ఓ వైపు సినిమాలతో మాయ చేస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే నటీమణుల్లో అక్కినేని సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైంది. ఇంట్లోనే వ్యవసాయం చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘Ask me anything’ అంటూ అభిమానులతో ముచ్చటించింది సామ్. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సమంత, ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.
మీ చేతిపై ఉన్న ట్యాటూకు అర్థం ఏంటి?
మన వాస్తవ ప్రపంచాన్ని మనమే క్రియేట్ చేసుకోవడమే ఈ ట్యూటూ మీనింగ్. మా ఇద్దరి చేతుల (సమంత-నాగచైతన్య)లపై ఇది ఉంటుంది. ఇది మా ఇద్దరికీ ఎంతో స్పెషల్.
వంట చేయడం లేదా వ్యవసాయం చేయడం ఏది ఇష్టం?
ప్రస్తుతానికి వ్యవసాయం. చూశారుగా.. నేను పండిస్తున్న ఆకుకూరలు, కాయగూరలు... ఎవ్రీథింగ్.. నాకు స్పెషల్.
మీ హైట్ తెలుసుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది? చెప్పరా?
5 అడుగుల 3 అంగుళాలు.
మీరు ప్రెగ్నెంటా?
బహుశా నేను 2017 నుంచే గర్భంతో ఉన్నాననుకుంటాను. బిడ్డ బయటకు రావడానికి ఇష్టపడడం లేదనుకుంటాను (నవ్వుతూ).
మీలా వీగన్‌గా మారడం సులభమేనా?
వీగన్‌గా మారాక నా దైనందిన జీవితంలో చాలా మార్పులొచ్చాయి. ఈ జర్నీని నేను చాలా బాగా ఆస్వాదిస్తున్నాను. మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే వీగన్‌గా మారొచ్చు.
మాకూ కిలో క్యారట్ పచ్చడి పంపుతారా?
లేదండీ..క్యారట్ పచ్చడి, క్యారట్ ఇడ్లీ అన్ని అయిపోయాయి. నెక్ట్స్ టైం పంపిస్తాను.
మీరు నటించిన ‘ఫ్యామిలీమెన్ 2’ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదలవుతుంది?
చూశారుగా...నా ముఖం ఎంత వెలిగిపోతోందో! త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఇటీవల డబ్బింగ్ కూడా పూర్తి చేశాను.
క్వారంటైన్లో మీరు చేసిన ఉత్తమమైన పని ఏంటి?
అది చాలా స్పెషల్! త్వరలోనే మీ అందరితో షేర్ చేసుకుంటాను.
నేను కూడా మీలాగే ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. కానీ నాకున్న ఆహారపు అలవాట్లు, సోమరితనం నన్ను వెనక్కు లాగుతున్నాయి? మీలా మారాలంటే ఏం చేయాలి?
నేను ఎలాంటి డైట్ నియమాలు పాటించను. నాకు నచ్చింది తింటాను.
యాక్నే, నిర్జీవమైన చర్మ సమస్యలతో బాధపడే యువతకు మీరిచ్చే సూచన ఏంటి?
(బాగా ఆలోచించి)... ఓకే...ఎప్పుడు మీ చర్మాన్ని పొడిగా ఉంచుకోవద్దు...(మళ్లీ ఆలోచిస్తూ)...అంతే నాకేమీ తెలియదు...(నవ్వుతూ)
సామ్...మీ చూపుడు వేలికుండే ఉంగరాన్ని ఒకసారి చూపరా ప్లీజ్ ?
