scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాన్నే కాటేయాలని చూశాడు..!'

'కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. అప్పటికి ఆమె ఎనిమిదో తరగతి చదువుతోంది. జరిగిన విషయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అతను భార్య కాళ్ల మీద పడి ఇంకెప్పుడూ ఇలా జరగదంటూ కపట ప్రేమను ప్రదర్శించాడు. కానీ ఆ ముసుగు కొన్ని రోజులు మాత్రమే నిలిచింది.. మళ్లీ కూతురిపై అత్యాచారానికి పాల్పడడంతో ఈసారి ఆ అమ్మాయి వూరుకోలేదు.. నేరుగా పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయిలు వేధింపుల విషయంలో మౌనం వహించడం తగదు అంటోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏం జరిగింది?? తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

మా పెళ్లికి జాతకాలు కలవలేదు... కానీ!

Madhumitha And Siva Balaji In Alitho Saradaga Chat Show in Telugu

ఆమె ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమాతో ప్రతి తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది. అతనేమో ‘ఆర్య’, ‘చందమామ’, ‘సంక్రాంతి’ చిత్రాలతో అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు. వ్యక్తిగతంగా తమ సహజ నటనతో మెప్పించే వీరిద్దరు సిల్వర్‌స్ర్కీన్‌పై ఎప్పుడూ జంటగా కనిపించలేదు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ ఫుల్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వారే నటులు శివబాలాజీ, మధుమిత. పుష్కర కాలం కిందట పెళ్లిపీటలెక్కిన ఈ అందాల జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ యువతకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోంది. ఎప్పుడు చూసినా నవ్వుతూ సరదాగా కనిపించే ఈ లవ్లీ కపుల్ ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్‌ చేసుకున్నారు.


స్వప్న మాధురి మధుమితగా ఎలా మారింది?
మధుమిత: తెలుగులో చేస్తున్నపుడు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క పేరు పెట్టేవారు. అప్పట్లో స్వప్న అని మరొక నటి ఉండేది. నా పేరు స్వప్నమాధురి అయినప్పటికీ అందరూ స్వప్న అనే పిలిచేవారు. అందుకే పేరు మార్చుకోవాలనుకున్నా. ‘పుట్టింటికి రా చెల్లి’ చిత్రంలో నా పాత్ర పేరు స్వాతి. అదే స్క్రీన్‌ నేమ్‌గా వేశారు దర్శకులు కోడి రామకృష్ణగారు. ఆ తర్వాత తమిళ్‌లో హీరోయిన్‌గా సినిమాలు చేయడం ప్రారంభించాను. అప్పుడు ఒక సినిమాలో నా పాత్ర పేరు మధుమిత. ఇంటర్వ్యూలు తీసుకునేవారు కూడా అలానే నన్ను పరిచయం చేశారు. సెట్‌లో కూడా అలాగే పిలిచేవారు. అలా నా పేరు మారింది. నటుడు పార్థిబన్‌ కూడా నా పేరు మార్పుకు కారణం.
మీ సొంతూరు?
మధుమిత: నెల్లూరు, ప్రకాశంలో మా మూలాలు ఉన్నాయి. ప్రకాశంలోని చిన్నపావని అనే గ్రామం మా అమ్మ వాళ్లది. మా నాన్నగారిది పెద్దపావని అనే గ్రామం.
‘మనోహరన్‌’ శివబాలాజీగా ఎలా మారారు?
శివబాలాజీ: మా నాన్న పేరు మనోహరన్, నాపేరు శివబాలాజీ మనోహరన్‌. మేము తమిళనాడుకు వలస వెళ్లాక మా తండ్రి పేరే ఇంటిపేరుగా మారిపోయింది.
మధు: అయితే, వీరి కుటుంబం ఇంటి పేర్ల గురించి ఒకరు పుస్తకం రాశారు. అందులో ‘కాంగుల’ అనేది ఇంటి పేరుగా ఉంది. ఇప్పుడు మా పిల్లలకు ఇంటి పేరుగా అదే ఉంచాం.
మీ సొంతూరు ఏది?
శివబాలాజీ: పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. మా పూర్వీకులు చిత్తూరు నుంచి తమిళనాడుకు వలస వెళ్లారు. మధురైలోని రాజుపాలెం, మహారాజపురంలో ఇప్పటికీ మావాళ్లు ఉంటారు. వాళ్లు మాట్లాడే తెలుగు కొత్తగా ఉంటుంది. ‘భోం చేశారా’ ’అని అడగటానికి ‘కూడు తింటివా’ అని అంటుంటారు. అలాగే కూతురిని చెలా అనీ, తండ్రిని అయ్యా అనీ పిలుస్తారు. మా అమ్మగారిది గుంటూరే. ఎవరన్నా నన్ను సొంతూరు పేరు చెప్పమంటే ‘గుంటూరు’ అనే చెప్తాను.


