scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నా ప్రపంచంలో వెలుగులు నింపిన దేవతవు నువ్వు!

latest posts of celebrities in social media

నా ప్రపంచంలో వెలుగు నింపేది నువ్వే..!

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli) on


ది మోస్ట్‌ లవ్లీ కపుల్‌ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అనుష్కా శర్మ-విరాట్‌ కోహ్లీ. స్నేహంతో మొదలైన వీరి బంధం ప్రేమగా మారి, చివరికి పెళ్లి పీటలెక్కింది. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే ఈ జంట.. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు రెక్కలు కట్టుకొని విహారయాత్రలకు వెళ్తుంటారు. వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం ఈ జంటకు అలవాటు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్‌ కపుల్ తమ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli) on


ఈ క్రమంలోనే తాజాగా అనుష్క పుట్టినరోజు (మే 1) సందర్భంగా విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. భార్య అనుష్కకు ప్రేమతో కేక్‌ తినిపిస్తోన్న సమయంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన కోహ్లీ.. ‘ఈ ప్రపంచంలో వెలుగులు నింపిన దేవతవు నువ్వు. నా ప్రపంచంలోనూ రోజూ వెలుగులు నింపుతూనే ఉన్నావు.. ఐలవ్యూ’ అంటూ కాస్త ఎమోషనల్‌గా రాసుకొచ్చాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ.టైంపాస్‌ కావట్లేదా..?

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on


లాక్‌డౌన్‌ కారణంగా మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కాలక్షేపం కోసం షటిల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌ ఇలా ఎన్నో రకాల ఆటలు ఆడేవారు.. కానీ ఇప్పుడు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఏం చేయాలో తోచక బోర్‌గా ఫీలవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే రకరకాల యాప్‌లను ఉపయోగిస్తూ రూపొందించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on


అలాంటి ఓ కొత్త యాప్‌తో రూపొందించిన ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది ఎనర్జిటిక్‌ యాంకర్‌ సుమ కనకాల. ఒకవేళ బాస్కెట్‌ బాల్‌ మాట్లాడితే ఎలా ఉంటుందో, అలాంటి ఓ వీడియోను రూపొందించిన సుమ.. ఆ వీడియోతో పాటు.. ‘బాస్కెట్‌ బాల్‌/టెన్నిస్‌/క్రికెట్‌లను చాలా మిస్‌ అవుతున్నారా? అయితే టైంపాస్‌ కోసం ఇది చేయండి’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించిందీ స్టార్‌ యాంకర్‌.తమ్ముడితో సరదాగా..!

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపే వారు కూడా లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. చివరికి సినీ సెలబ్రిటీలు కూడా ఇంట్లోనే కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలో వారు దిగిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on


తాజాగా అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తమ్ముడితో కలిసి జాలీగా గడుపుతోన్న వీడియోను అభిమానులతో పంచుకుంది. తమ్ముడితో చిన్ననాటి ఆటలు ఆడుతోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘సమయం మనల్ని మళ్లీ చిన్నతనంలోకి తీసుకెళ్తే ఇలా జాలీగా ఉంటుంది’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ. ఈ వీడియోలో రకుల్‌ తమ్ముడితో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక వీడియో చివర్లో వచ్చే ‘మీతో కుటుంబం ఉన్నప్పుడు.. అంతా ఆనందమే’ అనే కొటేషన్‌ ఆకట్టుకుంటోంది.చీకటిని కాదు.. వెలుతురును చూడండి..!

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీల్లో యాంకర్‌ అనసూయ కూడా ఒకరు. విషయమేదైనా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే ఈ బ్యూటిఫుల్‌ యాంకర్‌.. తన వ్యక్తిగత ఫొటోలతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటుంది.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అనసూయ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో, దానికి ఆమె జోడించిన క్యాప్షన్‌ ఆలోచింపజేసేలా ఉన్నాయి. చీకటి గదిలో వెలుగుతోన్న ఓ ల్యాంప్‌ను చేతిలో పట్టుకొని దానివైపు చూస్తోన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘జీవితమైనా, వ్యక్తులైనా.. అది మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. చీకటిని చూడడానికి బదులు.. వెలుగుతోన్న దీపాన్ని చూడండి. భయాన్ని చూసే కంటే ప్రేమను చూడండి. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచించండి’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media