నేటి ఇన్‌స్టాపురం విశేషాలు...
మీరే నాకు స్ఫూర్తి!
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన ఫొటోని పోస్ట్ చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. అభిమానులకు థ్యాంక్స్ చెప్పడమేంటీ అనుకుంటున్నారా? 2010లో అమెరికాలోని ఒహాయో రాష్ట్రం జూన్ 26ని ‘ శ్రేయా ఘోషల్ డే’ గా ప్రకటిస్తూ ఆమెను గౌరవించింది. దాంతో ప్రతి ఏడాది తన అభిమానులు మర్చిపోకుండా జూన్ 26ని సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్నటితో 10 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎప్పటిలాగే అభిమానులు శ్రేయా ఘోషల్ పైన ప్రేమాభిమానాలు కురిపించారు.
దానికి ఈ గాయని అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ- "ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజుని సెలబ్రేట్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. దీనిని ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. మీ గుండెల్లో నిలిచిపోయే పాటలను అందించడానికి మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. శక్తిని ప్రసాదిస్తున్నారు. లవ్ యూ..." అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
అందుకు ఆనందంగా ఉంది!
టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు తన కూతురితో కలిసున్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. ‘నాకు మంచి లాక్డౌన్ పార్ట్ నర్ ఉన్నందుకు ఆనందంగా ఉంది’ అనే క్యాప్షన్‌ని కూడా రాసుకొచ్చిందీ సుందరి.
నీ మనసు ఎంతగా గాయపడిందో..!
‘ఖుషి’ భామ భూమికా చావ్లా తను వేసిన పెయింటింగ్స్‌ని అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా మరో పెయింటింగ్‌ని పోస్ట్ చేస్తూ గుండెలకు హత్తుకునే క్యాప్షన్ రాసింది.
“కొంతమంది పైకి ఎంత అందంగా, ఆనందంగా కనిపించినా- అదే సమయంలో భగ్నమైన కోరికలు, ఆశయాలతో లోపల ఎంత అగాధంలో కొట్టుమిట్టాడుతుంటారో ఇది గుర్తుకు తెస్తోంది.. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడి ఆశీస్సులు ఉండాలి...నిన్ను మర్చిపోలేకపోతున్నాను..నీ మనసు ఎంతగా గాయపడిందో..! ఇప్పుడు నీ కుటుంబం ఎంతగా బాధపడుతోందో...! నీ కోసం ప్రార్ధిస్తున్నాను.. భయాలతో, డిప్రెషన్‌తో బాధపడే ప్రతి ఒక్కరి కోసం ప్రార్ధిద్దాం.. మాట్లాడదాం..!” అంటూ తన బాధను పంచుకుంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఉద్దేశించి పంచుకున్న ఈ పోస్టుకి అభిమానులు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
"మరింతగా ప్రేమించడం కన్నా ప్రేమకు మరో పరిష్కారం లేదు"- అనే కొటేషన్ ని పంచుకుంటూ తన ఫొటోని పోస్ట్ చేసింది మరో అందాల భామ ఈషా గుప్తా.
బాలీవుడ్ భామ కరీనా కపూర్ మాస్క్ ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘అందరూ తప్పకుండా మాస్క్ ధరించండి.. హ్యాపీ వీకెండ్, స్టే సేఫ్’ అంటూ రాసుకొచ్చింది.
మరో భామ నమ్రతా శిరోద్కర్ తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోని తన అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు.. అదా శర్మ, దీప్తి సునైనా, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోనీలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి, మీరూ వాటిపై ఓ లుక్కేయండి...