నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి.. రానా-మిహీకాల వివాహం ఈనెల 8న జరగబోతుండడంతో వధూవరుల ఇళ్లలో పెళ్లి సందడి నెలకొంది. ఈ సందర్భంగా హల్దీ, మెహెందీ ఫంక్షన్స్‌లో దిగిన ఫొటోలను కొత్త పెళ్లికూతురు అభిమానులతో పంచుకుంది..
టాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ ఫాలోవర్ల సంఖ్య 15 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టర్ని పోస్ట్ చేసిందీ బ్యూటీ.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం నేటికి ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఆ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ని అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన చిత్రం ‘గుంజన్ సక్సేనా’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో OTTల్లో కొన్ని సినిమాలు విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ భామ డిజిటల్ వేదికగా తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ‘డిజిటల్ ప్రమోషన్స్‌లో నా హావభావాలు’ అంటూ వివిధ ఎక్స్‌ప్రెషన్స్‌లో దిగిన ఫొటోలను కొలేజ్ చేసి పోస్ట్ చేసిందీ బాలీవుడ్ దివా.
మహేష్ బాబు గారాల పట్టి సితార ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా క్లియో అనే పిల్లికి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసింది. ‘చూశారా.. ఈ పిల్లి ఎంత క్యూట్‌గా ఉందో! నేను జర్మనీలోని బ్రెన్నర్స్ పార్క్ హోటల్లో ఉన్నప్పుడు ఈ పిల్లిని చూశాను. అది మా హోటల్ రూమ్‌కి వచ్చి తనిఖీ చేస్తూ, అన్ని గదులు తిరుగుతూ భలే సందడి చేసింది..’ అంటూ పర్ఫెక్ట్, లవ్ఫర్పెట్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ లవ్లీ డాటర్.
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేసింది. ‘క్రికెట్‌ని ఎంతో మిస్సవుతున్నా.. నేను అడడానికి ఎప్పుడైనా రడీ!’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ భామ.
అందాల తార అమలా పాల్ రక్షా బంధన్ సందర్భంగా తన సోదరులతో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
ప్రముఖ యాంకర్ ఝాన్సీ ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చేనేత కార్మికులు చీరను ఎలా నేస్తారో క్లుప్తంగా వివరించారు. మీరూ ఆ వీడియోని ఓసారి చూసేయండి...
టాలీవుడ్ భామ రాశీ ఖన్నా గిటారు వాయిస్తోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఏదైనా నేర్చుకునేంత వరకు కష్టమే! ఈ వీడియోని మ్యూట్ చేశాను.. కానీ త్వరలో నా గిటార్ ట్యూన్‌ని మీకు వినిపిస్తాను.. హాహా.. ఇప్పుడు ఇంకో పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిందీ భామ.
ఈ సంవత్సరం(2020) కరోనా కారణంగా విభిన్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో 2020 మూడ్స్ అంటూ పలువురు తారలు జనవరి నుంచి సెప్టెంబర్ దాకా.. వారి హావభావాలెలా ఉంటాయో తెలిపే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ జాబితాలో మన ముద్దుగుమ్మలు మంచు లక్ష్మి, కాజోల్, ప్రియాంక చోప్రాలు కూడా ఉన్నారు. ఆ ఫొటోలనూ మీరూ చూసేయండి మరి...
వీరితో పాటు అందాల తారలు సమంత, నభా నటేష్, ప్రణీత, అదా శర్మ, ప్రగ్యా జైస్వాల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, వాటిపై మీరూ ఓ లుక్కేయండి...