scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

సముద్రమూ లేదు.. అలలూ లేవు.. అంతా భ్రమ!

latest posts of celebrities in social media

అమ్మ.. ‘బొమ్మాళీ’!

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on


హీరోలతో సమానమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో అనుష్కా శెట్టి ఒకరు. ‘అరుంధతి’ సినిమాతో మహిళా ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త క్రేజ్‌ తీసుకొచ్చిందీ బొమ్మాళి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది స్వీటీ. అనుష్కకు సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉందన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on


తాజాగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞత చెబుతూ ఓ పోస్ట్‌ చేసిందీ బ్యూటీ. 30 లక్షల ఫాలోవర్లు, అందరికీ థ్యాంక్యూ చెబుతున్నట్లుగా ఓ అందమైన పెయింటింగ్‌ థీమ్‌తో కూడిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన స్వీటీ.. ‘నాపై ఎనలేని ప్రేమ చూపిస్తూ, నా వెన్నంటే ఉండి నాకు సహకరిస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు. మీరంతా బాధ్యతాయుతంగా ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నారని ఆశిస్తున్నాను..’ అని క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. తనను ఇన్‌స్టాలో 30 లక్షల మంది ఫాలో అవుతుండగా.. అనుష్క మాత్రం కేవలం 17 మందినే ఫాలో అవుతోంది.
సముద్రం లేదు.. అలలూ లేవు..!

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) onతనదైన పంచ్ డైలాగ్‌లతో, హాస్యచతురతతో ఎలాంటి వేదికనైనా షేక్‌ చేసేస్తుంది ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సుమక్క.. సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు అనుక్షణం టచ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పలు ఫన్నీ పోస్ట్‌లు పెడుతూ అందరికీ మరింత చేరువవుతోందీ సూపర్బ్‌ యాంకర్‌.

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on


ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా సుమ చేసిన ఓ పోస్ట్‌ నవ్వులు పూయిస్తోంది. ‘వావ్‌.. సముద్రపు ఒడ్డున’ అనే క్యాప్షన్‌ను జోడించి ఓ వీడియోను పోస్ట్‌ చేసింది సుమ. ఇక ఈ వీడియోలో తాను మాట్లాడుతూ.. ‘ఆహా.. ఈ సముద్రతీరంలో.. ఈ సమయంలో.. ఈ చల్ల గాలిలో.. ఎంత బాగుందో’ అని చెబుతూ కెమెరాను దూరంగా తీసుకెళ్లింది. అదేంటీ..? లాక్‌డౌన్‌ సమయంలో సుమ బీచ్‌కు ఎలా వెళ్లిందనేగా మీ డౌట్‌..? అసలు విషయమేంటంటే.. సుమ తన అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో గాలి వీస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేసింది. ‘సముద్ర తీరం లేదు.. అలలూ లేవు.. బాల్కనీలో ఉన్నాను. ఒట్టి ఊహే.. అలా ఉన్నట్లు భావిద్దాం’ అంటూ వీడియో చివర్లో సుమ చెప్పిన మాటలు ఆమెలోని హాస్యచతురతను మరోసారి బయటపెట్టాయి.
ఏ వారమైతే ఏంటి..?

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on


లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారవేత్తల దగ్గర్నుంచి ఉద్యోగుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎలాంటి పనులు లేక ఇంట్లోనే ఉండడంతో క్యాలెండర్‌లో మారుతోన్న తేదీలు, వారాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రావట్లేదు.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol) on


తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్. ‘ఏదైతే ఏముంది’ అన్నట్లుగా ఉన్న స్టిల్‌లో క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ డస్కీ బ్యూటీ.. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఆదివారం, సోమవారం.. ఏ వారమైనా ఒకటే..’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.
‘కొంటె పిల్ల’.. క్వారంటైన్‌ మూడ్స్‌ చూశారా?

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


‘ఒరు అదార్‌ లవ్‌’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. సినిమా విడుదలకు ముందే కొంటెగా కన్ను గీటి రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయిందీ మలయాళీ బ్యూటీ. సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన లేటెస్ట్‌ ఫొటోలు, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా లాక్‌డౌన్‌లో భాగంగా ఇంటికే పరిమితమైన ప్రియ.. ప్రస్తుతం తన మూడ్‌ ఎలా ఉందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్‌ చేసింది. రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘క్వారంటైన్‌ మూడ్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

View this post on Instagram

Quarantine moods 3/3

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on


View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) onకూతురితో స్టెప్పులేసిన గబ్బర్‌!

View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on


తండ్రీ కూతుళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్ననే హీరోగా భావించి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తుంది కూతురు. ఇక కూతురిని తన కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నాన్న. అలాంటి తండ్రీకూతుళ్ల అమూల్యమైన ప్రేమకు అద్దం పడుతోంది టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తాజాగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో.

View this post on Instagram

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on


మంగళవారం (మే 5) శిఖర్‌ ధావన్‌ కూతురు (స్టెప్‌ డాటర్‌) అలియా ధావన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అలియాతో కలిసి గతంలో ఓసారి డ్యాన్స్‌ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన శిఖర్‌.. ‘హ్యాపీ బర్త్‌డే మై ఏంజెల్‌..! నువ్వెప్పటికీ తారలా వెలుగుతూనే ఉండాలి. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను. జాగ్రత్తగా ఉంటూ ఈరోజును బాగా ఆస్వాదించు..’ అనే క్యాప్షన్‌ను జోడించాడీ స్టార్‌ ప్లేయర్‌.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More