ఓ వైపు సినిమాలు చేస్తూ... మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే నటీమణుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తన ఫ్యాషనబుల్ ఫొటోలు, సినిమా విశేషాలతో పాటు బ్యూటీ సీక్రెట్స్, హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్, వంటకాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటుంది. ఇటీవల కరోనా బారిన పడిన రకుల్ ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిందీ ముద్దుగుమ్మ. ‘ఈ ఏడాదిలో ఒకసారి కూడా ట్రై చేయలేదు.. కాబట్టి ఒకసారి అందరితో మాట్లాడదాం’ అంటూ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చింది. మరి రకుల్, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
హాయ్... మీరు ఇంత ఫిట్‌గా ఉండడానికి స్ఫూర్తినిచ్చిందెవరు?
మా నాన్నే..! చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్‌స్టైల్‌ను చూస్తూనే పెరిగాను. దీంతో పాటు వర్కవుట్లు చేయడమంటే నాకు ఎంతో ఆసక్తి.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
సినిమా షూటింగ్‌లు లేకపోతే సాధారణంగా ఇంట్లో సినిమాలు చూడడానికే సమయం కేటాయిస్తాను. ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతాను. గోల్ఫ్ ఆడతాను. ఇంకా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాను.
మీరు ఎలాంటి ఫుడ్‌ను తీసుకోవడానికి ఇష్టపడతారు?
నేను బాగా ఫుడ్డీ గర్ల్‌ని... ఆరోగ్యాన్నందించే ఎలాంటి ఆహారమైనా నాకిష్టమే. అందులో నా ఫేవరెట్ ఫుడ్ చెప్పాలంటే కొంచెం కష్టమే.
కరోనాపై గెలిచేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కొవిడ్ వైరస్‌పై విజయం సాధించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా రూంలోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నాను. వైద్యుల సూచనల మేరకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తున్నాను. హెల్దీ ఫుడ్, విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటున్నాను. త్వరలోనే కరోనాను గెలిచి బయటకు వస్తాను.
ఇటీవల మీరు చూసిన వెబ్‌సిరీస్..?
యస్...యస్...యస్.. చాలా చూశాను. ఇప్పుడే ‘ది క్వీన్స్ గ్యాంబిట్’ పూర్తి చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతం ‘అన్ డూయింగ్’ చూస్తున్నాను. ఇది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
ఒకవేళ మీకు అవకాశం లభిస్తే ప్రపంచానికి ఏం చేయాలనుకుంటారు?
ఒకవేళ నాకు నిజంగా అలాంటి అవకాశం వస్తే ఈ భూమ్మీద ఉండే నెగెటివిటీని అంతా నాశనం చేయాలనుకుంటున్నాను.
హైదరాబాద్‌లో మీరు ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి?
బిర్యానీ...బిర్యానీ...బిర్యానీ.
మీ బెస్ట్ ఫ్రెండ్ మంచు లక్ష్మి గురించి ఒక్కమాటలో ఏం చెబుతారు?
ఆమె నా సోల్ సిస్టా (లవ్ ఎమోజీలు షేర్ చేస్తూ).
హాయ్ మేడమ్... నేను మీకు పెద్ద అభిమానిని. మీ వేకప్ అండ్ బెడ్ టైమింగ్స్ మాతో షేర్ చేసుకోరా?
నేను మార్నింగ్ పర్సన్‌ని. తొందరగానే నిద్రపోతాను. త్వరగానే నిద్రలేస్తాను. లాక్డౌన్లో కూడా ఉదయం 6.30 గంటలకే నిద్రలేచి వ్యాయామాలు చేసేదాన్ని. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాను.
ప్రస్తుతం మీరు ఏయే సినిమాలు చేస్తున్నారు?
హిందీలో ‘మేడే’, ‘అటాక్’, ‘థ్యాంక్ గాడ్’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఇండియన్ 2’లో నటిస్తున్నా. ఇక తెలుగులో ‘చెక్’ తో పాటు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో.
మీలాగా ప్రకాశవంతమైన చర్మం సొంతం చేసుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పరా?
బీ హ్యాపీ... బీ పాజిటివ్... ఇవే నేను చెప్పే బిగ్గెస్ట్ టిప్స్. వీటితోనే మన చర్మం ప్రకాశవంతమవుతుంది.
మీ ఫ్యాన్స్ గురించి ఏం చెబుతారు?
ఈ రోజే నా ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 16 మిలియన్లకు చేరుకుంది. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. థ్యాంక్యూ.. సో మచ్. ఐ లవ్యూ ఆల్. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను.