scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

నాకు కొత్త స్నేహితుడు దొరికాడు..!

latest posts of celebrities on social media

కరోనా వరల్డ్‌ టూర్‌ చేస్తోంది.. జాగ్రత్త!

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on


ఓవైపు కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నరకం చూపిస్తుంటే.. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరస్‌పై పేలుతోన్న జోక్స్‌ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే చాలు కరోనాకు సంబంధించిన ఏదో ఒక జోక్‌ కనిపిస్తూనే ఉంది. ఇక సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడూ ఇలాంటి ఫన్నీ విషయాలను షేర్‌ చేస్తున్నారు.

View this post on Instagram

Stay home till #corona world tour ends !🙏😂😅😅😂 #homequarantine #coronavirus #covid_19 #staysafe ❤️

A post shared by Raai Laxmi (@iamraailaxmi) on


తాజాగా అందాల తార రాయ్‌ లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది. ‘సాధారణంగా మనమంతా వరల్డ్‌ టూర్‌ చేస్తుంటాం. అయితే ఈసారి కరోనా వరల్డ్‌ టూర్‌ చేస్తోంది. జాగ్రత్తగా ఉండండి..’ అనే వాయిస్‌కు డబ్‌స్మాష్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘కరోనా వరల్డ్‌ టూర్‌ పూర్తయ్యేంత వరకూ ఇంట్లోనే ఉండండి’ అని ఫన్నీ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటీ.




మనుషులను వేరు చేసేది అదే..!

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on



సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీల్లో నటి, నిర్మాత రేణూ దేశాయ్‌ ఒకరు. తన మనసులోని ఎన్నో భావాలకు కవిత్వాన్ని జోడించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం ఈ సూపర్‌ మామ్‌కు అలవాటే. ఇలా రేణు అభిమానులతో పంచుకునే కొన్ని కొటేషన్లు ఆలోచింపజేస్తుంటాయి.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai) on


తాజాగా ఇలాంటి ఓ కొటేషన్‌నే అభిమానులతో పంచుకుందీ ట్యాలెంటెడ్‌ ఉమన్‌. విమానంలో ప్రయాణిస్తోన్న సమయంలో కిటికీ నుంచి తీసిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘భౌతిక దూరం మనల్ని వేరు చేయలేకపోవచ్చు.. కానీ నిర్లక్ష్యం మన మధ్య దూరాన్ని పెంచుతుంది’ అని అర్థం వచ్చేలా ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది రేణు.




అది ఇంకా నాలో ఉంది!

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


జబర్దస్త్‌ కామెడీ షోతో ఎంతో పేరు సంపాదించుకుంది యాంకర్‌ రష్మీ గౌతమ్‌. తనదైన ఎనర్జిటిక్‌ యాంకరింగ్‌, మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. సినిమాల్లో కూడా అవకాశాలను సొంతం చేసుకుంది. ఓవైపు వెండితెర, మరోవైపు బుల్లితెరపై హంగామా చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ బిజీగా ఉంటుందీ బ్యూటీ. తన వ్యక్తిగత ఫొటోలతో పాటు సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం రష్మికి అలవాటు.

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam) on


ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రష్మి పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. తన చిన్ననాటి ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది.. ‘ఇప్పటికీ ఆ చబ్బీనెస్‌ ఇంకా నాలో ఉంది..’ అనే అర్థవంతమైన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌.




ఏం క్రియేటివిటీ..!


View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial) on


తన ముక్కుసూటితనంతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే. కేవలం సినిమాలతోనే కాకుండా తన బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటుందీ క్యూట్‌ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial) on


సోషల్‌ మీడియాలో మహా చురుగ్గా ఉండే రాధిక తాజాగా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో తనలోని క్రియేటివిటీని బయపెట్టింది. ఒక ఫోన్‌ వెనక భాగంపై పడిన తన ప్రతిబింబాన్ని మరో ఫోన్‌తో క్యాప్చర్ చేసి ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన రాధిక.. ‘రెండు ఫోన్లతో చిత్రించిన కళ’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.



నాకు కొత్త స్నేహితుడు దొరికాడు..!

