జీవితంలోని చీకట్లను చెరిపేసి వెలుగులు నింపే దీపావళిని దేశమంతా సంబరంగా జరుపుకొంది. విద్యుద్దీపాల వెలుగులు, దీపాల కాంతులు, మతాబుల సందడితో ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ పండగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ర్టీకి చెందిన పలువురు తారలు సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కున మెరిశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తూ, దీపాలు పెడుతూ సందడి చేశారు. పండగ సంతోషాలను ఫొటోల్లో బంధించి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. అదేవిధంగా తమ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సినీ తారల దీపావళి సంబరాల విశేషాలేంటో మనమూ చూద్దాం రండి!
కాబోయే భర్తతో నిహారిక సెలబ్రేషన్స్!
వచ్చే నెలలో తన సింగిల్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పనున్న నిహారిక కొణిదెల తన భర్తతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో నిహారిక కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డతో పాటు నటుడు వరుణ్‌తేజ్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఇంటి ఆవరణలో నిహారిక వేసిన రంగోలీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మేరీ గోల్డ్ ఎల్లో కలర్ లెహెంగా, బ్లాక్ కలర్ షర్ట్‌లో మెరిసిపోయింది నిహారిక. ఇక చైతన్య పింక్ కలర్ కుర్తా, వైట్ పైజామా ధరించగా, వరుణ్ బ్లాక్ కలర్ టీ షర్ట్, డెనిమ్ జీమ్స్తో ముస్తాబయ్యాడు. అనంతరం తమ పండగ విశేషాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన చెల్లి-కాబోయే బావలతో కలిసి వరుణ్ దిగిన ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. నిహారిక, చైతన్యల వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్‌లో జరగనుంది.
కలిసి పండగ చేసుకున్నారు!
ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుమార్తె కాకరపువ్వొత్తులు కాలుస్తుండగా ఆమెను అల్లు అర్జున్ చూస్తున్న ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. నటుడు మంచు మోహన్‌బాబు ఆయన సతీమణి నిర్మల, కుమారుడు విష్ణు, వెరోనికా, మంచు లక్ష్మి, పిల్లలతో కలిసి పండగ సంబరాల్లో పాల్గొన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్ భార్య జీవిత, ఇద్దరు కూతుళ్లతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితో పాటు మహేశ్- నమ్రతా శిరోద్కర్, శ్రీజ-కల్యాణ్ దేవ్, స్నేహ-ప్రసన్న, నాని-అంజన, ప్రియాంకాచోప్రా-నిక్ జొనాస్, దీపిక-రణ్వీర్, కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా, మీరాకపూర్-షాహిద్ కపూర్, సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా, నేహాధూపియా-అంగద్ బేడీ, లారాదత్తా- మహేశ్‌భూపతి, సోహా అలీఖాన్-కునాల్ ఖేము, పల్లవి-నిఖిల్, నేహా కక్కర్- రోహన్, రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి, కీర్తి సురేశ్, పూజాహెగ్డే, పాయల్ రాజ్‌పుత్, తాప్సీ, రకుల్ ప్రీత్‌సింగ్, స్మిత, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, సారా అలీఖాన్, మాధురీ దీక్షిత్, నీతూ కపూర్, ప్రీతిజింటా, హేమమాలిని, మందిరా బేడీ, అర్పితాఖాన్, నీనా గుప్తా తదితరులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి తారల దీపావళి వేడుకల పైన మనమూ ఓ లుక్కేద్దాం రండి..