‘మహానటి’ సినిమాతో అశేష అభిమానులను సొంతం చేసుకుంది కీర్తి సురేశ్. అలనాటి తార సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ‘జాతీయ ఉత్తమ నటి’ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు కథానాయిక ప్రాధాన్య చిత్రాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ లాక్డౌన్లో ‘పెంగ్విన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’. ఓటీటీ వేదికగా తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా #AskKeerthy అంటూ అభిమానులతో ముచ్చటించింది కీర్తి. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పింది. మరి కీర్తి, అభిమానుల మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...
ఈ లాక్డౌన్లో ఏం నేర్చుకున్నారు?
చిన్న చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాను.
‘మిస్ ఇండియా’ సినిమా షూటింగ్ సెట్లో మీరు చేసిన ఓ సరదా పనిని మాతో షేర్ చేసుకోరా?
ఆ జాబితా చాలా పెద్దది. (స్మైలీ ఎమోజీని జత చేస్తూ)
మేడమ్..మీకు హారర్ చిత్రాలంటే ఇష్టమా? లేక కామెడీ సినిమాలా?
నేను హారర్ సినిమాలు చూస్తాను. కామెడీ సినిమాల్లో నటిస్తాను
మేము బొద్దుగా ఉండే కీర్తి సురేశ్‌ను ఎప్పుడు చూస్తాం?
త్వరలోనే తప్పకుండా చూస్తారు...(స్మైలీ ఎమోజీ)
నెగెటివిటీ, ట్రోల్స్‌ను ఎలా ఎదుర్కొంటారు?
వాటిని పట్టించుకోకుండా వదిలేయడమే!
ఒత్తిడిని అధిగమించడానికి ఎలాంటి పనులు చేస్తారు?
డ్రైవింగ్ చేస్తాను. నా పెట్‌డాగ్ నైక్‌తో సమయం గడుపుతాను. ట్రావెల్ చేస్తాను. అలాగే కప్పు ఛాయ్ తాగుతాను.
మిమ్మల్ని విమర్శించే వారికి మీరెలాంటి సమాధానం ఇస్తారు?
వారు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.
మీ మొదటి సినిమాలోని ఫస్ట్ సీన్‌కు ఎన్ని టేక్‌లు తీసుకున్నారు?
ఒక్క టేక్‌లో చేశాను. నేనేమీ జోక్ చేయడం లేదు. ఎందుకంటే...ఆ సీన్లో నేను కంగారు పడుతూ కనిపించాలి. అయితే అదృష్టవశాత్తూ అప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది (నవ్వుతూ).
మిమ్మల్ని మీరు సిల్వర్‌స్ర్కీన్‌పై చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
అదొక కలలా అనిపించింది.
సినిమా ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవారికి మీరిచ్చే సలహా?
సాధించేవరకు అసలు వదలొద్దు!
మీకు నచ్చిన వెబ్‌సిరీస్?
ఫ్రెండ్స్
సమంత గురించి ఒక్కమాటలో ఏం చెబుతారు?
‘సామ్’ గురించి ఒక్కమాట సరిపోదు. స్మార్ట్‌గా ఉంటారు. సరికొత్త ప్రయోగాలు చేస్తుంటారు.
జాతీయ అవార్డును అందుకుంటున్న సమయంలో ఎలా ఫీల్ అయ్యారు?
భయపడ్డాను. చాలా కృతజ్ఞురాలిగా భావించాను. అది నమ్మలేని మధురానుభూతి.
చిన్నప్పుడు ఏమవ్వాలని అనుకునేవారు?
ఆర్డర్...ఆర్డర్...ఆర్డర్ (న్యాయమూర్తి)!
మేడమ్... మీరు సింగిల్ ?లేక కమిటెడ్ ?
కమిటెడ్ టు వర్క్!
మీ బలం ఏంటి?
ఆత్మవిశ్వాసం
మీకు ఇష్టమైన ఆహారం?
దోశెలు బాగా తింటాను
మీ ఫేవరెట్ క్రికెటర్?
ఎప్పుడైనా మహేంద్ర సింగ్ ధోనీనే!
ఇండియాలో మీరు చూడాల్సిన ప్రదేశం? డ్రీమ్ ప్లేస్ అంటూ ఏమైనా ఉందా?
నాకు ఇండియా అంతా చూడాలని ఉంది.
మేడమ్... మీరేమైనా తప్పులు చేశారా? చేస్తే వాటి నుంచి ఏం నేర్చుకున్నారు?
తప్పుల్ని లెక్కపెట్టుకోలేం. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా బాధపడకూడదనే విషయం వాటి నుంచి నేర్చుకున్నాను.
మీ అభిమానుల గురించి ఒక్క మాటలో ఏం చెబుతారు?
నా ఫ్యామిలీ.
మీకున్న ట్యాలెంట్లో పనికిరానిది ఏదైనా ఉందా?
ట్యాలెంట్ పనికి రాకుండా ఉంటుందా చెప్పండి?!
‘తానా సెర్న్‌దా కూట్టం’ (తెలుగులో ‘గ్యాంగ్’) సినిమాలో మీ కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంది. అలాంటి పూర్తిస్థాయి కామెడీ చిత్రం మళ్లీ ఎప్పుడు వస్తుంది.?
థ్యాంక్యూ! నాకు కామెడీ చిత్రాలంటేనే ఇష్టం. అలాంటి సినిమాల్లో అవకాశం వస్తే అసలు వదులుకోను.
మీ డ్రీమ్ ఏంటి?
ప్రస్తుతం నేను నా డ్రీమ్తోనే (నటన) జీవిస్తున్నాను.
మేడమ్...మీరు బరువు తగ్గడం వెనుక ఉన్న రహస్యం ఏంటి?
క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేశాను. డైట్ ఫాలో అయ్యాను.
మీరు ‘ప్యాన్ ఇండియా’ చిత్రంలో ఎప్పుడు నటిస్తారు?
త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.
మీ కెరీర్లో మీకు నచ్చిన విషయం?
సరికొత్త ప్రయోగాలు చేయడమంటే నాకు ఇష్టం. దీంతో పాటు అభిమానులు చూపించే ప్రేమ కూడా...!
మాములుగా మీరు ఫోన్‌ను ఓపెన్ చేసిన తర్వాత మొదట ఏం చేస్తారు.?
అన్‌లాక్ చేస్తాను (నవ్వుతూ).
‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా అనిపించింది. షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతారా?
కచ్చితంగా చెబుతాను.
మీరు వయొలిన్ వాయించడం నేర్చుకున్నారా?
చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. కీ బోర్డు కూడా ప్లే చేస్తాను.
మీరు స్వయంగా వండుకుని తినగలిగిన ఫేవరెట్ డిష్?
బచ్చలికూర