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on


లాక్‌డౌన్‌ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా గడుపుతున్నారు. అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వివిధ రకాలుగా సద్వినియోగపరచుకుంటున్నారు. కొందరు కొత్త కొత్త వంటకాలు నేర్చుకుంటే, మరికొందరు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఇంటి పనులు చేస్తోన్న విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on


తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ క్వారంటైన్‌లో ఏం చేస్తోందో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన హారీపోటర్‌ సిరీస్‌లోని ఓ పుస్తకాన్ని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. ‘నాకు కొత్త స్నేహితుడు దొరికాడు’ అనే క్యాప్షన్‌ను జోడించింది. అంటే అలియా ప్రస్తుతం హారీపోటర్‌ నవలలు చదువుతోందన్నమాట!





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-the-occasion-of-raksha-bandhan-in-telugu
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
celebrities-posts-on-sushant-singh-rajput-demise

ఆ వార్త విని గుండె బద్దలైంది !

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలించాడు. బిహార్ రాజధాని పాట్నాలో జన్మించిన సుశాంత్.. AIEEEలో 7వ ర్యాంక్ సాధించినా నటనపై ఉన్న మక్కువతో ఇంజినీరింగ్ చివరిలో వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఎన్నో డక్కాముక్కీలు తిన్న సుశాంత్ అనతికాలంలోనే స్టార్గా ఎదిగాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదారణను సొంతం చేసుకున్నాడు. ఎంతో చక్కటి భవిష్యత్తు ఉన్న ఈ హీరో 34 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు తారలు తమ సంతాపాన్ని తెలియజేశారు. మరికొంతమంది తారలు సుశాంత్తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుని, అతనితో తమకున్న బాంధవ్యాన్ని తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నా ఫ్రెండ్‌తో అక్కడ ఓ అందమైన రోజు...

‘తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లకు చేరిన సందర్భంగా ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతున్న శృతి’... ‘వంట చేస్తోన్న యాంకర్‌ అనసూయ’... ‘తన ఫ్రెండ్‌తో కలిసి సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా’... ‘పూజా హెగ్డే, మల్లికా శెరావత్‌, బిపాసా బసు, ఈషా గుప్తా యోగాసనాలు’.. ‘నయా’ అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ సినిమా.. గుంజన్‌ సక్సేనా విశేషాలు.. ‘రష్మీ గౌతమ్‌, అమైరా దస్తూర్, తాప్సీ, ఛార్మీ, పాయల్‌ రాజ్‌పుత్‌’ ఫొటోలు, విశేషాలతో ఈరోజు ఇన్‌స్టాపురం కళకళలాడుతోంది.. మరింకెందుకాలస్యం? మన అందాల తారలు పంచుకున్న అప్‌డేట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి...

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

అక్కడే ఉన్నామంటే నమ్మలేకపోతున్నా !

రష్మీ గౌతమ్‌ అంటే తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. రష్మీ.. 2002లోనే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. సినిమాల్లో వివిధ పాత్రల్లో ‘జబర్దస్త్‌’షోతో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ స్టార్‌గా మారిపోయింది. తను ఎంత బిజీగా ఉన్నా తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను 2007లో నటించిన ‘యువ’ సీరియల్‌కి సంబంధించిన ఒక ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘నిత్యం ప్రయత్నిస్తూ, మనకు లభించే వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడమే జీవితం’ అనే క్యాప్షన్‌ని ఈ ఫొటోకు జోడించిందీ ఎనర్జిటిక్‌ యాంకర్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-social-media

మా ఇంట్లోకి డైనోసార్‌ వచ్చింది..!

తన యాంకరింగ్‌తో తెలుగునాట బుల్లితెరపై ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అనసూయ. ఈ క్రమంలో ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులను క్రమం తప్పకుండా పలకరిస్తుంటుంది. తాజాగా తన కుమారుడి(శౌర్య భరద్వాజ్‌) పుట్టినరోజు సందర్భంగా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుందీ సుందరి. ‘హ్యాపీ బర్త్‌డే మై సన్‌షైన్‌!!!! ఐ లవ్‌ యూ.. మన కుటుంబంలోకి ఆనందాలు మోసుకొచ్చావ్‌.. నువ్వు నా జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చావు... నాన్న, నేను.. నువ్వు మంచి వ్యక్తిగా ఎదగాలని దీవిస్తున్నాం. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు!!’ అంటూ రాసుకొచ్చిందీ రంగమ్మత్త.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-social-media