మా ఇద్దరిలో (శివ బాలాజీని చూపిస్తూ)ఎవరు నీకు ముందు పరిచయం?
మధు: మీరే! డ్యాన్స్ బేబీ డ్యాన్స్‌ షోలో పరిచయం అయ్యారు.
మొదటిసారి తెరకు ఎప్పుడు పరిచయం అయ్యారు?
మధు: నాకిప్పటికీ గుర్తు. ‘అన్నమయ్య’ చిత్రం అప్పుడే రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం ప్రమోషన్‌ కోసం కొన్ని ఆడిషన్స్‌ చేశారు. అక్కడకు వెళ్లిన నాకు ఒక డైలాగ్‌ చెప్పమని అడిగారు. టీనేజ్‌ కావడంతో గొంతులో అంత గంభీరత ఉండేది కాదు. దీంతో వాళ్లు మరో రెండేళ్లు ఆగితే మంచి అవకాశాలు వస్తాయని వెనక్కు పంపించారు.
శివబాలాజీ మీకు ఎక్కడ పరిచయం?
మధుమిత: 2004లో తమిళనాడులోని గోపిచెట్టిపాలెంలో ‘ఇంగ్లీష్‌ కారన్‌’ అనే చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అది హీరోయిన్‌గా నా మూడో చిత్రం.. అప్పటికే శివబాలాజీ కంటే ఇండస్ట్రీలో నేను సీనియర్ని. అక్కడే ఆయన పరిచయమయ్యారు.


మొదటిసారి కలిసినపుడు ఏమన్నారు?
శివబాలాజీ: ఎవరైనా హలో అనే అంటారు సార్‌! (నవ్వులు)
మధు: ఆ చిత్రం షూటింగ్‌ ఒక ఇంట్లో జరుగుతోంది. ఆయన సెట్లో ఒక పక్కన కూర్చుని ఉన్నారు. డైరెక్టర్‌ మా ఇద్దరికీ పరస్పరం పరిచయం చేయించారు. నేను ఆయన్ను చూడగానే ‘హా.. మీరు నాకు తెలుసు. మీ ‘అశోక్‌ గాడి లవ్‌స్టోరీ’ సినిమా చాలా బాగుంది అన్నాను. అప్పటికే ఆయనపై నాకు మంచి అభిప్రాయం ఉండేది.
శివబాలాజీ: అంతకుముందు ‘అమ్మాయిలు.. అబ్బాయిలు’ సినిమా చూసినపుడే మధుమితను చూసి ‘ఈ అమ్మాయి బాగా చేస్తోందే అనుకున్నాను’. ఆ తర్వాత ‘ఆర్య’ రిలీజ్‌ అయ్యాక ‘ఇంగ్లీష్‌ కారన్‌’ లో నాకు అవకాశం వచ్చింది.
మధుమిత: ‘ఇంగ్లీష్ కారన్‌’ దర్శకుడు శక్తి సిదంబరన్‌ మా ఇద్దరి మధ్య ప్రేమకు మొదట బీజం వేశారు (నవ్వులు). ఆయన సెట్లోని వారందరికీ ‘శివబాలాజీ చేస్తేనే నేను హీరోయిన్‌గా చేస్తానంటుంది మధుమిత’ అని ఒక రూమర్‌ సృష్టించారు. శివబాలాజీని నేనే రికమండ్‌ చేసినట్టు చెప్పేవారు.


ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?
శివబాలాజీ: మా ఇద్దరికీ ఈ లవ్‌ ప్రపోజల్స్‌ లేవు. నేరుగా పెళ్లి గురించే మాట్లాడుకున్నాం.
మధుమిత: అంతకంటే ముందు ఆయన నన్ను చాలా ఏడిపించేవారు.
శివ బాలాజీ: అలా అని ఏం కాదు! మా ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. నేను కోరుకున్న భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. దీంతో కుదిరినప్పుడల్లా ఫ్లర్ట్‌ చేస్తూ ఉండేవాడిని (నవ్వులు). అలా తనతో పెళ్లి గురించి మాట్లాడాను.
మరి మీ పెద్దలు ఒప్పుకున్నారా?
శివబాలాజీ: మా ఇంట్లో ఒప్పుకున్నారు.
మధుమిత: మా ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈయనకు కోపం బాగా ఎక్కువని మా అమ్మ అభిప్రాయం. అమ్మ ఎప్పుడూ నాతో పాటే షూటింగ్‌లో ఉండేది. అలా ‘ఇంగ్లీష్ కారన్’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్‌ వాళ్లు ఏదో ఏర్పాటు చేయలేదని ఈయన పెద్దగొడవ చేశారు. ఈ ఘటనతో ఆయనపై అమ్మకు సరైన అభిప్రాయం కలగలేదు. అందులోనూ నేను సినిమా వాళ్లను పెళ్లి చేసుకోకూడదని అమ్మ భావించేది. ఎందుకంటే ఆదాయంలో స్థిరత్వం ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు పడతానేమోనని వద్దనుకున్నారు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఇండస్ట్రీలో ఉంటారు. కానీ, ఇండస్ట్రీ వాళ్లు వద్దా?) అయితే, నా అభిప్రాయం అలా ఉండేది కాదు. ఇప్పుడు నాకంటే మా వారే అమ్మకు చాలా ఇష్టం.
అత్తగారికి అంత ఇష్టం ఎలా అయ్యారు?
శివబాలాజీ: నన్ను వాళ్లు ఒకవైపు మాత్రమే చూశారు. నాలో మిగతా మంచి లక్షణాలు చూడలేదు. ఎప్పుడైతే నాతో వారి బంధుత్వం మొదలైందో అప్పటి నుంచి నేనంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు.
శివబాలాజీ చదువుకునే రోజుల్లో చాలా అవుట్‌ స్టాండింగ్‌ స్టూడెంట్ తెలుసా?
మధుమిత: తెలుసు! ఎప్పుడూ క్లాస్‌ బయటే ఉండే వాళ్లట.. (నవ్వులు)
బాలాజీ: నాకెప్పుడూ నాలుగు గోడల మధ్య చదవాలని ఉండేది కాదు. ప్రకృతితో పాటు మనం నేర్చుకోవాలనే తత్వం ఉండేది. అందుకే ఎప్పుడూ బయట ఉండేవాడిని.
స్కూల్లో నువ్వు పెద్ద రౌడీవంటగా?
శివబాలాజీ: అది రౌడీయిజం కాదు సార్‌. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ (నవ్వులు). స్కూలింగ్‌లో ఉన్నప్పుడు నేను ఆటల్లో బాగా చురుగ్గా ఉండేవాడిని. అపుడు నేను ఎల్లో టీమ్‌లో ఉండేవాడిని. దీంతో ఓ గ్యాంగ్‌ ఎప్పుడూ నాతో ఉండేది. పరుగుపందెంలో ఎప్పుడూ నేనే విన్నర్‌. అప్పట్లో నా ప్రత్యర్థిగా ఉండే స్టూడెంట్స్‌కు ఇప్పటికీ నేనంటే నచ్చదు. అతనిప్పుడు ఆర్మీ అధికారిగా కశ్మీర్లో ఉన్నాడు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఎప్పుడూ అక్కడకి వెళ్లకు)
కేబీఆర్‌ పార్కులో జాగింగ్‌ చేస్తుండగా సినిమా అవకాశం వచ్చిందటగా..ఎలా?
శివబాలాజీ: స్రవంతి రవికిషోర్‌ గారూ, రమణగారూ కేబీఆర్‌లో వాకింగ్‌కి వచ్చేవాళ్లు. అప్పుడే నేను జాగింగ్‌ చేస్తూ వాళ్లు కనిపించినప్పుడల్లా గుడ్‌మార్నింగ్‌, హలో చెబుతుండేవాడిని. వారి కంట్లో పడటానికే అలా నిత్యం కనిపిస్తుండేవాడిని. ఎట్టకేలకు వారు నాకు ‘ఎలా చెప్పను’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.


బాలాజీలో నీకు నచ్చిన, నచ్చని అంశాలేంటి?
మధుమిత: నచ్చేది, నచ్చనిది అంటూ ఏమీ లేవు సార్‌. అన్ని విషయాల్లోనూ కలిసే నిర్ణయాలు తీసుకుంటాం.
శివబాలాజీ: సార్‌ మా బంధం పాలు, నీళ్లు లాంటిది. ఒక్కసారి కలిశాక విడదీయటం కష్టం.
మీ కుటుంబంలో ఎవరైనా బాగా కోపంగా ఉండేవారా?
శివబాలాజీ: మా నాన్న గారు చాలా స్ట్రిక్ట్‌. కోపం ఎక్కువగా ఉండేది. అదే నాకూ కొంచెం వచ్చిందనుకుంటున్నా.
సినిమాలో తొలి అవకాశం వచ్చినపుడు నాన్న ఏమన్నారు?
శివబాలాజీ: మా నాన్న వార్తలు చూసేటపుడు ఇంట్లో ఎవరూ మాట్లాడరు. ఆ సమయంలోనే నాకొచ్చిన అవకాశం గురించి ఆయనకు చెప్పాను. ఒక్క సినిమా చేసి వచ్చేస్తానని వివరించాను. అందుకు ఆయన ‘మళ్లీ ఎందుకు వెనక్కి రావడం’ అని ‘ఆల్ ది బెస్ట్‌’ చెప్పి పంపించారు.
నటుడిగా మీ సక్సెస్‌ను నాన్న గారు చూశారా?
శివబాలాజీ: సక్సెస్‌ చూశాను అని ఇప్పటికీ నేను చెప్పను. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. అయితే, ‘ఆర్య’ చిత్రం బాగా హిట్టయ్యాక నేను ఆనందంలో ఉంటే నాన్న గారు బాధపడ్డారు. ఎందుకంటే ఆయనకు నన్ను నెగెటివ్ రోల్‌లో చూడటం ఇష్టం లేదు. ఆ తర్వాత నా సినిమాలు కొన్ని సీడీల్లో చూసి ఆనందించేవారు. ‘చందమామ’లో నేను వేసిన పాత్ర కూడా నాన్నగారికి నచ్చలేదు. కానీ ‘శంభో శివ శంభో’ సినిమా చూసి నన్ను మెచ్చుకున్నారు. అదే ఆయన చూసిన నా చివరి చిత్రం.
అమ్మ గురించి?
శివబాలాజీ: అమ్మ చెన్నైలో ఉంటారు. తమ్ముళ్లు కూడా అక్కడే ఉంటారు. అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది.
మధుమిత: అత్త గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె నాకు మరో అమ్మ. ఏ విషయాన్నైనా ఆమెతో పంచుకుంటా.
అన్నదమ్ముల గురించి?
శివబాలాజీ: నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి. ఒక తమ్ముడు ఐటీలో చేస్తున్నాడు. మరొక తమ్ముడిది గార్డెనరీ వ్యాపారం. చెల్లి అమెరికాలో సెటిల్‌ అయ్యింది.
మధుమిత చిన్నతనంలో ‘రౌడీ బేబీ’లా ఉండేవారట?
మధు: అంతేమీ ఉండేది కాదు సార్‌! నా స్నేహితులు బిందు, శ్రీలత బాగా కలిసి ఉండేవాళ్లం. బిందు తిరుపతిలో ఉంటుంది. శ్రీలత ప్రస్తుతం టచ్‌లో లేదు. అప్పట్లో వాళ్లు బెంగళూరు నుంచి వచ్చారు. (మధ్యలో ఆలీ అందుకుని.. శ్రీలతే చిన్నతనంలో మీ వేషాల గురించి చెప్పారు)


మధుమిత కళ్లల్లో కళ్లు పెట్టి ఊరమాస్‌ సాంగ్‌ పాడారట?
శివ బాలాజీ: నాకు రొమాంటిక్‌ సాంగ్‌లు పాడటం రాదు సార్‌. ‘క్యాండిల్‌ నైట్‌ డిన్నర్‌’కు తనతో కలిసి వెళ్లాను. పాట పాడమని అడిగింది. దీంతో అప్పట్లో బాగా ఫేమస్‌ అయిన హీరో కార్తీక్‌ సాంగ్‌ ఒకటి పాడాను. (పాట పాడారు)
ఆర్య సినిమా తర్వాత శివబాలాజీకి బ్రేక్‌ ఎందుకు రాలేదు?
శివ బాలాజీ: ఏమో సార్‌! ఆర్య హిట్‌ తర్వాత ఆరునెలల పాటు ఎదురుచూశాను. మంచి ప్రాజెక్టు చెయ్యాలని. ఆఫీసులకు వెళ్లి మాట్లాడమని మా వాళ్లు అంటుండేవారు. నాకేమో మొహమాటం. ఎవరినైనా అడిగితే ‘మీరు మాకు తెలుసు. మంచి నటులు. మీరిక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. మీకు సరిపోయే పాత్ర ఉంటే మేమే చెబుతాం అనేవాళ్లు’. అలా కాలం గడిచిపోతూ ఉండేది.
శివబాలాజీ నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?
శివ బాలాజీ: ‘స్నేహమేరా జీవితం’ అనే సినిమా చేశాం. మంచి కథ అది. వేరే వాళ్లు మనకు అవకాశాలు ఇచ్చేకంటే మనమే చేద్దాం అని, ఆ సినిమా నిర్మించాం. కానీ, మీకు తెలిసిందే కదా (ఆలీని ఉద్దేశిస్తూ) ఒక సినిమా రిలీజ్‌ అవ్వాలంటే ఎన్ని అవాంతరాలు ఉంటాయో.. అప్పటికీ కొందరిని రిక్వెస్ట్‌ చేశాను. కానీ, ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. తర్వాత ‘బిగ్‌బాస్‌’లో విన్నర్‌గా నిలిచాను. ఆ వచ్చిన డబ్బుతో ఎలాగోలా ఆ సినిమాను విడుదల చేయించాను. ఈ విషయంలో నటుడు రాజీవ్‌ కనకాల నాకు బాగా సాయం చేశారు. మేమిద్దరం ఆప్తమిత్రులం.


