scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

ఎవరూ దిక్కులేరు.. అన్నీ నేనే!

latest posts of celebrities on social media

నాకింతకంటే మంచి ఫొటో దొరకలేదు..!

View this post on Instagram

A post shared by Himaja Mallireddy (@itshimaja) on

బిగ్‌బాస్‌-3 రియాలిటీ షో తర్వాత తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది నటి హిమజ. అంతకు ముందు కొన్ని సీరియళ్లతో పాటు సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తోనే ఎక్కువ పేరు సంపాదించుకుందని చెప్పాలి. ఇటు సంప్రదాయబద్ధంగా, అటు మోడ్రన్‌గా ముస్తాబవుతూ దిగిన తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటుందీ బుల్లితెర స్టార్‌.

View this post on Instagram

A post shared by Himaja Mallireddy (@itshimaja) on

ఈ క్రమంలోనే తాజాగా హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. తోటి నటీమణులు స్నేహ, మధుమిత, ప్రవీణలతో కలిసి తాను పట్టు చీరలో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘శుభోదయం ఫ్రెండ్స్‌.. ఈ విషయం చెప్పడానికి నాకింతకంటే మంచి ఫొటో దొరకలేదు’ అని క్యాప్షన్‌ను జోడించింది. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్ర షూటింగ్‌లో భాగంగా సింహాచలంలో ఈ ఫొటో దిగారు.



ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించారు..?

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

కరోనా మహమ్మారి మనిషికి ఎన్నో పాఠాలు నేర్పిస్తోంది. ఎంత డబ్బున్నా ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలనే తత్వం బోధపడేలా చేస్తోంది. అందుబాటులో ఉన్న వనరులతోనే మన అవసరాలను ఎలా తీర్చుకోవాలో నేర్పిస్తోంది. అయితే దీనికి సెలబ్రిటీలు కూడా అతీతులేం కాదండోయ్‌..

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

తాజాగా ఎనర్జిటిక్‌ యాంకర్‌ సుమ కూడా ఇంట్లో ఉన్న వస్తువులతో తన అవసరాన్ని ఎలా తీర్చుకుందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. సుమ కెమెరా ముందు నిల్చొని మాట్లాడాలనుకుంది. అయితే తన దగ్గర కెమెరా స్టాండ్‌ లేదు. దీంతో కుర్చీలో దిండ్లు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లను ఒకదానిపై ఒకటి పేర్చి కెమెరాను సెట్‌ చేసి దాని ముందుకొచ్చి మాట్లాడింది. ఈ డిఫరెంట్‌ కెమెరా స్టాండ్‌కు సంబంధించిన వీడియోను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిందీ స్టార్‌ యాంకర్‌. ఇక ఈ వీడియోలో.. ‘ఇదేంటని అనుకుంటున్నారా? ఇదే నా కెమెరా స్టాండ్‌. నా దగ్గర మంచి కెమెరా స్టాండ్‌లు లేవు. అయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించారు?’ అంటూ సుమ చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వీడియోతో పాటు.. ‘మనసుంటే మార్గం ఉంటుంది. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి. స్టార్ట్‌ సౌండ్‌.. కెమెరా.. యాక్షన్‌’ అనే క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.



ఎవరూ దిక్కులేరు.. అన్నీ నేనే!

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

బుల్లితెర రాములమ్మగా పేరుగాంచింది యాంకర్‌ శ్రీముఖి. లాక్‌డౌన్‌ కారణంగా బుల్లితెరకు దూరమవడంతో యూట్యూబ్‌ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోందీ ముద్దుగుమ్మ. ‘శ్రీముఖి’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేసిన ఈ చిన్నది.. తోటి కళాకారులతో కలిసి ఫన్నీ వీడియోలను రూపొందిస్తోంది. అయితే ఈ వీడియోలను సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ.. ఎవరింట్లో వారు ఉంటూ చిత్రీకరిస్తుండడం విశేషం.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

తాజాగా ‘మీలో ఎవరికి బోర్‌ కొడుతోంది’ అనే వీడియోను రూపొందించారు. ఈ క్రమంలో ప్రోగ్రామ్‌కు ముందు శ్రీముఖి తానే స్వయంగా రడీ అయ్యింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘హల్లో ఉన్నారా.. క్వారంటైన్‌ ప్రయోగాల్లో భాగంగా ‘శ్రీముఖి’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఈరోజు మా తర్వాతి వీడియో రానుంది. హెయిర్‌ స్టైలింగ్, మేకప్‌, ఫొటోగ్రఫీ – ఎవరూ దిక్కులేరు.. అన్నీ నేనే! తప్పదు భరించాల్సిందే. ఓకే బై..’ అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను రాసుకొచ్చిందీ రాములమ్మ.



ప్రణీత మనసూ అందమే..!

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on

కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. ఉపాధి లేక ఎంతోమంది పస్తులుంటున్నారు. ఈ క్రమంలోనే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి తమ వంతు సాయం చేస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. ఈ క్రమంలో కొందరు ఆర్థికంగా సహాయం చేస్తుంటే, మరికొందరు తిండిలేని వారికి ఆహారాన్ని అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta) on

ఈ క్రమంలోనే అందాల తార ప్రణీత ఎంతోమంది అన్నార్తుల ఆకలిని తీరుస్తోంది. స్వయంగా తానే వంటచేసి మరీ ఆహార పొట్లాలను పంచుతోంది. వీటికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుందీ బ్యూటీ. ఇక ఇది చూసిన నెటిజన్లు ప్రణీతను ప్రశంసిస్తున్నారు. ఇది చూస్తుంటే ప్రణీత మనసు కూడా అందమే అనిపిస్తోంది కదూ!





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media