నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేని తన కుటుంబ సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘భౌతిక దూరం పాటించడం అంత కష్టంగా ఏమీ లేదు.. ఇది మన ప్రమేయం లేకుండా వచ్చింది’ అంటూ ఫ్రెండ్స్ టైమ్ హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
తెలుగు భామ సమీరా రెడ్డి తన కూతురు నైరాతో సరదాగా గడిపిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘తల్లీకూతుళ్ల సంభాషణలు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చిందీ భామ.
ఎనర్జిటిక్ యాంకర్ సుమా కనకాల తన ఎనర్జీ వెనకున్న రహస్యాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా సూర్యనమస్కారాలు చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేస్తూ ‘యోగా మ్యాట్.. గెట్ సెట్ గో.. సూర్యనమస్కారాల వల్ల నాకు లభించే శక్తి వెలకట్టలేనిది. ఆ శక్తి ఎలాంటిదంటే.. ఉదయాన్నే ఫోన్‌కి 100% ఛార్జింగ్ పెట్టినట్టన్నమాట. ఆ శక్తితోనే రోజంతా ఎనర్జిటిక్‌గా గడిపేస్తాను. వారమంతా రకరకాల వ్యాయామాలు చేస్తాను. కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటాను. కొన్ని సంవత్సరాలుగా ఈ శక్తే నన్ను నడిపిస్తోంది. దయచేసి మీరు వీడియోలో ఉన్నంత వేగంగా చేయకండి’ అంటూ తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టిందీ యాంకర్.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మీలో దాగి ఉన్న శక్తిని ఎప్పటికీ మర్చిపోకండి’ అంటూ అభిమానుల్లో పాజిటివిటీని నింపుతోందీ భామ.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఫ్రెండ్స్... మీరు కబుర్లు చెప్పుకునే మీ హ్యాంగౌట్ అడ్డాలను ఎంతమంది మిస్సవుతున్నారు? 1 నుంచి 10 అంకెలలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నా ఎంపికైతే 15. ఈ జ్ఞాపకాలు నాకు ఎంతో ఇష్టమైనవి’ అంటూ రాసుకొచ్చిందీ చిన్నది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి వివిధ చీరల్లో ముస్తాభైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఆరు గజాల ప్రేమలో ఆనందంతో మునిగిపోయాను! నాకు ఇష్టమైన, నేను కట్టుకున్న చీరల ఫొటోల కోసం స్వైప్ చేయండి’ అంటూ రాసుకొచ్చిందీ సుందరి.
అందాల నటి ఖుష్బూ తన పెట్ (సొన్నీ)తో సీరియస్‌గా ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ.. ‘సీరియస్ డిస్కషన్ అంటే ఇదే’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
సుశాంత్ సింగ్ చనిపోయి దాదాపు నెల రోజులు కావొస్తున్నా తమ జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నారు పలువురు తారలు. తాజాగా నటి స్నేహా ఉల్లాల్.. సుశాంత్ తన పెట్స్‌కి ఆహారం పెట్టిన ఫొటోని తన అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు లావణ్యా త్రిపాఠి, రష్మీ, గీతా మాధురి, మల్లికా శెరావత్, సన్నీ లియోనీ, తేజస్విలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...