సమంత... విలక్షణమైన పాత్రల్లో సిల్వర్ స్ర్కీన్‌పై సందడి చేసే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. తన బ్యూటీ సీక్రెట్స్, హెల్త్ టిప్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. ఇక లాక్డౌన్లో పూర్తిగా ఇంటికే పరిమితమైన సామ్ ఓ సరికొత్త పని కూడా నేర్చుకుంది. అదేనండీ...గార్డెనింగ్! ఈ మధ్య తాను ఇంటి మేడ పైనే కాయగూరలు, ఆకుకూరలు పండించడం తన సోషల్ మీడియా ఫొటోల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ కార్యక్రమానికి మరింత ప్రాచుర్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ బ్యూటీ #GrowWithMe పేరుతో ఓ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టింది.
గార్డెనింగ్‌ను అలవాటుగా మార్చుకుంది!
కరోనా కారణంగా అందరూ శారీరకంగానే కాదు.. మానసికంగానూ నలిగిపోతున్నారు. వైరస్ భయంతో చాలామంది మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతమైపోతున్నారు. ఇక వీటి నుంచి బయటపడడానికి అటు సామాన్యులతో పాటు, ఇటు సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గార్డెనింగ్‌ను అలవాటుగా మార్చుకుంది సామ్. ‘ఎవరి ఆహారం వారు పండించుకోవడమంటే..ఎవరి కరెన్సీని వారు ప్రింట్ చేసుకున్నట్లే’ అన్న రాన్ఫిన్లే చెప్పిన మాటలను నిజం చేస్తూ ఇంటి మేడ పైనే గార్డెన్‌ను ఏర్పాటు చేసుకుంది. కరోనా సమయంలో బయటికెళ్లే అవసరం లేకుండా అక్కడే కూరగాయలు, ఆకుకూరలను పండిస్తోంది.
సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం!
మన ఆహారం మనం పండించుకోవడం వల్ల డబ్బు మిగలడమే కాదు..ఆరోగ్యంగానూ ఉండచ్చు. ఈ మేరకు తన గార్డెనింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది సామ్. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సత్ఫలితాలనిస్తున్న ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాలనుకుందీ అందాల తార. ఈక్రమంలో #GrowWithMe అనే ఓ హ్యాష్‌ట్యాగ్‌తో సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన ఆమె తనలానే అందరూ ఇంట్లోనే కూరగాయలు పెంచాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తాను సాగుచేసిన కూరగాయలు, ఆకుకూరలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది సామ్.
మన చేతులను మురికి చేసుకుందాం!
‘హాయ్... #GrowWithMe ప్రయాణంలో భాగంగా నేను షేర్ చేసిన పోస్టులకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. నాలాగే ఇంట్లోనే ఆహారం పండించుకోవాలనుకుంటున్న మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు మీరందరూ ఈ జర్నీలో భాగస్వాములై నాకు సహకరించారు. ఇప్పుడు నేనూ మీ అందరికీ సహాయం చేస్తాను. రాబోయే కొన్ని వారాల పాటు మనందరం కలిసి మన ఆహారాన్ని మనమే పండించుకుందాం. ఇందుకోసం ఒక కుండ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ లేకపోతే హైడ్రోపోనిక్ హోం కిట్‌ను రడీగా ఉంచుకోండి. వీటి సహాయంతో మనకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను మనమే పండించుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల మన దైనందిన జీవితాల్లో చాలా మార్పు వస్తుందన్న నమ్మకం నాకు గట్టిగా ఉంది. ఈ అద్భుత ప్రయాణంలో భాగంగా నేను ముందుగా మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్‌సింగ్‌లను నామినేట్ చేస్తున్నాను. వీరితో పాటు మీరందరూ #GrowWithMe ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మరెందుకు ఆలస్యం... మన చేతులను మురికి చేసుకుని మన ఇంట్లోనే ఆహారాన్ని పండించుకుందాం రండి.
మరి, సమంత చెప్పిన మాటలు అక్షరాలా సత్యమే కదా! ఎందుకంటే మన ఆహారం మనం పండించుకోవడం వల్ల డబ్బు మిగలడమే కాదు.. ఆరోగ్యంగానూ ఉండచ్చు. మరి ఆలస్యమెందుకు... మనమూ ఈ #GrowWithMe ఛాలెంజ్‌లో భాగస్వాములవుదాం రండి.
Photos: Instagram
Also Read:
సమంతలాగా మైక్రో గ్రీన్స్ క్యాబేజీని పండించేస్తారా?
ఈ బయోఎంజైమ్ని ఇంట్లోనే తయారు చేశా!