నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
టాలీవుడ్ భామ నిహారిక కొణిదెల తన నిశ్చితార్థం సందర్భంగా కాబోయే భర్త చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
మెగా కోడలు ఉపాసన కొణిదెల.. నిహారిక - చైతన్యలకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా భర్త రామ్‌చరణ్‌తో పాటు కాబోయే దంపతులతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది.
అవికా గోర్, రాజ్ తరుణ్ జంటగా నటించిన చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. ఈ చిత్రం విడుదలై నేటికి 5 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా నటి అవికా గోర్.. సినిమాకి సంబంధించిన పోస్టర్లను అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ యాంకర్ సుమా కనకాల ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సుమ తన జాకెట్ కుట్టుకుంటూ పనిమనిషితో సరదాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. దీనికి ‘నేను, నా మణి.. కుట్టడం, మాట్లాడుకోవడం, నవ్వడం.. ఇలా సరదాగా గడుపుతున్నాం. చాలామందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యుంటాయి. మేము వారి ప్రపంచంలోకి ఇలా తొంగి చూశాం అంతే’.. అని రాసుకొచ్చిందీ మాటల మరాఠీ.
బాలీవుడ్ భామ బిపాసా బసు తన భర్తతో నటించిన ‘డేంజరస్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుందీ సుందరి.
అందాల తార అనుపమా పరమేశ్వరన్ తను సిగ్గు పడుతున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మనల్ని ఆనందపడేలా చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోలేం కదా’ అని అడుగుతోందీ భామ.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఊసరవెల్లి ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘హల్లో.. ఫ్రం రాంచీ.. ఈ రోజు మేము అనుకోకుండా ఊసరవెల్లిని చూశాం. ఇతర రోజులను జరపుకొన్నట్టుగానే అందరం ప్రపంచ ఊసరవెల్లి దినోత్సవాన్ని జరుపుకొందాం’ అంటోందీ మిస్టర్ కూల్ వైఫ్. అంతేకాదు.. దీనికి నేచర్ లవర్స్, మ్యాజికల్ నేచర్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. ఆగస్టు 14 ని ‘ప్రపంచ ఊసరవెల్లుల దినోత్సవం’గా జరుపుకొంటున్నారు.
నటి ప్రగతి తన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘మీ ప్రాధాన్యాల పైనే దృష్టి సారించండి’ అని చెబుతోంది.
నవ్వుల పురాణం!
ఇక నేటి ఇన్స్టాపురంలో పలువురు తారలు నవ్వుతున్న ఫొటోలను పోస్ట్ చేసి ఏకంగా నవ్వుల పురాణమే చెప్పారు. ఆ సంగతులేంటో చూద్దాం రండి...
అందాల తార రాధికా ఆప్టే నవ్వుతున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు.. మనసులో ఉత్సాహం తొణికిసలాడుతున్నప్పుడు.. స్వచ్ఛమైన నవ్వు మన పెదాల నుంచి జారువారుతుంది’ అంటూ ప్యూర్ హ్యాపీనెస్, ప్యూర్ జాయ్ హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసిందీ భామ.
‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ వివిధ హావభావాలతో నవ్వుతోన్న ఫొటోలను పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరూ బాధలను కోరుకోరు. కానీ ఇంద్రధనస్సు రావాలంటే చిన్నపాటి వర్షం అయినా కురవాలి కదా..’ అంటోందీ సుందరి.
సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి మంజులా ఘట్టమనేని చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘ప్రకాశవంతంగా, గట్టిగా, తరచుగా నవ్వండి.. ఎందుకంటే నవ్వడం వల్ల మనసు తేలికై పాజిటివిటీతో నిండిపోతుంది’ అని రాసుకొచ్చిందీ సూపర్ సిస్టర్.
వీరితో పాటు అందాల తారలు భూమీ పెడ్నేకర్, ధన్యాబాలక్రిష్ణన్, దిశా పటానీ, రష్మీ గౌతమ్, రాశీ ఖన్నా, నిధి అగర్వాల్, కృతి కర్బందాలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి...