scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు..!

Actress Varalakshmi and Vijayalalitha in Alitho Saradaga Chat Show

వారిద్దరూ విభిన్న పరిస్థితుల మధ్య వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు చెల్లెలిగా మెప్పిస్తే.. మరొకరు ప్రత్యేక పాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. తమ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలెన్నో పోషించారు. అద్భుత అభినయంతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న వారే సీనియర్‌ నటీమణులు వరలక్ష్మి, జయలలిత. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న వీరు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు.. ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..
అక్కా.. మీ సొంతూరు ఏది?
జయలలిత: అమ్మది గుడివాడ, నాన్నది గుంటూరు జిల్లా పొన్నూరు. బాల్యమంతా గుంటూరులోనే గడిచింది. బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్‌ కాలేజ్‌లో ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా.

jayavaralakshmigh650-2.jpg
అప్పట్లో ప్రేమలేఖలు బాగా వచ్చేవట కదా?
జయలలిత: అవును! మా కాలేజీ ముందు కుర్రాళ్లు చక్కర్లు కొడుతూ ఉండేవారు. లవ్‌ లెటర్లు కుప్పలు తెప్పలుగా వచ్చేవి. అవి చూసి నాన్న.. వాళ్లెవరంటూ ప్రశ్నించేవారు. నీకు తెలియకుండా ఉత్తరాలు ఎవరు రాస్తారంటూ దెబ్బలు కూడా పడేవి. నన్ను ప్రత్యేకంగా ఒక రిక్షాలో కాలేజీకి పంపేవారు. మేం తిరిగి బయటకొచ్చేదాకా ఆ రిక్షా అతను అక్కడే కాపలా ఉండేవాడు. అప్పుడు నేను ఫ్రెండ్స్‌తో వెనుక గేటు నుంచి సినిమాలకు వెళ్లేదాన్ని.
మీ కుటుంబం గురించి?
జయలలిత: మేం మొత్తం ఐదుగురం. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు. నాన్న చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. ఎప్పుడైనా సినిమాకు వెళ్లినప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే, వాళ్లను కొట్టి మమ్మల్ని సినిమా పూర్తిగా చూడనీయకుండా తీసుకెళ్లిపోయేవారు. ఆయన ‘నా దేశం’ అనే పత్రికను నడిపేవారు. మేం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది ‘అదిగో నా దేశం కూతుళ్లురోయ్‌’ అని అంటుండేవారు. ‘నా దేశం’ టైటిల్‌ను సినిమా కోసం స్వర్గీయ రామారావు గారికి ఇచ్చింది మా నాన్నే. ఆయనతో మా నాన్నకు మంచి ఫ్రెండ్షిప్‌ ఉండేది.

jayavaralakshmigh650-7.jpg
ఇండస్ట్రీలో ప్రవేశం ఎలా జరిగింది?
జయలలిత: నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. మా నాన్నకు తెలిసిన కొందరు నిర్మాతలు సినిమా తీయాలనుకున్నారు. అందులో హీరోయిన్‌ పాత్రకు భరతనాట్యం వచ్చుండాలి. ఆ క్రమంలోనే విజయా గార్డెన్స్‌లో ఒక సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడే సంయుక్త ఫిలిమ్స్‌ అధినేతల్లో ఒకరైన ధనుంజయ్‌ రెడ్డి నన్ను చూశారు. తన భాగస్వాములకు తెలియకుండా నన్ను వారు తీయబోయే చిత్రానికి హీరోయిన్‌గా ఎంపిక చేసి చెన్నైకి రప్పించారు. అయితే చివరికి ఆ పాత్ర సుమలతకి దక్కింది. అలా తొలి అవకాశం కోల్పోయాను. కుటుంబంతో సహా చెన్నై వచ్చేసిన నాకు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. విజయ గార్డెన్స్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడే ‘నానా’ అనే మలయాళీ పత్రిక వారు నా ఇంటర్వ్యూ తీసుకుని నా ఫొటోలను రకరకాల స్టిల్స్‌లో పబ్లిష్‌ చేశారు. అది చూసిన మాలీవుడ్‌ డైరెక్టర్‌ ఐ.వి. శశి ‘వ్రదం’ అనే సినిమాలో కమల్‌ హాసన్‌గారి పక్కన హీరోయిన్‌గా నాకు అవకాశం ఇచ్చారు. అలా ఇక్కడిదాకా వచ్చాను.
భీమవరం టు చెన్నై ప్రయాణం గురించి చెప్పండి?
వరలక్ష్మి: మా సొంతూరు భీమవరమే అయినా, నా చిన్నప్పుడే కుటుంబంతో సహా చెన్నై వచ్చేశాం. మా కుటుంబంలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటిసారి నేనే ఒక హిందీ చిత్రంలో చేశా. అలాగే తెలుగులో కళాతపస్వి విశ్వనాథ్‌ గారు తీసిన ‘జీవన జ్యోతి’లో నటించా. అందులో ‘పాత చింతకాయ పచ్చళ్లని ఇలా ఫ్లైట్‌లో తీసుకెళ్తే అందులో వాళ్లు వాసన వస్తున్నాయని విసిరి కొడతారు’ అనే డైలాగ్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే అయ్యింది. విశ్వనాథ్‌గారు తెరకెక్కించిన దాదాపు ఆరేడు సినిమాల్లో నేను నటించాను.

jayavaralakshmigh650-8.jpg
జయలలిత: ‘శంకరాభరణం’లో వరలక్ష్మి బిందె నడుంపై పెట్టుకుని డైలాగ్స్‌ చెబుతుంది.. ఆ సీన్‌లో ఎంతో క్యూట్‌గా ఉంటుంది. నదిలో గొంతు దాకా మునిగి సంగీతం సాధన చేస్తుంది. ఆ సీన్‌లో కూడా ఎంతో చక్కగా నటించింది.