పెళ్లికి ముందు మీ ఇద్దరికీ బ్రేకప్ అయిందట కదా?
మధుమిత: అవును సార్‌. అది బ్రేకప్‌ అనలేం. ఎందుకంటే మా ఇద్దరి జాతకాలు కలవలేదని వాళ్లింట్లో చెప్పారు. ఇద్దరం పెళ్లి చేసుకుంటే అత్తమ్మకు ఆయుః క్షీణం అని జాతకాల్లో ఉందట. నేనైతే వాటిని నమ్మను. కానీ, ఆయన ఇంట్లో బాగా నమ్ముతారు. ఒకరోజంతా ఫోన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. అంతకుముందే మేమిద్దరం ఒకటనుకున్నాం. ఇరువురి ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని. అలా మా బ్రేకప్‌ జరిగింది.
శివబాలాజీ: నిజంగా అదొక దురదృష్టకర సంఘటన సార్‌. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాపై తనకు ఇష్టం కలిగేలా నేనే ప్రవర్తించి, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి, చివరకు జాతకాలు కలవట్లేదని చెప్పాను. కానీ, ఏం చెయ్యను? పరిస్థితుల ప్రభావం. అలా బ్రేకప్‌ అయ్యాక ఒక సంవత్సరం గడువు విధించుకున్నాను. ఒకవేళ ఈ లోపు తనకు గానీ, నాకు గానీ వేరే పెళ్లైతే వదిలేద్దాం. లేదంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంకల్ప బలం అంటారు కదా! అదే పని చేసిందేమో. సంవత్సరం తర్వాత జాతకాలు చూపిస్తే మళ్లీ కలిశాయి. వెంటనే తన మెడలో మూడు ముళ్లూ వేసేశా! (నవ్వులు)
మీ బర్త్‌డేకి పెళ్లైన కొత్తలో ఏదో షాకిచ్చారట?
మధుమిత: అవును సార్. ఎప్పుడూ ఆయన నా పుట్టినరోజు మర్చిపోతుంటారు.
బాలాజీ: పెళ్లైన కొత్తలో తన పుట్టినరోజుకు ఏమీ తెలియనట్టు ఒక గంట ముందు నుంచి పడుకున్నట్టు నటించాను సార్‌. ఇంతలో ఆమెకు ఫోన్‌కాల్స్‌ రావడం మొదలైంది. లేచాక ‘హా.. పుట్టినరోజైతే ఇప్పుడేంటి!’ అన్నాను. బాగా హర్ట్‌ అయ్యింది. బయటకు వెళ్దామంటే కూడా వద్దన్నాను. ఇక సాయంత్రం నేనే.. పద ఏదైనా హోటల్‌కు వెళ్దాం అంటూ బలవంతపెట్టి తీసుకెళ్లాను. ఒక పెద్ద టేబుల్‌ ముందు కూర్చున్నాం. ఇంతలో మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. దీంతో మధు ఒక్కసారిగా షాక్‌ అయ్యింది.


పిల్లలు ఎంతమంది?
బాలాజీ: ఇద్దరు అబ్బాయిలు సార్. ధన్విన్‌, గగన్‌ ఇద్దరి పేర్లు. ఒకరు 6వ తరగతి, ఒకరు 1వ తరగతి చదువుతున్నారు.
‘పుట్టింటికి రా.. చెల్లి’ చూసి ఒకరు నీ దగ్గర ఏడ్చారటగా?
మధుమిత: అవును సార్‌! ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా తర్వాత మరో షూటింగ్‌ నిమిత్తం రాజమండ్రి వెళ్లాం. అక్కడ ఒక ముసలావిడ వచ్చి ‘నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. నిన్ను నేను చూసుకుంటాను. మా ఇంటికొచ్చేయ్‌. మీ అత్తమ్మ అడ్రస్‌ చెప్పు.. మేం గట్టిగా మాట్లాడతాం’ అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది. నిజంగా అదో మధురానుభూతి. ఒక నటికి అదే కదా కావాల్సింది. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కోడిరామకృష్ణ గారికే దక్కుతుంది. ఆయన నటించి చూపించిన దానిలో 10 శాతం చేస్తేనే నన్ను ఆ సినిమాలో ప్రేక్షకులు అంతలా గుర్తించారు. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా అది.

women icon@teamvasundhara
meera-chopra-reveals-she-lost-two-of-her-family-members-to-covid-19-in-last-10-days

కరోనాతో పది రోజుల్లో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయాను!

