నేటి ఇన్‌స్టాపురం విశేషాలు..
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రీతూ వర్మ నటించిన చిత్రం ‘పెళ్లిచూపులు’. చిన్న సినిమాగా విడుదలై మంచి కలెక్షన్లు పొందిన ఈ చిత్రం విడుదలై నేటికి నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా రీతూ వర్మ అప్పటి జ్ఞాపకాలను, ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
అలనాటి అందాల తార ఖుష్బూ యోగాసనాలు వేస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ.. ‘టెస్టింగ్ ఫ్లెక్సిబిలిటీ’ అనే క్యాప్షన్‌ని జోడించింది.
‘బిగ్‌బాస్’ బ్యూటీ హరితేజ తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ‘నా భుజం తట్టే నా ధైర్యం.. నన్ను వెంట ఉండి నడిపించే నా మార్గం.. నా మొదటి నేస్తం.. కష్టంలో నా రక్షక కవచం.. నాన్న అనే ఆ ఒక్క సంబంధం.. కోటి దేవతలతో సమానం.. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. లవ్ యూ సో మచ్’ అంటూ ఎమోషనల్ అయ్యిందీ భామ.
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. తన కూతురు గురించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సితార గొడుగు పట్టుకొని ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘వర్షాకాలానికి స్వాగతం.. జపనీస్ స్టైల్.. తను ఎక్కడికి వెళ్లినా ఫొటోకి పోజివ్వడంలో దిట్ట’ అంటూ త్రోబ్యాక్, దుబాయ్, ట్రావెల్ డైరీస్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను జోడించిందీ సుందరి.
బాలీవుడ్ భామ మలైకా అరోరా తను మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘సరైన పద్ధతిలో మాస్క్ ధరించండి.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. ఇతరుల్ని మహమ్మారి నుంచి కాపాడండి’ అంటూ అభిమానులకు జాగ్రత్తలు సూచిస్తోంది.
సింగర్ మధుప్రియ ‘2013లో నేను’ అంటూ అప్పటి ఫొటోని అభిమానులతో పంచుకుంది.
Also Read: అందుకే బ్లాక్ & వైట్ ఫొటోలతో ఈ ఛాలెంజ్!
కొద్దిరోజులుగా ‘మహిళలకు మహిళలే అండ’ అనే ఛాలెంజ్ ఇన్స్టాపురంలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొంతమంది తారలు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పోస్ట్ చేసి ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. వీరిలో రష్మిక మందన, నివేదా థామస్, హెబ్బా పటేల్, ప్రగ్యా జైస్వాల్, నభా నటేష్, అదా శర్మ, అనుష్కా శర్మ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కత్రినా కైఫ్‌లు ఉన్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...