నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ దేనికోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ఫొటోకి తగ్గట్టే ‘ప్రపంచమంతా ఎప్పుడెప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటుందా అని వేచిచూస్తున్నా’ అని రాసుకొచ్చిందీ సుందరి.
హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ తన పిల్లల ఫొటోని అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో పిల్లలు అయాన్, అర్హలు రెయిన్ కోట్ ధరించి వర్షంలో నిల్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు.
అందాల తార అమీ జాక్సన్ లావెండర్ పూల తోటలో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో తన బాయ్‌ఫ్రెండ్ జార్జ్ పనాయొటోతో పాటు వారి ముద్దుల కొడుకు కూడా ఉన్నాడు.
డ్యాన్సర్, బిగ్‌బాస్ ఫేమ్ దీప్తి సునైనా తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ‘పోగొట్టుకున్న ఆనందం కోసం వెతుకుతున్నా’ అనే క్యాప్షన్‌ని జోడించిందీ ఈ సుందరి.
నటి ప్రణీత కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. తనతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే శివరాజ్‌కుమార్ సర్.. మీరు మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. వయసు పైబడుతున్నా మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటో మాకూ చెప్పండి..!’ అంటూ మాస్ లీడర్, హ్యాపీ బర్త్ డే శివన్న అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసిందీ సుందరి.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అతని కొడుకు అభిషేక్ బచ్చన్‌కి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.. ఈ తండ్రీకొడుకులిద్దరూ కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. ‘మీరిద్దరూ త్వరగా వైరస్ బారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ తన స్నేహితులతో కలిసున్నట్లుగా ఉన్న ఓ పెయింటింగ్‌ని తన అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు.. అందాల తారలు భూమికా చావ్లా, లావణ్యా త్రిపాఠి, శ్రీముఖి తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...