లక్షలాది కేసులు.. వేలాది మరణాలు.. ఆస్పత్రుల్లో సరిపోని పడకలు, వెంటిలేటర్‌ బెడ్లు.. ఆక్సిజన్‌ కొరతతో విలవిల్లాడుతున్న ప్రాణాలు... అంతిమ సంస్కారాలకూ క్యూలో ఎదురు చూడాల్సిన దయనీయ స్థితి... దేశంలో కరోనా ప్రకోపానికి ప్రత్యక్ష సాక్ష్యాలివే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతోందీ మహమ్మారి. ఈ క్రమంలో కరోనాతో పది రోజుల వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయానంటోంది ప్రముఖ నటి మీరా చోప్రా. సకాలంలో సరైన వైద్యం అందక 40 ఏళ్ల లోపే వారు కన్ను మూశారంటూ తీవ్ర ఆవేదన చెందుతోంది. ఈ సందర్భంగా కొవిడ్‌ కారణంగా తనకెదురైన కొన్ని చేదు అనుభవాల గురించి అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
alitho-saradaga-special-chat-show-with-surekha-vani-and-rajitha

అందుకే పెళ్లి చేసుకోలేదు!

తల్లిగా.. చెల్లిగా.. అక్కగా.. వదినగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం... ప్రేక్షకులను అలరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆకట్టుకునే అందం, చక్కటి అభినయ ప్రతిభ వారిద్దరి సొంతం. కేవలం సినిమాలతోనే కాదు.. తమ స్వతంత్ర భావజాలంతోనూ అశేష అభిమానాన్ని సంపాదించుకున్న వారే సీనియర్‌ నటీమణులు సురేఖా వాణి, రజిత. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వారు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మరి ఆ సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-her-post-covid-recovery-tips-through-an-instagram-post

కరోనా నుంచి ఈ చిట్కాలతో అలా కోలుకున్నా!

ప్రస్తుతం మనందరికీ కొవిడ్‌ తప్ప వేరే ధ్యాసే లేకుండా పోయింది. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు, ఒకవేళ వైరస్‌ బారిన పడ్డా త్వరగా కోలుకునేందుకు పాటించే చిట్కాల గురించే ఇప్పుడందరూ దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న కొంతమంది వారి అనుభవాలను సైతం సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. వీరిలో పలువురు సెలబ్రిటీలూ ఉన్నారు. తాజాగా అందాల తార సమీరా రెడ్డి కూడా అదే చేసింది. ఇటీవలే తన కుటుంబం వైరస్‌ బారిన పడినట్లు వెల్లడించిన ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఇప్పుడు వైరస్‌ నుంచి కోలుకునే క్రమంలో తాను పాటించిన చిట్కాల గురించి సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. కరోనా బారిన పడిన క్రమంలో- అలసట/నీరసాన్ని పూర్తిగా దూరం చేసి తిరిగి ఎప్పటిలాగే తనను యాక్టివ్‌గా మార్చేందుకు ఈ చిట్కాలు దోహదం చేశాయంటూ అందరిలో నెలకొన్న కొవిడ్‌ భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోందీ క్యూట్‌ మామ్‌. మరి, ఇంతకీ ఏంటా టిప్స్‌? మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sania-mirza-opens-up-on-her-battle-with-depression-in-telugu

అప్పుడు నెల రోజులు గదిలో నుంచి బయటికి రాలేదు!

