scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

తాత పాట.. మనవరాలి ఆట..!

Latest posts of celebrities in social media

చరిత్ర సృష్టించి మూడేళ్లయ్యింది..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

అనుష్క (దేవసేన)

‘బాహుబలి 2’ మూడేళ్ల పండగను జరుపుకొంటోంది. థ్యాంక్యూ ఆల్‌..!

View this post on Instagram

A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on

తమన్నా (అవంతిక)

ఈ సినిమా విడుదలై అప్పుడే మూడేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను..! ఈ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్న తొలిరోజు.. అంటే రాజమౌళి గారి దర్శకత్వంలో నటించాలన్న నా కల నిజమైన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ.. ఈ సినిమాను తమ గుండెల్లో పెట్టుకొని ఆదరించిన ప్రేక్షకులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా..!

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

బాహుబలి (ప్రభాస్)

‘బాహుబలి 2’ దేశవ్యా్ప్తంగా ప్రేక్షకులు మెచ్చిన సినిమా మాత్రమే కాదు.. నా జీవితంలో ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిన సినిమా..! ఇలాంటి గొప్ప సినిమాను నాకు అందించినందుకు రాజమౌళికి నా కృతజ్ఞతలు..! ఈ క్రమంలో నా అభిమానులకు, ‘బాహుబలి’ బృందానికి ఎంతగానో రుణపడి ఉంటాను.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) onతాత పాట.. మనవరాలి ఆట..!

మెగాస్టార్‌ చిరంజీవికి పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనవలు, మనవరాళ్లతోనే గడుపుతుంటారు చిరు. ఈ క్రమంలో ఆయన తన చిట్టి మనవరాలు నవిష్క (శ్రీజ-కళ్యాణ్‌ల కుమార్తె)తో సరదాగా ముచ్చటిస్తుండగా తీసిన ఓ వీడియోను చిరు తాజాగా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

View this post on Instagram

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on

ఈ వీడియోలో చిరు తన మనవరాలిని ‘నీకు ఏ పాట కావాలి..?’ అని అడగగా.. ‘మిమ్మీ..’ అని నవిష్క బదులిచ్చింది. ‘మిమ్మి పాటను ఎన్నిసార్లు చూస్తావు.. వేరే పాట ఏదైనా చెప్పు..’ అని చిరు అంటే తను అదే పాట కావాలి అన్నట్లు ఏడుపు మొదలు పెట్టింది. వెంటనే చిరు ‘సరే.. సరే.. ఏడవకు. మిమ్మీ పాటను పెడుతున్నా..!’ అని టీవీలో ఆ వీడియో సాంగ్‌ను ప్లే చేస్తారు. ఆ పాట మరేదో కాదు మెగాస్టార్‌ నటించిన ‘ఖైదీ నం. 150’ సినిమాలోని ‘సాయం కాలానా.. సాగర తీరానా’ అనే పాట. ఈ పాట ప్లే చేయగానే నవిష్క చిరునవ్వులు చిందిస్తూ, చిన్న చిన్న స్టెప్పులేస్తూ.. రెప్పార్పకుండా ఆ వీడియోను చూసింది. చిరు కూడా తన మనవరాలితో కలిసి స్టెప్పులేస్తూ మురిసిపోయాడు.

View this post on Instagram

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

చిరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘సంగీతానికి ఉన్న శక్తిని చూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను..! సంవత్సరం వయసున్న ఈ చిన్నారి మ్యూజిక్‌ వింటూ ఆనందంతో ఎలా డ్యాన్స్‌ చేస్తోందో చూడండి. తను ఈ పాటను నిజంగా ఎంజాయ్‌ చేస్తోందో లేదో తెలుసుకోవడానికి.. పాటను మధ్యలో పాజ్‌ చేసి మళ్లీ ప్లే చేశాను. ఈ పాట నాది కాబట్టి.. అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్‌ నాకే..!’ అంటూ తనదైన స్టైల్‌లో రాసుకొచ్చాడు మన ముఠామేస్త్రి.ఈ డైలాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో సినిమా తారలు ఈ సమయాన్ని తమ మనసుకు నచ్చిన పనులు చేసేందుకు వినియోగిస్తున్నారు. అంతేకాదు, తమ క్వారంటైన్‌ ముచ్చట్లను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటున్నారు. ఈ నేపథ్యంలో గ్లామర్‌ డాల్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా రెండు టిక్‌టాక్‌ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

‘ఈ పంజాబీ డైలాగ్‌ అంటే నాకు చాలా ఇష్టం..! సౌండ్‌ కాస్త బిగ్గరగా వచ్చినా.. పంజాబీ స్టైల్‌లో మాట్లాడడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను..!’

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) on

ఇంట్లో ఉండండి.. డ్యాన్స్‌ చేయండి.. ఫిట్‌గా ఉండండి..!

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal) onఆ సువాసన అంటే నాకు చాలా ఇష్టం..!

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో మంచు లక్ష్మి కూడా ఒకరు. అది ఎంత చిన్న విషయమైనా సరే తన మనసుకు ఆనందాన్ని కలిగిస్తే చాలు.. వెంటనే ఆ ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకోవడం లక్ష్మికి అలవాటు. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన మల్లెపూల గురించి తాజాగా ఓ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on

‘మల్లెపూలు పెట్టుకున్నా..! ఇవి మా నాన్న గారింట్లో పెరిగినవి..! అమ్మ తెచ్చి నా జడలో పెట్టింది. తాజా మల్లెపూల నుంచి వచ్చే సువాసనంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు..?’ అని రాసుకొచ్చిందీ తార.

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) onఇది మీ కోసమే!

ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల్లో బాలీవుడ్‌ బ్యూటీ సుస్మితా సేన్‌ కూడా ఒకరు. వృత్తిపరంగా తను ఎంత బిజీగా ఉన్నా.. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, వ్యాయామాలు చేస్తుంటుందీ బ్యూటీ. అంతేకాదు, వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. ధ్యానం చేసే సమయంలో మనసుకు ఆహ్లాదం పంచే ఓ ఆడియోను సుస్మిత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

‘భౌతిక దూరం అంటే మానసికంగా దూరం ఉండడం కాదు..! నిజానికి ఇదివరకు కంటే మన మనసులు ఇప్పుడే ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మీ అందరి కోసం ఓ ఆడియో ట్రాక్‌ను తీసుకొచ్చాను. మీ మనసును ప్రశాంతంగా మార్చేందుకు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ ఆడియో ట్రాక్‌ను రోమన్‌ షాల్‌ (సుస్మిత బాయ్‌ఫ్రెండ్‌), అలీసా (సుస్మిత రెండో దత్త పుత్రిక) కలిసి రూపొందించారు. ఇందులో మేము ‘Desert Rose’ అనే పాటలోని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ను ఉపయోగించాం’ అని రాసుకొచ్చిందీ బ్యూటీ.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నచ్చిన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు!

ఇవి కోరుకున్న సెలవులు కావు.. కానీ ప్రజలు ఇన్ని రోజులుగా ఇంటికే పరిమితమవడం ఇదే తొలిసారి కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. మరి, ఇలా అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌. గాలికి గజ్జెలు కట్టుకొని ఇంట్లో క్లాసికల్ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఇక ఈ వీడియోతో పాటు ‘ఈ విలువైన సమయాన్ని వృథా చేయకుండా.. పూర్తిగా వినియోగించుకుందాం.. మనకిష్టమైన పని చేయనివ్వకుండా ఏదీ మనల్ని ఆపలేదు..’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించిందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు.?