ఎన్ని సినిమాల్లో నటించారు? ఎవరి కాంబినేషన్‌లో ఎక్కువగా చేశారు?
వరలక్ష్మి: నేనెప్పుడూ లెక్కపెట్టలేదు కానీ, 200లకు పైగానే ఉండొచ్చు. ఇక నటుల్లో ఎక్కువగా చిరంజీవిగారి చెల్లెలిగా నటించా. అలాగే కృష్ణగారి సినిమాల్లో ఎక్కువగా నటించేదాన్ని. ఇక లేడీ ఆర్టిస్టుల విషయానికొస్తే నటి శారద, అన్నపూర్ణమ్మ గార్లకు కూతురి పాత్రలో ఎక్కువగా నటించా. అలా అన్నపూర్ణమ్మతో రీల్‌ అనుబంధం రియల్‌లైఫ్‌లో మా అక్క వాళ్లింటి కోడలయ్యేలా చేసింది. ఆమె తమ్ముడికి మా అక్కను ఇచ్చి వివాహం చేశాం.
క్లాసికల్‌ డ్యాన్సర్‌ ఎందుకు సాంగ్స్‌ చేసింది?
జయలలిత: నిజంగా చెప్పాలంటే.. ఫ్యామిలీతో సహా చెన్నైకి వచ్చేశాం. ఎలాగైనా ఇదే ఇండస్ట్రీలో బతకాలి. మళ్లీ వెనక్కి వెళ్తే చులకన అయిపోతాననే భయం ఉండేది. దీంతో వచ్చిన పాత్రలన్నీ చేశా. ఏ డ్రస్ వేసుకోమంటే అది వేసుకునేదాన్ని. చెప్పాలంటే సిగ్గు పడకుండా పాత్రల్లో నటించా. ఆకలి బాధ అటువంటిది. ఆ తర్వాత కొందరు క్లాసికల్‌ డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వాలని ఆహ్వానించినా వెళ్లేదాన్ని కాదు. ఎందుకంటే వ్యాంప్‌ పాత్రల్లో నన్ను జనం ఎక్కువగా చూసేవారు. అలాంటిది నేను క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తే వాళ్లు దాన్ని ఒప్పుకోలేరు. అందుకే వెళ్లేదాన్ని కాదు. నాకు నటి శోభనను చూస్తే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. తను ఎన్ని సినిమాలు చేసినా చివరకు తన కళను మర్చిపోకుండా డ్యాన్స్‌ క్లాస్‌లు నడుపుతోంది. నాక్కూడా అలా డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టాలని చిరకాల కోరిక. ఎప్పటికైనా పెడతా. అంతా దైవేచ్ఛ.

jayavaralakshmigh650-5.jpg
ఎవరైనా ఒకటి లేదా రెండు సార్లు మోసపోతారు. మీరేంటి.. మోసపోతూనే ఉంటారు!
జయలలిత: నాతో ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న ఒక కుటుంబం సీరియల్స్‌ నిర్మిస్తూ ఉండేది. నోట్ల రద్దు టైంలో పన్నులు కట్టడం ఇబ్బందిగా ఉందని, సీరియల్స్‌ నిర్మించడం కష్టమని ఆ ఫ్యామిలీ నా దగ్గర వాపోయింది. ఆ సీరియల్లో నాది ఒక ప్రధాన పాత్ర. సీరియల్‌ ఆగిపోకూడదనే ఉద్దేశంతో తెలిసిన వాళ్లే కదాని డబ్బులు అప్పుగా ఇచ్చాను. షేర్ ఏమీ ఆశించకుండా కేవలం వడ్డీ ఇవ్వమని వారికి చెప్పా. అలా తీసుకుంటూ, ఇస్తూ 2018 నాటికి నా దగ్గర నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు లాగేశారు. కొన్నాళ్లకు కట్టలేమంటూ చేతులెత్తేశారు. ఆ దెబ్బకు ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను క్యాబ్‌లలో తిరగాల్సిన పరిస్థితి(బాగా ఎమోషనల్‌ అయ్యారు). షూటింగ్‌కు కూడా కంపెనీ వాళ్లు కారు పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం అనుకోవాలి ఈ దుస్థితిని. నేనేమైనా పాపం చేశానా? స్వయంకృతాపరాధమా? గత జన్మలో వాళ్లకేమైనా రుణపడి ఉన్నానా? అసలు నాకేమీ అర్థం కాలేదు. వాళ్లిప్పుడు విజయనగరంలోనే ఉన్నారు. కనీసం అంత ఇవ్వలేమమ్మా.. ఇదే ఇవ్వగలం.. అని కూడా అనడం లేదు. అసలు స్పందనే లేదు.
రోజువారీ చెల్లింపుపై సీరియల్స్‌ చేస్తున్నా, అతిథి పాత్రలు చేస్తున్నా. నా సొంత డబ్బు పోగొట్టుకుని ఏమిటీ కర్మ నాకు. కేవలం నమ్మకం మీద అంత డబ్బు ఇచ్చా. ఏవేవో ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. కానీ ఏం లాభం? హైదరాబాదు సీసీఎస్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశా. వాళ్లు విజయనగరం వెళ్లి వాళ్లని కనుక్కున్నారు కానీ, లాభం లేదు. నేనెంత పేదరికంలోనైనా ఉండగలను. ఎలా జీవించాలో నా తల్లిదండ్రులు నాకు నేర్పారు. కానీ ఈ వయసులో సొంత డబ్బు పోగొట్టుకుని ఇన్ని బాధలు ఎందుకు పడాలి? క్యారక్టర్ల కోసం అడుక్కుంటున్నాను. డబ్బు పోతే పోయిందని వదిలేసి బతుకుతున్నాను. కానీ చుట్టూ ఉండేవారు ‘అంత డబ్బూ పోగొట్టుకుని ఇంకా బతికున్నావా, ఏవైనా మింగి చనిపోతావ్‌ అనుకున్నామే’ అంటూ మాటలతో పొడుస్తున్నారు. వాళ్లు కూడా నా డబ్బు తిన్నవాళ్లే. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ఏనాడూ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు రాలేదు. ఎందుకంటే ఏదైనా బతికి సాధించాలనే మొండి ధైర్యం. ఈ ఉద్దేశంతోనే జిడ్డు కృష్ణమూర్తి గారి కథను అనుసరించి తనికెళ్లభరణి గారు, నేను ‘కీ’ అనే ఒక లఘుచిత్రం చేశాం. ‘వేయి చావుల కంటే బతుకు గొప్పది’ అనేది దాని క్యాప్షన్‌. అది చూసిన దిలీప్‌ అనే ఒక రైటర్‌ ఆత్మహత్య చేసుకుందామనే తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఇప్పటికీ ‘నాకు ప్రాణభిక్షను పెట్టిన దాతలు’ అంటూ మా ఇద్దరి ఫోన్లకు సందేశాలు పంపుతుంటాడు. అవి చూసినప్పుడల్లా ఒక జీవితాన్ని కాపాడామనే సంతృప్తి కలుగుతుంది.

