scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం ఇది..!

Latest posts of Celebrities in Social Media

పిజ్జా కావాలా నాయనా..!

101219socialpostgh650-1.jpg

సినిమాలతో పాటు తన సోషల్‌ మీడియా పోస్టులతోనూ అభిమానులను ఆకట్టుకొంటోంది బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్‌. ముఖ్యంగా తను పాల్గొనే ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకొంటుంటుంది జాన్వీ. ఈ క్రమంలో తన లేటెస్ట్‌ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ ముద్దుగుమ్మ. ఈ ఫొటోల్లో జాన్వీ వైట్‌ డ్రస్‌లో అచ్చం ఏంజెల్‌లా కనిపిస్తోంది.

ఇదే డ్రస్‌లో తను పిజ్జా తింటుండగా తీసిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఎవరికైనా కావాలా..?’ అని క్యాప్షన్‌ను జత చేసిందీ బ్యూటీ.

ఈ సినిమా నాకు అంతకంటే ఎక్కువే..!

101219socialpostgh650-2.jpg

దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోన్న చిత్రం ‘ఛపాక్‌’. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపిక లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే విడుదల చేశారు. ఇందులో దీపిక ‘మాలతి’ పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్‌లో యాసిడ్‌ బాధితురాలిగా దీపిక చాలా సహజంగా నటించింది. దీపిక ఈ ట్రైలర్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘కొన్ని సినిమా కథలు పూర్తిగా వినకుండానే ఆ సినిమాను చూడాలని ఆసక్తి కలుగుతుంటుంది. అలాంటి కథలు చాలా అరుదుగా తారసపడుతుంటాయి. మరికొన్ని సినిమాలైతే.. సినిమా చూసిన తర్వాత భావోద్వేగంతో నోటి వెంట మాటలు కూడా రావు. ఇలాంటి సినిమాలు ఇంకా అరుదుగా వస్తుంటాయి. నాకు సంబంధించినంత వరకు ‘ఛపాక్‌’ సినిమా అలాంటిదే..! నిజం చెప్పాలంటే అంత కంటే ఎక్కువే..!’ అని రాసుకొచ్చింది. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.

జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం..!

101219socialpostgh650-3.jpg

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తన168వ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘దర్బార్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రజినీ ఈ సినిమా పూర్తి కాగానే సిరుత్తై శివ అనే దర్శకుడితో తన తర్వాతి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను సన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించనుంది. అయితే ఈ సినిమాలో ‘మహానటి’తో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ఓ కీలకపాత్రలో నటించనుందని తాజాగా సన్‌ ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై తన సంతోషాన్ని తాజాగా నెటిజన్లతో పంచుకుంది కీర్తి.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

ఈ సందర్భంగా కీర్తి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నా జర్నీలో అద్భుతమైన మైలు రాయికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రజినీకాంత్‌ సర్‌తో కలిసి నటించడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఓ అద్భుత జ్ఞాపకమవుతుంది. ఈ అవకాశమిచ్చిన సన్‌ పిక్చర్స్‌ వారికి, దర్శకుడు శివకు నా కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సీనియర్‌ నటి మీనా కీలక పాత్రలో నటిస్తుండగా.. కీర్తి రజినీకి కూతురిగా నటించనుందని సమాచారం. మరి సినిమాలో కీర్తి రోల్‌ ఎలా ఉండబోతోందో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే..!

రంగుకు ఆ శక్తి ఉంది..!

101219socialpostgh650-4.jpg

ఫ్యాషన్‌పై మంచి అభిరుచి కలిగిన నటీమణుల్లో సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఒకరు. అటు సినిమాలతో పాటు.. ఇటు బయట జరిగే కార్యక్రమాల్లోనూ తన శరీరాకృతికి నప్పే ట్రెండీ ఫ్యాషన్స్‌ ధరిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకొంటుందీ భామ. ఈ క్రమంలో లావణ్య కలర్‌ఫుల్‌ డ్రస్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘మన ఆత్మను ప్రభావితం చేసే శక్తి రంగుకు ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. లావణ్య, నిఖిల్‌ జంటగా నటించిన ‘అర్జున్‌ సురవరం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది.

101219socialpostgh650-5.jpg

దోస్త్‌ మేరా దోస్త్‌..!

101219socialpostgh650-7.jpg

సినిమా పరిశ్రమకు సంబంధించి తోటి నటీనటులతో స్నేహభావంతో మెలిగే నటీమణుల్లో అందాల తార ఛార్మీ కౌర్‌ ఒకరు. నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఈ తార తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంటుంటుంది. ఈ క్రమంలో ఛార్మి తాజాగా ముంబైలో దగ్గుబాటి రానాను కలుసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటోను తను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ‘ముంబైకు వచ్చిన అతిథి..!’ అని రాసుకొచ్చింది.

101219socialpostgh650-6.jpg

తనూ, అనుష్క కలిసి దిగిన ఓ ఫొటోను ఛార్మి ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.





women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

నవ్వు నాలుగు విధాలా మేలు..!

