణ్యా త్రిపాఠి, సురభి, అవికా గోర్, గీతా మాధురి, మెహరీన్, అమీ జాక్సన్, హన్సిక, రష్మీ గౌతమ్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...