jayavaralakshmigh650-9.jpg

ఆ డబ్బు తీసుకున్నవాళ్లని నువ్వు గట్టిగా అడగలేదా అక్కా?
జయలలిత: ఎన్నోసార్లు అడిగాను. వాళ్లిప్పుడు విజయనగరంలో ఉన్నారని తెలిసి ఎవర్నో బతిమాలి ఒక కారు తీసుకుని వెళ్లా. అక్కడా తప్పించుకున్నారు. ఎంతో కొంతైనా ఇవ్వండి అని అడుగుదామనుకున్నా. కాళ్లు పట్టుకుందామనుకున్నా. కానీ ఊర్లు తిరుగుతూ తప్పించుకుంటున్నారు. అతి సాధారణమైన ఆ కుటుంబం ముందు ముంబయి మాఫియా కూడా పనిచేయదు. అంత కరడుగట్టిన మోసగాళ్లు. ఇప్పుడు వాళ్లు కాంప్లెక్స్‌లు కట్టుకుని హాయిగా ఉంటున్నారని ఎవరో చెప్పారు. ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు కారులో వస్తుంటే ‘అబ్బా ఇలాంటి కారు మనకు ఉంటే బాగుంటుంది కదా’ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం(కంటతడి పెట్టుకున్నారు). ఈ షోలోనే శ్రీలక్ష్మిగారు చెప్పినట్టు రోజూ నా కష్టాలన్నింటినీ గోడకు చెప్పి బాధపడుతుంటా. బాబా ముందు కూర్చుని ఏడుస్తుంటా.

సాయిబాబా ఆలయం కూడా నిర్మించారనుకుంటాను?
జయలలిత: అవును! అక్కడ కూడా నన్ను చెడు చేశారు. ఇప్పుడా ఆలయంలోకి నాకు ప్రవేశం లేకుండా చేశారు. అప్పట్లో లత అనే అమ్మాయి, నటుడు చిట్టిబాబు, నేను కలిసి ఆ గుడిని నిర్మించాం. అమెరికా నుంచి నిధులు కూడా తెచ్చాం. నాకు సాయిబాబాను పరిచయం చేసింది నటి రమాప్రభ అమ్మ. ఆ గుళ్లో విగ్రహం నల్లరాతితో చేసింది. ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గుడి ద్వారా పేదలకు, భక్తులకు సహాయం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలనుకునేదాన్ని. ఇప్పుడు కొందరు నన్ను రాకుండా చేసి వారు అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఏది చేసినా దురదృష్టం వెంటాడుతోంది. నేను వీటిని ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ ఆ దేవుడిని అందుకు తగిన ఆత్మస్థైర్యం ఇవ్వమని కోరుకుంటున్నా.

jayavaralakshmigh650-4.jpg

మీది ప్రేమ వివాహమా, పెద్దలు నిశ్చయించిందా?
వరలక్ష్మి: పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహం(నవ్వులు). నాకు ఒకే ఒక్క కూతురు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో పెళ్లి చేశాం. ప్రస్తుతం వాళ్లు తమిళనాడులోని వేలూర్‌లో ఉంటున్నారు. వారికి కూడా ఒక పాప.

