Photo: Instagram
‘మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి?’ అని పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలను అడిగితే ‘అందంగా ఉండాలి. తమను ప్రేమగా చూసుకోవాలి.. తమతోనే ఉండాలి. నిత్యం తమ గురించే ఆలోచించాలి’ అని చాలా చెబుతుంటారు. ఈ క్రమంలో తనకు కాబోయే రాకుమారుడిలో కూడా కచ్చితంగా కొన్ని క్వాలిటీస్ ఉండాలంటోంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఓ బ్రైడల్ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె...పెళ్లి, తన లైఫ్ పార్ట్నర్లో ఉండాల్సిన లక్షణాల గురించి అందరితో షేర్ చేసుకుంది.
లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితమైన రకుల్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు అందుబాటులోనే ఉంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తాను చేసిన కొత్త వంటకాలు, వర్కవుట్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుందీ పంజాబీ బ్యూటీ. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ...తిరిగొచ్చిన వెంటనే మేకప్ వేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రముఖ బ్రైడల్ మ్యాగజైన్ ఫొటోషూట్‌కు హాజరైన ఈ భామ...పెళ్లి కుమార్తెలా ముస్తాబై ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుంది!
‘ప్రేమ, పెళ్లిపై నాకెంతో నమ్మకం ఉంది. నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్కి జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలి. సంప్రదాయాలకు బాగా విలువనిచ్చే కుటుంబం నుంచి నేను వచ్చాను. నాన్మ ఆర్మీ ఆఫీసర్ కావడంతో నేను కూడా అలాంటి వాతావరణంలోనే పెరిగాను. కాబట్టి నాకు కాబోయే భర్త...ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అయితే చాలా సంతోషిస్తాను. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నా వివాహం జరగాలని ఆశిస్తున్నాను. అది కూడా 100 మందికి మించకుండా. బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
పల్లెటూరి అమ్మాయిగా !
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె చేతిలో చాలా చిత్రాలున్నాయి. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో మెప్పించిన రకుల్ తొలిసారిగా డీగ్లామర్ రోల్లో కనిపించనుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా నటించనుంది. నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘చెక్’ చిత్రంలోనూ ఈమె హీరోయిన్. వీటితో పాటు కమలహాసన్ ‘ఇండియన్ 2’ సినిమాతో పాటు ‘మే డే’, ‘అటాక్’, ‘థ్యాంక్ గాడ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ సందడి చేయనుంది.