scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

category logo

అమ్మతో కలిసి ఇలా ఆడుకుంటున్నా..!

latest posts of celebrities on social media

యుద్ధానికి సిద్ధమవుతున్నా..!

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఏప్రిల్‌ 14 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశాన్ని లాక్‌డౌన్‌ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక మందులేని ఈ వ్యాధిని అడ్డుకోవాలంటే కేవలం ఇంటికే పరిమితం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇంట్లోనే ఉంటూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉంటూ సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు కొందరు సెలబ్రిటీలు.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone) on

తాజాగా అందాల నటి సన్నీ లియోనీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. చేతికి బాక్సింగ్‌ గ్లౌజ్‌లు తొడుక్కుంటూ కోపంగా చూస్తోన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘యుద్ధానికి సిద్ధమవుతున్నాను. కాకపోతే ఈసారి మాత్రం ప్రత్యర్థి కంటికి కనిపించడు, చేతులతో కూడా తాకడానికి వీలు లేదు’ అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చిందీ బ్యూటీ.

అమ్మతో సరదాగా సుమ..!

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో.. కొన్ని రోజుల క్రితం వరకూ అందరూ బిజీగా గడిపేవారు. కానీ కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అంతా ఇంటికే పరిమితమయ్యారు. మామూలు

ఉద్యోగి నుంచి సినీ తారల వరకూ అందరూ ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Suma Kanakala (@kanakalasuma) on

తాజాగా ఇలాంటి ఓ జ్ఞాపకాన్నే అభిమానులతో పంచుకుంది ఎనర్జిటిక్‌ యాంకర్‌ సుమ కనకాల. తన తల్లితో కలిసి చింత గింజలతో (వామన గుంటలు/ఓన గుంటలు) ఆడుతున్నప్పుడు తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సుమక్క.. ‘అమ్మతో కలిసి మళ్లీ పాత ఆటలను ఆడుతున్నాను’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ను జోడించింది.

నన్ను అప్పుడు జడ్జ్‌ చేయండి..!

View this post on Instagram

A post shared by Aakanksha Singh (@aakankshasingh30) on

‘మళ్లీ రావా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార ఆకాంక్ష సింగ్‌. తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మోడ్రన్‌ అవుట్‌ ఫిట్స్‌లో దిగిన ఫొటోలతో పాటు, టిక్‌టాక్‌లో చేసిన వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకోవడం ఈ బ్యూటీకి అలవాటు.

View this post on Instagram

A post shared by Aakanksha Singh (@aakankshasingh30) on

ఆకాంక్ష తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్‌లో లూజ్‌ హెయిర్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మీరు పరిపూర్ణంగా ఉన్నప్పుడు.. నన్ను జడ్జ్‌ చేయండి’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది.

అమ్మాయిలూ మీకే ఈ ఛాలెంజ్‌..!

View this post on Instagram

A post shared by hariteja (@actress_hariteja) on

కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో భాగంగా లాక్‌డౌన్‌ పేరుతో అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. సామాజిక దూరం పాటించే క్రమంలో ప్రజలు ఒకచోట కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగానే ఇళ్లల్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో వివిధ రకాల ఛాలెంజ్‌లను ఇతరులకు విసురుతున్నారు.

View this post on Instagram

A post shared by hariteja (@actress_hariteja) on

తాజాగా ‘ప్లాంక్‌ ఛాలెంజ్‌’ పేరుతో నెటిజన్లకు ఓ సవాలు విసిరింది నటి, యాంకర్‌ హరితేజ. కాళ్ల మునివేళ్లతో పాటు మోచేతులను నేలకు ఆనించి నిమిషం పాటు శరీరాన్ని గాల్లో ఉంచడమే హరితేజ విసిరిన ‘ప్లాంక్‌ ఛాలెంజ్‌’ ముఖ్య ఉద్దేశం. ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘శక్తిమంతమైన అమ్మాయిలకు ఇదే నా ఛాలెంజ్‌.. ఇలా చేయండి’ అంటూ ఛాలెంజ్‌ను విసిరింది హరితేజ. మరి మీరూ ఈ ప్లాంక్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా?

మీ నాన్నను మిస్‌ అవుతున్నప్పుడు ఇలా చేయండి..

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

కరోనాను తరిమి కొట్టే క్రమంలో స్వీయ నిర్బంధంలో ఉన్న వారంతా ఏదో రకంగా సమయాన్ని గడుపుతున్నారు. ఆల్బమ్‌లలో ఉన్న పాత ఫొటోలను బయట తీసి మరీ నెట్టింట్లో పంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రస్తుతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

తాజాగా ఇలాంటి ఓ పాత జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది నటి అలియా భట్‌. తండ్రితో దిగిన ఓ పాత ఫొటోను ‘త్రో బ్యాక్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇంట్లోనే ఉండండి.. ఒకవేళ మీ నాన్నను మిస్‌ అవుతుంటే, వారితో దిగిన పాత ఫొటోలపై ఓ లుక్కేయండి’ అంటూ భావోద్వేగంతో కూడిన క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటి.

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.