ఇండస్ట్రీని ఎప్పుడు వదిలేశారు?
వరలక్ష్మి: నేనేమీ ఉద్దేశపూర్వకంగా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోలేదు. ‘చిట్టెమ్మ మొగుడు’ సినిమా చేస్తునప్పుడు నేను గర్భిణిని. షూటింగ్‌లో భాగంగా కిందపడే సీన్లలో నటించాలి. అది కొంచెం కష్టమైంది. బిడ్డను ప్రసవించాక కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నా. మళ్లీ ‘ఆమె’, ‘ఆడవాళ్లా మజాకా’, ‘మాతో పెట్టుకోవద్దు’ ఇలా కొన్ని సినిమాల్లో నటించా. తర్వాత సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టా. ఎక్కడా బ్రేక్‌ అయితే ఇవ్వలేదు.
ఏ సినిమాలో నటిస్తున్నప్పుడు కష్టమనిపించింది?
వరలక్ష్మి: ఒక హిందీ సినిమాలో నటించినప్పుడు చాలా కష్టమనిపించింది. అదొక డెన్‌ సెట్‌. లొకేషన్‌ అంతా నిప్పురవ్వలు వచ్చేలా డిజైన్‌ చేశారు. జితేంద్ర గారు, శ్రీవిద్య అందులో లీడ్‌. ఒక చిన్న పాప పాత్ర నాది. దానికి ముందు వేరే అమ్మాయిని ఆ పాత్రకు తీసుకున్నారు. ఆమె భయపడడంతో వాళ్లమ్మ ‘మా కూతురు బాగుంటే చాలు.. సినిమా వద్దు ఏం వద్దు’ అంటూ తీసుకెళ్లిపోయింది. దీంతో చిత్రబృందం టెన్షన్‌ పడ్డారు. అసలే జితేంద్ర గారి డేట్స్‌ తక్కువగా ఉన్నాయి. దీంతో నన్ను ఆ పాత్రకు ఎంచుకున్నారు. నేను ఆ డెన్‌ వాతావరణాన్ని చూసి అస్సలు భయపడలేదట.. అసలు నన్ను చిత్రపరిశ్రమలోకి తీసుకొచ్చింది రమాప్రభ గారు. మా నాన్న కూడా నటులే. కానీ, చిన్న చిన్న పాత్రలు వస్తుండేవి. దీంతో రమాప్రభ గారు ‘ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎన్నాళ్లు ఉంటావు. నీ కూతురుని ఆర్టిస్ట్‌ చెయ్‌. చక్కగా ఉంటుంది’ అని సలహా ఇచ్చారట. దీంతో నాకు ‘అందాల రాముడు’ చిత్రంలో అవకాశమిచ్చారు. అందులో ‘ఎదగడానికెందుకురా తొందర’ అనే పాటలో నాగేశ్వరరావు గారు నన్ను ఎత్తుకుని పాట పాడతారు.

jayavaralakshmigh650-6.jpg
ఎందుకు హైదరాబాద్‌లో కాకుండా, చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు?
వరలక్ష్మి: సరిగ్గా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చేసినప్పుడు మా నాన్నగారు కాలం చేశారు. అప్పటికే నేను తెలుగు సినిమాల్లో చెల్లెలి పాత్రల్లో నటిస్తున్నా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నాన్నగారితో ‘నాన్నా.. నేను సినిమాల్లో నటిస్తాను, మిగతా వాళ్లను చదివించండి’ అని భరోసా ఇచ్చా. దీంతో వాళ్లు బాగా చదువుకుని డిగ్రీలు పూర్తి చేశారు. నేనేమో అస్సలు చదువుకోలేదు. దీంతో వచ్చిన సినిమాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత అక్కకు పెళ్లి చేసేశాం. ఆ తర్వాత అక్కలిద్దరూ ఆసక్తితో నటనలోకి వచ్చారు. ప్రస్తుతం రాణి మాత్రమే సీరియల్స్‌లో నటిస్తోంది.

jayavaralakshmigh650-3.jpg
ఇప్పుడున్న హీరోల్లో మీ అభిమాన నటుడెవరు?
వరలక్ష్మి: ఇప్పటి హీరోల్లో మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ అంటే ఎంతో అభిమానం. అవకాశం వస్తే వాళ్లిద్దరితో నటించాలని ఉంది. మహేశ్‌కి అత్తగా కంటే అమ్మలా నటించాలని ఉంది. ఎందుకంటే మా ఇద్దరి ముక్కులు ఒకేలా ఉంటాయి కదా. అలాగే బన్నీకి కూడా అమ్మ పాత్రలో నటించాలని ఉంది. ఆయన నా ముద్దుల కొడుకుగా నటిస్తారు(నవ్వులు).

ఇండస్ట్రీకి వచ్చి ఏం పోగొట్టుకున్నారు, ఏం సంపాదించారు?
వరలక్ష్మి: ఈ రంగంలోకి వచ్చాక నేను చదువును కోల్పోయా. ఏం చేద్దాం.. పరిస్థితులు సహకరించలేదు. ఇందులో సంపాదించిందేంటంటే ఒక నటిగా మంచి గౌరవం. మా నాన్నగారి దీవెన ఇది. మా కుటుంబంలో మొదటి ఆర్టిస్ట్‌ని నేనేనని చెప్పుకోవటానికి గర్వపడుతున్నా. ‘చెల్లెలు వరలక్ష్మి’గా నా నటనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారనే నమ్మకం నాకుంది. నా జీవితంలో తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉంటా. నాకు ఎంతో చేశారు. ఇప్పుడు ఇద్దరూ ఈ భూమ్మీద లేరు. వాళ్లిద్దరూ నా ఒడిలోనే కళ్లు మూశారు. మా మామగారు కూడా. నా కళ్లల్లో చూస్తూ వాళ్లు తమ ప్రాణాలు విడిచారు. మా మామయ్య తన పుట్టినరోజు నాడే చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది.

women icon@teamvasundhara
dhanya-balakrishna-interacts-with-her-instagram-fans-in-telugu

అప్పుడు ‘వరల్డ్‌ గ్రేటెస్ట్‌ లవర్‌’ అయ్యుండేదాన్ని!