‘కరోనా’ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా షట్‌డౌన్‌అవుతోంది. వైరస్‌ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రభుత్వాలు, అధికారులు చాలా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను ప్రజలు ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే సెలవులు వచ్చినా బయటకు వెళ్లలేకపోతున్నామనే లోటు చాలామందిలో కనిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది అందాల తార రాశీ ఖన్నా. ఓ చేతిలో స్మార్ట్ ఫోన్.. మరో చేతిలో టీ కప్పుతో అలక బూనినట్లు మూతి పెట్టిన వీడియోను (జిఫ్ ఫైల్) ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ అందాల రాశి.. ‘ప్రతిరోజూ సెలవులాగే ఉన్నప్పటికీ.. మీరు ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంటే (అలకతో ఉంటే)’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అలా అయినప్పుడు మీరు బలంగా ఉన్నట్టా? లేనట్టా?

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ స్వీయ నిర్బంధంలో ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ.. ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ తమ అభిమానులను ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన టాలీవుడ్‌ బ్యూటీ శృతి హాసన్‌ కూడా తన ఇన్‌స్టాలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. తన పెంపుడు పిల్లి (క్లారా) ఎంతో ముద్దుగా కూర్చున్నప్పుడు క్లి్క్‌మనిపించిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘అందరూ క్లారాలా ఉండండి.. సామాజిక దూరం పాటించడం, ఇంటి పట్టునే ఉండడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పాజిటివ్‌గా ఆలోచించడం.. ఇలాంటివన్నీ మనం క్లారా నుంచే నేర్చుకోవాలి..’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ స్లిమ్మీ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నా మనసెంత పెద్దదో మీరే చూడండి!

తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్‌. అటు తెలుగులోనే కాకుండా వరుస తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుందీ లవ్లీ బ్యూటీ. సోషల్‌ మీడియాలో యమ చురుగ్గా ఉండే ఈ ‘ప్రేమమ్‌’ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు అప్పుడప్పుడూ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా అను.. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక ఫొటోని షేర్‌ చేసి బర్త్‌డే విషెస్‌ తెలిపింది. తన సోదరుడి వెనుక నిల్చొని ఆటపట్టిస్తున్నట్లుగా ఉన్న ఓ క్యూట్‌ పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటూ..‘హ్యాపీ బర్త్‌డే మంకీ (అక్షయ్‌ పరమేశ్వరన్‌).. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావని నాకు తెలుసు.. కానీ నువ్వు కనే కలల్లో కూడా నన్ను ప్రేమించడం ఆపుతావనే ఆలోచన నీకు రానివ్వను..’ అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిందీ అందాల అక్క.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

నేనెంతో ధనవంతురాలిని !

సెలబ్రిటీ కపుల్‌ శిల్పాశెట్టి- రాజ్‌కుంద్రాలు ఇటీవలే సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ విదితమే. తమ కుటుంబంలోకి లిటిల్‌ ఏంజెల్‌ ‘సమీషా శెట్టి’ అడుగుపెట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ క్రమంలో శిల్ప తాజాగా తన బుజ్జాయికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్‌ చేసింది. తన బుజ్జి పాపాయి పుట్టి నిన్నటితో (మార్చి 15) నెల రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. తనతో పాటు భర్త, కుమారుడు, పాప ఒకరి చేతిలో మరొకరు చెయ్యేసినట్లుగా ఉన్న ఈ ఫొటోను పంచుకుంటూ.. ‘ఇదే నీ మొదటి మైలురాయి.. నా లిటిల్‌ ప్రిన్సెస్‌ సమీషా.. నువ్వు పుట్టి నెల రోజులైన సందర్భంగా నీకు శుభాకాంక్షలు. నిన్ను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను..’ అంటూ ప్రేమతో రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

సంతోషంగా ఉండేవాళ్లే అందంగా ఉంటారు !

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి నిధి అగర్వాల్‌. రెండో చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’తో ఆకట్టుకున్న ఈ చిన్నది అనంతరం వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ సందడి చేస్తోందీ బ్యూటీ. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నిధికి తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌లుక్‌’ అనే మ్యాగజీన్‌ కవర్‌ పేజీపై పోజిచ్చిన తన ఫొటోలను అభిమానులతో పంచుకున్న ఈ చిన్నది.. దానికి ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ‘జీవితంలో ఎదగాలనుకోవడం, దిగజారిపోవడం.. ఈ రెండూ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి..’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.

Know More