నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
టాలీవుడ్ సుందరి సమంత అక్కినేని లాక్డౌన్ కాలాన్ని తోటపని, యోగాతో సద్వినియోగం చేసుకుంటోన్న సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుందీ భామ.
తాజాగా శీర్షాసనం వేస్తున్నట్టుగా తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. ‘కంగ్రాట్స్.. మనం జులైలోకి’ వచ్చేశాం’ అంటూ దీనికి క్యాప్షన్ రాసుకొచ్చింది.
బాలీవుడ్ అందాల భామ కాజోల్ క్వారంటైన్ కాలంలో ఇంట్లోనే ఓ కొత్త ఫ్రెండ్‌ని కనిపెట్టింది. ఆ ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోని కూడా పోస్ట్ చేసిందీ సుందరి. ‘మరి మీరు కూడా ఎవరినైనా కనిపెట్టారా?’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
గాయని మధుప్రియ ‘హి ఈజ్ సో క్యూట్.. హి ఈజ్ సో స్వీట్.. హి ఈజ్ సో హ్యాండ్సమ్’ అంటూ డ్యాన్స్ చేస్తున్న వీడియోని తన అభిమానులతో పంచుకుంది.
కరోనా కల్లోలం కారణంగా ఇప్పుడు స్కూల్స్ నడవడం లేదు. దాంతో ఆన్లైన్ క్లాసుల వైపు అడుగులు వేస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో ఆన్లైన్లో క్లాస్ చెప్పేటప్పుడు టీచర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిపే ఓ ఫన్నీ యానిమేషన్ వీడియోని పోస్ట్ చేసింది టాలీవుడ్ భామ మంచు లక్ష్మి. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ 100 రోజుల లాక్డౌన్ తర్వాత బయటకు వచ్చింది. సెలూన్‌కి వెళ్లి హెయిర్ స్టైలింగ్, కలరింగ్ చేయించుకుంది. ‘ఇవన్నీ ఒకేసారి చేయించుకున్నానంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ సుందరి.
అందాల యాంకర్ శ్యామల పర్పుల్ కలర్ పట్టు చీరలో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ‘మీరు ఏం చేయాలనుకున్నా సరే.. అది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూసుకోండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
వీరితో పాటు సినీ తారలు.. పూజా హెగ్డే, బిపాసా బసు, రాశీ ఖన్నాలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై లుక్కేయండి...