పుట్టింది బెంగళూరులో అయినా అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది ధన్య బాలకృష్ణ. సినిమాల్లో తనదైన యాస, అభినయంతో అలరించే ఈ అమ్మడికి తెలుగునాట భారీగానే అభిమానులున్నారు. ‘లవ్‌ ఫెయిల్యూర్‌’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ సొగసరికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజా రాణీ’, ‘రన్‌ రాజా రన్‌’, ‘చిన్నదానా నీ కోసం’, ‘రాజు గారి గది’, ‘నేను శైలజ’ తదితర సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఓ వైపు క్యారక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పిస్తూనే మరోవైపు ‘చిన్ని చిన్ని ఆశ’, ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ లాంటి సినిమాల్లో కథానాయికగానూ మెప్పించిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
meera-chopra-reveals-she-lost-two-of-her-family-members-to-covid-19-in-last-10-days

కరోనాతో పది రోజుల్లో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయాను!

లక్షలాది కేసులు.. వేలాది మరణాలు.. ఆస్పత్రుల్లో సరిపోని పడకలు, వెంటిలేటర్‌ బెడ్లు.. ఆక్సిజన్‌ కొరతతో విలవిల్లాడుతున్న ప్రాణాలు... అంతిమ సంస్కారాలకూ క్యూలో ఎదురు చూడాల్సిన దయనీయ స్థితి... దేశంలో కరోనా ప్రకోపానికి ప్రత్యక్ష సాక్ష్యాలివే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతోందీ మహమ్మారి. ఈ క్రమంలో కరోనాతో పది రోజుల వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయానంటోంది ప్రముఖ నటి మీరా చోప్రా. సకాలంలో సరైన వైద్యం అందక 40 ఏళ్ల లోపే వారు కన్ను మూశారంటూ తీవ్ర ఆవేదన చెందుతోంది. ఈ సందర్భంగా కొవిడ్‌ కారణంగా తనకెదురైన కొన్ని చేదు అనుభవాల గురించి అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
alitho-saradaga-special-chat-show-with-surekha-vani-and-rajitha

అందుకే పెళ్లి చేసుకోలేదు!

తల్లిగా.. చెల్లిగా.. అక్కగా.. వదినగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం... ప్రేక్షకులను అలరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆకట్టుకునే అందం, చక్కటి అభినయ ప్రతిభ వారిద్దరి సొంతం. కేవలం సినిమాలతోనే కాదు.. తమ స్వతంత్ర భావజాలంతోనూ అశేష అభిమానాన్ని సంపాదించుకున్న వారే సీనియర్‌ నటీమణులు సురేఖా వాణి, రజిత. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వారు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మరి ఆ సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-her-post-covid-recovery-tips-through-an-instagram-post

కరోనా నుంచి ఈ చిట్కాలతో అలా కోలుకున్నా!

ప్రస్తుతం మనందరికీ కొవిడ్‌ తప్ప వేరే ధ్యాసే లేకుండా పోయింది. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు, ఒకవేళ వైరస్‌ బారిన పడ్డా త్వరగా కోలుకునేందుకు పాటించే చిట్కాల గురించే ఇప్పుడందరూ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న కొంతమంది వారి అనుభవాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. వీరిలో పలువురు సెలబ్రిటీలూ ఉన్నారు. తాజాగా అందాల తార సమీరా రెడ్డి కూడా అదే చేసింది. ఇటీవలే తన కుటుంబం వైరస్‌ బారిన పడినట్లు వెల్లడించిన ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఇప్పుడు వైరస్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన చిట్కాల గురించి సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. కరోనా బారిన పడిన క్రమంలో- అలసట/నీరసాన్ని పూర్తిగా దూరం చేసి తిరిగి ఎప్పటిలాగే తనను యాక్టివ్‌గా మార్చేందుకు ఈ చిట్కాలు దోహదం చేశాయంటూ అందరిలో నెలకొన్న కొవిడ్‌ భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోందీ క్యూట్‌ మామ్‌. మరి, ఇంతకీ ఏంటా టిప్స్‌? మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sania-mirza-opens-up-on-her-battle-with-depression-in-telugu

అప్పుడు నెల రోజులు గదిలో నుంచి బయటికి రాలేదు!

మన కెరీర్‌పై మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం.. ఎన్నెన్నో సాధించాలనుకుంటాం.. కానీ అవి నెరవేరకపోతే నిరాశ చెందుతాం.. కొంతమందైతే వాటినే తలచుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు కూడా! అలా తాను కూడా సుమారు మూణ్నాలుగు నెలల పాటు కుంగుబాటులోనే గడిపానంటోంది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. మణికట్టు గాయంతో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొని మధ్యలోనే వెనుతిరిగిన ఆమె.. అర్ధాంతరంగా ఆటకు దూరమైనందుకు ఎంతగానో బాధపడ్డానంటోంది. ఆ సమయంలో ఒక్కసారిగా భవిష్యత్తంతా శూన్యంగా అనిపించిందని, తానెంతో ప్రేమించే టెన్నిస్‌ను ఇకపై ఆడతానో, లేదోనన్న బాధ తన మనసుని ఉక్కిరిబిక్కిరి చేసిందంటోంది. ఈ డిప్రెషన్‌తో తాను అనుభవించిన వేదనను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ టెన్నిస్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-her-post-pregnancy-struggles-in-telugu

ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి నాకు రెండేళ్లు పట్టింది!