అందాల తార శిల్పా శెట్టి మనసారా నవ్వుతోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ.. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. ‘మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడచ్చు. అంతేకాదు.. మనసారా నవ్విన తర్వాత 45 నిమిషాల దాకా కండరాలు విశ్రాంత స్థితిలో ఉంటాయి. స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా నవ్వడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపండి. లేదంటే కామెడీ సినిమాలు, వీడియోలు వంటివి చూడండి.. అదీ కాదంటే కామెడీ పుస్తకాలు చదవండి. ఎందుకంటే నవ్వే మనకు అత్యుత్తమమైన ఔషధం’ అంటూ నవ్వు నాలుగు విధాలుగా మేలు అనే సామెతను గుర్తు చేసిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఎవరి పరీక్ష వారే రాయాలి..!

మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌.. జీవితం గురించి ఆలోచింపజేసే ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో ‘జీవితం ఒక కఠినమైన పరీక్ష.. చాలామంది ఈ పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటారు. దానికి కారణం మరొకరిని కాపీ కొట్టడమే. అలాగే ఎవరి క్వశ్చన్‌ పేపర్‌ వారిదే అన్న విషయాన్ని కూడా వారు అర్థం చేసుకోరు’ అని రాసి ఉంది. దీనికి ‘సరైన ప్రిపరేషన్‌, ప్రాక్టీస్‌ ఉంటే జీవితమనే పరీక్ష సులభంగానే ఉంటుంది. జీవితం మనకు సంధించే ప్రశ్నలు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఎవరి ప్రశ్నలకు వారే సమాధానాలు వెతుక్కోవాలి. జీవితం ఒక పరీక్ష అయితే దానికి పాఠ్యాంశం మీరే. కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ధైర్యంగా ఉండండి. ఒకరిని కాపీ కొట్టకుండా మీ ప్రశ్నలకు మీరే సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. విజయానికి పరాజయానికి మధ్య అతి పెద్ద తేడా ఇదేనని నా భావన’ అంటూ షేరింగ్‌, అథెంటిక్‌ పవర్‌, కోర్‌ బిలీఫ్స్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

ఈ ఉంగరం వెనక ఉన్న కథ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్‌ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్‌డౌన్‌ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

చూశారా.. నా సంతోషం నా పక్కనే ఉంది..!

నటి నమ్రత తన భర్త మహేష్‌ బాబుతో కలిసి దిగిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘మన అస్తిత్వానికి మూల కారణం ప్రేమే అని నా బలమైన విశ్వాసం. ప్రేమ భావన ఒక్కటే మనం సంతోషంగా జీవించేలా చేస్తుంది. దయ, జాలి, కరుణ అన్నీ ప్రేమ నుంచి పుట్టేవే. అందరూ ప్రేమగా, ఒకరిపట్ల మరొకరు దయ గల వ్యక్తులుగా ఉండండి. మనకు జీవించడానికి ఒక జీవనం, ఇవ్వడానికి ఒక జీవితం ఉంది. ఈ ఫొటోలో నా నిజమైన సంతోషంతో (మహేష్ ని ఉద్దేశిస్తూ) ఉన్నాను..’ అంటూ బి హ్యాపీ, బి సేఫ్, బి కైండ్ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. అంతేకాదు ఈ ఫొటోని తమ కూతురు సితార తీసిందని తెలిపింది. ఈ ఫొటోలో 'మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు', 'క్యూట్ కపుల్' అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-regarding-onam-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram

అందాల 'మీనా’లు మాట్లాడుకున్న వేళ...!

ప్రముఖ హీరోయిన్‌ మీనా తన ఫిష్‌ పాట్‌లో ఉన్న చేపలను చూస్తోన్న ఫొటోని పోస్ట్‌ చేస్తూ ‘ఎవరైనా ఈ ఫొటోకి మంచి క్యాప్షన్‌ పెడతారా’ అని అభిమానులను అడిగింది. దాంతో ‘మీనాలను చూస్తోన్న మీనా’, ‘ఒక అందమైన చేప మరో రెండు అందమైన చేపలను చూస్తోంది’, ‘బంగారు వర్ణపు చేపలను చూస్తోన్న అందాల రాశి’ అంటూ పలువురు అభిమానులు కామెంట్ల రూపంలో పెట్టారు. వీటికి స్పందింస్తూ ‘వావ్‌.. మీరు ఇచ్చిన క్యాప్షన్లలో ఒక్కదానినే ఎంచుకోవాలంటే చాలా కష్టం. నాకు అన్నీ నచ్చాయి. మీ ఇమాజినేషన్‌కి ముగ్ధురాలినయ్యాను. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ అభిమానులకు రిప్లై ఇచ్చిందీ సుందరి.

Know More

women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-in-instagram
women icon@teamvasundhara
latest-posts-of-celebrities-on-instagram-in-telugu

Movie Masala

Video Gallery