నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
గాయని గీతామాధురి, యాంకర్ శ్యామల కృష్ణాష్టమి సందర్భంగా తమ పిల్లలను కృష్ణుని గెటప్‌లో అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ‘నా చిన్ని కృష్ణుడు’ అంటూ ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
టాలీవుడ్ భామ సమంత అక్కినేని ‘శుభోదయం’ చెప్తూ తన గార్డెన్లో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
బుల్లితెర బ్యూటీ దీపికా సింగ్ కృష్ణాష్టమి సందర్భంగా దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ బ్యూటీ నందినీ రాయ్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘రహస్యాన్ని చెప్పే రహస్యం ఈ ఫొటో. మీకు తెలిసిన దానికంటే ఇది ఎక్కువే చెబుతుంది’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
బాలీవుడ్ భామ కరీనా కపూర్ తన స్టెప్ డాటర్ సారా అలీ ఖాన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సారా చిన్నప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నేడు శ్రీదేవి జయంతి సందర్భంగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‘ఐ లవ్ యూ అమ్మా’ అంటూ తన తల్లితో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి ఎరుపు రంగు ట్రెండీ డ్రస్ ధరించి గులాబీ పువ్వు పట్టుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ప్రేమ అనేది పువ్వు లాంటిది.. దానిని పెరగనివ్వండి’ అంటూ చెప్పుకొచ్చిందీ భామ.
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే అరిటాకులో భోజనం చేస్తోన్న ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘కృష్ణాష్టమి సందర్భంగా అమ్మ అరిటాకులో భోజనం వడ్డించింది. ఎంతో రుచికరంగా ఉంది. థ్యాంక్యూ మమ్మీ!’ అంటూ రాసుకొచ్చిందీ సుందరి.
వీరితో పాటు అందాల తారలు మెహరీన్, నభా నటేష్, అమీ జాక్సన్, తేజస్వి, రష్మి, అనసూయ కూడా తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...