అమ్మతనం మన శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.. ఈ క్రమంలో అందం తగ్గిపోవడం, స్ట్రెచ్‌ మార్క్స్‌, పొట్ట ఎత్తుగా కనిపించడం.. ఇలా మనలో వచ్చే మార్పుల్ని అంగీకరించాలంటే అందుకు ముందు నుంచే మానసికంగా సిద్ధపడాలి. లేదంటే తనలా ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందంటోంది అందాల తార సమీరా రెడ్డి. తల్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమై.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తనకెదురయ్యే ప్రతి అనుభవాన్నీ సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోతుంటుంది. అంతేకాదు.. ప్రసవానంతర ఒత్తిడి, బాడీ షేమింగ్‌, ఫ్యాట్‌ షేమింగ్‌.. వంటి విషయాలపై కుండ బద్దలుకొట్టినట్లుగా మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్టులు పెట్టే ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఒకప్పుడు తాను తల్లయ్యే క్రమంలో అందం విషయంలో తెగ మథనపడ్డానని చెబుతోంది. ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ఆ అనుభవాలను, ప్రసవానంతరం తాను ఎదుర్కొన్న ఒత్తిడి, దాన్నుంచి బయటపడిన తీరు గురించి సోషల్‌ మీడియా బ్లాగ్‌ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’తో పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
neha-dhupia-shares-empowering-message-on-breastfeeding-in-telugu

పాలిచ్చే తల్లుల్ని ఆ దృష్టితో చూడడమెందుకు?!

అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చుతుంది.. ఇలా తన చిన్నారికి పాలిచ్చే క్రమంలో ఎంతో భావోద్వేగానికి, ఎనలేని ఆనందానికి లోనవుతుంటుంది. అయితే అమ్మతనానికి అద్దం పట్టే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రక్రియ గురించి మహిళల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ అది నాలుగ్గోడలకే పరిమితమవుతుంది తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి నేటికీ చాలామంది తల్లులు ముందుకు రావట్లేదు. ఇందుకు కారణాలు అనేకం! ముఖ్యంగా తల్లి ఎంతో ప్రేమగా బిడ్డకు పాలిచ్చే ఈ ప్రక్రియను కొంతమంది చెడు దృష్టితో, లైంగిక విషయంగా పరిగణిస్తుంటారు. తల్లి పాలు తాగి పెరిగి.. తల్లితో సమానమైన అలాంటి మహిళలు వారి పిల్లలకు పాలిచ్చే క్రమంలో వారిని తప్పుడు దృష్టితో చూడడం, విమర్శించడం చేసే కొందరు మూర్ఖులు మన సమాజంలో కొందరున్నారు. అలాంటి వారికి తనదైన రీతిలో సమాధానమిచ్చింది బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ నేహా ధూపియా. ఈ క్రమంలో బ్రెస్ట్‌ఫీడింగ్‌ విషయంలో ఇటీవలే ఓ తల్లి ఎదుర్కొన్న చేదు అనుభవానికి మద్దతుగా నిలుస్తూ.. ఈ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
urvashi-dholakia-says-her-twin-sons-want-her-to-get-married-again-in-telugu

నా పిల్లలు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు!

విడాకులకు సంబంధించి మన సమాజంలో పాటిస్తోన్న కొన్ని కట్టుబాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మహిళలు, పురుషుల మధ్య ఉన్న అసమానతలేంటో స్పష్టంగా కనిపిస్తాయి. విడాకులు పొందిన మగవారు స్వేచ్ఛగా మరో వివాహం చేసుకోవచ్చు. పైగా ఈ విషయంలో అతనికి కుటుంబ సభ్యుల సానుభూతి, సహకారం రెండూ తోడవుతాయి. ఇదే ఆడవారి విషయానికొస్తే మాత్రం కుటుంబంలోనే కాదు సమాజంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద నేరంగా భావిస్తారు. ఇక పిల్లలుండి రెండోసారి పెళ్లిపీటలెక్కిన వారైతే సూటి పోటి మాటలు, అవమానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

Know More

women icon@teamvasundhara
naagin-5-actress-kajal-pisal-tests-negative-for-covid-19-and-shares-her-scary-experiences

కరోనాతో చావు అంచుల దాకా వెళ్లొచ్చాను!

రోగులతో కిటకిటలాడుతోన్న ఆస్పత్రులు... చాలాచోట్ల పడకలు లేక బయటే బాధితుల పడిగాపులు... ఆక్సిజన్‌ కొరతతో గాల్లో కలిసిపోతోన్న నిండు ప్రాణాలు...ఇలా కరోనా వైరస్ రెండో దశ యావత్‌ దేశాన్ని కలవరపెడుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బుల్లితెర నటీమణి కాజల్ పిసల్ ఒకరు. ‘నాగిన్ 5’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె... కొద్దిరోజుల క్రితం కరోనాకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోనప్పటికీ... ఇటీవల జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు నెగెటివ్‌ అని తేలింది.

Know More

women icon@teamvasundhara
women-should-not-give-up-on-any-of-their-passions-says-geeta-basra

ఆ పవర్ మనకు పుట్టుకతోనే వచ్చింది!

