మహేష్ సతీమణి నమ్రతకు టాలీవుడ్ అందాల భామ రష్మిక ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించింది. ఇంతకీ అదేంటో తెలుసా? మామిడి కాయలు, ఆవకాయ పచ్చడి పెట్టడానికి అవసరమైన దినుసులు.
వీటిని అందుకున్న నమ్రత రష్మికకు థ్యాంక్స్ చెబుతూ ‘కూర్గ్ నుంచి వీటిని పంపించినందుకు కృతజ్ఞతలు.. కోవిడ్ సమయంలో నాకు వచ్చిన మొట్ట మొదటి బహుమతి ఇదే’ అంటూ ‘స్టే హోమ్ స్టే సేఫ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందీ సూపర్ స్టార్ వైఫ్.
బాలీవుడ్ గాయని నేహా కక్కర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య నాలుగు కోట్లకు చేరింది. దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఈ భామ తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది.
‘ఒకటి విరుగుతుంది.. కానీ శబ్దం రాదు.. ఏంటో చెప్పు’ అంటూ దీప్తి సునైనాని పొడుపు కథలు పొడుస్తూ ఎంజాయ్ చేస్తోంది అందాల తార హిమజ. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోని తన అకౌంట్లో పోస్ట్ చేసిందీ సుందరి. ఈ వీడియో ఎప్పటిదో తెలీదు కానీ- బిగ్ బాస్ కంటెస్టెంట్లు శివ జ్యోతి, రవి కృష్ణలు కూడా ఇందులో కనిపిస్తున్నారు.. మరి సమాధానం కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి.
ఒకప్పటి బాలీవుడ్ లవ్లీ హీరోయిన్ సమీరా రెడ్డి తన పిల్లలు, ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుందన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తన పాప నైరా తన అన్న తింటున్న లాలీపాప్ ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది. దీనికి సిబ్లింగ్ లవ్, అన్నాచెల్లెలు, మాతృత్వం వంటి హ్యాష్ట్యాగ్లని జోడించిందీ సుందరి.
వీరితో పాటు అందాల తారలు.. అమీ జాక్సన్, భూమికా చావ్లా, హెబ్బా పటేల్‌లు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.. మరి, మీరూ వాటినోసారి చూసేయండి...