అప్పటిదాకా జీవితంలో ఏదో సాధించాలని ఆరాట పడే మహిళల్లో చాలామంది పెళ్లి తర్వాత తమ కలలను పక్కన పెట్టేస్తుంటారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు... తదితర బాధ్యతలలో పడి తమ ఆకాంక్షలు, ఆశయాలను త్యాగం చేసేస్తుంటారు. అయితే మల్టీ టాస్కింగ్‌ పవర్‌ అనేది మహిళల్లో సహజంగా ఉంటుందని... ఎవరూ పెళ్లి, పిల్లల కోసం తమ కలలను త్యాగం చేయాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా. మాతృత్వం అనేది కేవలం వ్యక్తిగత విషయమని, ఓ మహిళ జీవితాన్ని అది పూర్తిగా నిర్వచించలేదని ఆమె చెబుతోంది. ఆరేళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో పెళ్లిపీటలెక్కిన గీతకు హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ క్రమంలో మరోసారి తల్లి కాబోతున్న ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
pregnant-shreya-ghoshal-shares-pics-from-surprise-baby-shower

శ్రేయా ఘోషల్ సీమంతం వేడుకలు చూశారా?

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన స్వరంతో సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది శ్రేయా ఘోషల్‌. ‘జల జల జలపాతం’ అంటూ ప్రస్తుతం మనందరి మదిని మీటుతోన్న ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ త్వరలోనే తల్లిగా తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయిందీ అందాల గాయని. పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. శ్రేయ సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-recalls-the-hate-she-received-after-covid-diagnosis

అప్పుడు కరోనా కంటే వాళ్ల కామెంట్లే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి!

సాఫీగా సాగిపోతున్న మన జీవితాల్లోకి కోరుకోని అతిథిలా వచ్చింది కరోనా. కనికరం లేకుండా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. అదే సమయంలో భయం పేరుతో మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మంటగలిపిందీ మహమ్మారి. ఇప్పుడు కరోనాకు భయపడడం కాస్త తగ్గింది కానీ సరిగ్గా ఏడాది క్రితం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయాన అక్కడక్కడా జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం, వారి కుటుంబ సభ్యులను అవమానాలకు గురిచేయడం లాంటి సంఘటనల గురించి మనకు తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
mira-rajput-interacting-with-instagram-fans-and-held-thisorthat-session

అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లను మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్‌ ఆర్‌ దట్‌’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dia-mirza-clarification-over-her-pregnancy-getting-married

అందుకే అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేకపోయాను!

‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అన్న మాటలకు సరిగ్గా సరిపోతుంది బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా. సామాజిక అంశాలు, మహిళల సమస్యలపై తనదైన శైలిలో స్పందించే తెగువే ఆమెకు ఆ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిందీ అందాల తార. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్న దియా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌, విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, నెటిజన్లు లేవనెత్తిన పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
actress-and-tv-host-hariteja-blessed-with-a-baby-girl-in-telugu
women icon@teamvasundhara
from-yoga-to-ghar-ka-khaana-shilpa-shetty-reveals-20-things-she-loves

ఈ 20 నాకెంతో ఇష్టం!

శిల్పా శెట్టి...ఈ పేరు తలచుకోగానే సన్నజాజి తీగ లాంటి నాజూకైన శరీరాకృతి, అందమైన రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని ఈ అందాల రాణి పూర్తి స్థాయి సినిమాలో నటించి సుమారు పద్నాలుగేళ్లు గడిచాయి. అయినా తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటే అందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియానే అని చెప్పుకోవచ్చు. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలతో పాటు.. తాను పాటించే ఆహార, ఫిట్‌నెస్‌ నియమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ సొగసరికి అలవాటు. అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాల్లో శిల్పను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
miss-india-finalist-diksha-singh-to-contest-up-panchayat-poll

ఈ అందాల రాణి అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
kirti-kulhari-announces-separation-from-husband-saahil-sehagal-after-5-years-of-marriage
women icon@teamvasundhara
these-star-kids-are-making-a-splash-on-social-media-in-telugu

women icon@teamvasundhara
meet-geeta-a-52-years-teacher-turned-lingerie-model-who-is-redefining-beauty-standards

ఈ వయసులో లో దుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే!

చూడగానే ఆకట్టుకునే అందం... సొగసైన శరీరాకృతి... పొడవాటి కేశ సౌందర్యం... ఇలా నవ యవ్వనంతో మెరిసిపోయే యువ అందాలనే తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా నియమించుకుంటాయి దుస్తుల తయారీ సంస్థలు. యువతులు, మధ్య వయసు మహిళలు, వృద్ధులు... ఏ వయసు వారి దుస్తులకైనా యువతులనే ప్రచారకర్తలుగా తీసుకుంటాయి. వయసు ప్రతిపాదికన మోడల్స్‌ను తీసుకునే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఈ క్రమంలో ‘నా వయసు వారి లో దుస్తులకు నా వయసు వారినే మోడల్స్‌గా ఎందుకు నియమించకూడదు’ అనే ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించింది ముంబయికి చెందిన 52 ఏళ్ల గీత. లో దుస్తుల మోడలింగ్‌లో దూసుకెళుతోన్న ఆమె లింగరీ మోడలింగ్‌పై ఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె ఎందుకీ ఉద్యమం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-on-how-failed-marriages-impacted-her-children

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
rubina-dilaik-opens-up-about-her-mental-health-issues-in-telugu

అప్పుడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను!

డిప్రెషన్... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న మానసిక సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఆకాశమంత ఎదిగిన మనిషిని కూడా అధఃపాతాళానికి తొక్కేస్తుందీ సమస్య. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, వ్యక్తిగత, ఆర్థికపరమైన సమస్యలు, పని ఒత్తిడి... వంటి ఎన్నో కారణాలు డిప్రెషన్‌ తలెత్తడానికి దోహదం చేస్తాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే దీనిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ నేపథ్యంలో మానసిక ఆందోళనతో గతంలో తన మదిలోనూ ఆత్మహత్య ఆలోచనలు మెదిలాయంటోంది ‘ఛోటీ బహూ’ రుబీనా దిలాయిక్‌. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ముగిసిన బిగ్‌బాస్‌-14 సీజన్‌లోనూ విజేతగా అవతరించింది. తద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా డిప్రెషన్‌తో తనకెలాంటి గడ్డు పరిస్థితులెదురయ్యాయో అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
ankita-lokhande-shares-casting-couch-experience-in-telugu

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో కాంప్రమైజ్‌ కావాలన్నాడు!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ రాణించాలంటే ఎన్నో ముళ్ల దారులు దాటాల్సి ఉంటుంది. అవకాశమొస్తే కాటేయాలని చూసే ఎన్నో మృగాలు ఆ దారిలో కాచుకుని ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని తెరపై కనిపించి, అభిమానులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈక్రమంలో చాలామందిలాగే తానూ ఎన్నో ముళ్లదారులను దాటాకే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకున్నానంటోంది బాలీవుడ్‌ నటి అంకితా లోఖండే. దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రేయసిగా ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆమె కెరీర్‌ ప్రారంభంలో తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడ్డానంటోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకెదురైన కొన్ని చేదు అనుభవాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-says-she-had-it-hard-as-a-teenager-as-she-would-stammer-and-was-on-the-heavier-side

అప్పట్లో ఆ కామెంట్లను తట్టుకోలేకపోయాను!

కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిల్ని చూడగానే కొంతమంది వెంటనే ‘అబ్బ ఎంత లావుగా ఉంది’ అంటూ నవ్వుకోవడం, హేళన చేయడం చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు... బొద్దుగా ఉన్న వాళ్లు సరదాకి ఏదైనా ఫొటో షేర్ చేస్తే చాలు... కామెంట్ల రూపంలో అసభ్యకర మాటలు, దూషణలు కనిపిస్తుంటాయి. ఇలాంటి మాటలతో ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా తానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. అయితే సమాజంలో అన్ని విషయాలను సహనంతో ఎదుర్కొన్నానని, తన పిల్లలకు కూడా అదే నేర్పిస్తానంటూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసిందీ సూపర్‌ మామ్.

Know More

women icon@teamvasundhara
geeta-basra-harbhajan-expecting-second-child-in-july

మరోసారి అమ్మను కాబోతున్నా!

అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందుతున్నామని తెలియగానే కలిగే ఆనందం అనిర్వచనీయం. ఇక మొదటిసారి పేరెంట్స్‌గా మారిన జంటలు... మరోసారి తల్లిదండ్రులయ్యేసరికి మరింత ఆనందోత్సాహాలకు, భావోద్వేగానికి గురవుతుంటారు. తమ సంతోషాన్ని అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా-టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌. ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇప్పటికే హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ సందర్భంగా త్వరలోనే తాము మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్.

Know More

women icon@teamvasundhara
sunitha-takes-instagram-to-counter-trolls-on-women’s-day

మీరు నిందిస్తారు.. అండగా నిలవరు.. అయినా క్షమిస్తా!

రాజ్యాంగం అందించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ను అడ్డుపెడ్డుకుంటూ కొంతమంది అవసరం లేకపోయినా ఇతరుల జీవితాల్లోకి తొంగిచూస్తుంటారు. తాము ఎలా ఉన్నా సరే... వారిని మాత్రం నోటికొచ్చినట్లు ఆడిపోసుకుంటుంటారు. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమంది నెటిజన్లు ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను టార్గెట్‌ చేసుకుని, వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత కూడా సోషల్‌ మీడియాలో ఎన్నోసార్లు నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ పెద్దగా వాటిపై స్పందించని ఈ స్టార్‌ సింగర్‌ తాజాగా నోరు విప్పింది. సోషల్‌ మీడియా ట్రోల్స్‌ కారణంగా తానెలా ఆవేదన చెందానో అందరితో షేర్‌ చేసుకుంది. అదే సందర్భంలో అకారణంగా తనను ఆడిపోసుకున్న వారికి సున్నితంగా సమాధానమిచ్చింది.

Know More

women icon@teamvasundhara
singer-shreya-ghoshal-announces-first-pregnancy-with-this-adorable-post

నేను అమ్మను కాబోతున్నా!

మహిళలకు అమ్మతనానికి మించి మరే విషయం అమితానందాన్ని ఇవ్వదు. అందుకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మహిళలందరూ ఎప్పుడెప్పుడు అమ్మగా ప్రమోషన్‌ పొందుదామా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక కడుపులో నలుసు పడిందని తెలిసిన మరుక్షణం వారి ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తోంది అందాల సింగర్ శ్రేయాఘోషల్. తన శ్రావ్యమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్‌ సింగర్‌ త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకున్న ఆమెకు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
jayasudha-latest-grey-hair-look-goes-viral-on-social-media

మా ‘సహజ నటి’ ఎందుకిలా మారిపోయారు?

జయసుధ... నాలుగున్నర దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలు అందిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాడు కథానాయికగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆమె... నేడు మోడ్రన్‌ మదర్‌గా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇలా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సహజనటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జయసుధ చివరిగా రెండేళ్ల క్రితం ‘రూలర్‌’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఎక్కడా కనిపించని ఆమె చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌ బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
richa-gangopadhyay-announces-pregnancy-on-social-media