మన కెరీర్‌పై మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం.. ఎన్నెన్నో సాధించాలనుకుంటాం.. కానీ అవి నెరవేరకపోతే నిరాశ చెందుతాం.. కొంతమందైతే వాటినే తలచుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు కూడా! అలా తాను కూడా సుమారు మూణ్నాలుగు నెలల పాటు కుంగుబాటులోనే గడిపానంటోంది టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. మణికట్టు గాయంతో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొని మధ్యలోనే వెనుతిరిగిన ఆమె.. అర్ధాంతరంగా ఆటకు దూరమైనందుకు ఎంతగానో బాధపడ్డానంటోంది. ఆ సమయంలో ఒక్కసారిగా భవిష్యత్తంతా శూన్యంగా అనిపించిందని, తానెంతో ప్రేమించే టెన్నిస్‌ను ఇకపై ఆడతానో, లేదోనన్న బాధ తన మనసుని ఉక్కిరిబిక్కిరి చేసిందంటోంది. ఈ డిప్రెషన్‌తో తాను అనుభవించిన వేదనను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ టెన్నిస్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
sameera-reddy-shares-her-post-pregnancy-struggles-in-telugu

ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి నాకు రెండేళ్లు పట్టింది!

అమ్మతనం మన శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.. ఈ క్రమంలో అందం తగ్గిపోవడం, స్ట్రెచ్‌ మార్క్స్‌, పొట్ట ఎత్తుగా కనిపించడం.. ఇలా మనలో వచ్చే మార్పుల్ని అంగీకరించాలంటే అందుకు ముందు నుంచే మానసికంగా సిద్ధపడాలి. లేదంటే తనలా ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందంటోంది అందాల తార సమీరా రెడ్డి. తల్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమై.. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో తనకెదురయ్యే ప్రతి అనుభవాన్నీ సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోతుంటుంది. అంతేకాదు.. ప్రసవానంతర ఒత్తిడి, బాడీ షేమింగ్‌, ఫ్యాట్‌ షేమింగ్‌.. వంటి విషయాలపై కుండ బద్దలుకొట్టినట్లుగా మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్టులు పెట్టే ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. ఒకప్పుడు తాను తల్లయ్యే క్రమంలో అందం విషయంలో తెగ మథనపడ్డానని చెబుతోంది. ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని’ పురస్కరించుకొని ఆ అనుభవాలను, ప్రసవానంతరం తాను ఎదుర్కొన్న ఒత్తిడి, దాన్నుంచి బయటపడిన తీరు గురించి సోషల్‌ మీడియా బ్లాగ్‌ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’తో పలు ఆసక్తికర విశేషాలు పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
hariteja-shares-emotional-video-about-her-covid-experience
women icon@teamvasundhara
neha-dhupia-shares-empowering-message-on-breastfeeding-in-telugu

పాలిచ్చే తల్లుల్ని ఆ దృష్టితో చూడడమెందుకు?!

అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చుతుంది.. ఇలా తన చిన్నారికి పాలిచ్చే క్రమంలో ఎంతో భావోద్వేగానికి, ఎనలేని ఆనందానికి లోనవుతుంటుంది. అయితే అమ్మతనానికి అద్దం పట్టే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్‌ ప్రక్రియ గురించి మహిళల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ అది నాలుగ్గోడలకే పరిమితమవుతుంది తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి నేటికీ చాలామంది తల్లులు ముందుకు రావట్లేదు. ఇందుకు కారణాలు అనేకం! ముఖ్యంగా తల్లి ఎంతో ప్రేమగా బిడ్డకు పాలిచ్చే ఈ ప్రక్రియను కొంతమంది చెడు దృష్టితో, లైంగిక విషయంగా పరిగణిస్తుంటారు. తల్లి పాలు తాగి పెరిగి.. తల్లితో సమానమైన అలాంటి మహిళలు వారి పిల్లలకు పాలిచ్చే క్రమంలో వారిని తప్పుడు దృష్టితో చూడడం, విమర్శించడం చేసే కొందరు మూర్ఖులు మన సమాజంలో కొందరున్నారు. అలాంటి వారికి తనదైన రీతిలో సమాధానమిచ్చింది బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ నేహా ధూపియా. ఈ క్రమంలో బ్రెస్ట్‌ఫీడింగ్‌ విషయంలో ఇటీవలే ఓ తల్లి ఎదుర్కొన్న చేదు అనుభవానికి మద్దతుగా నిలుస్తూ.. ఈ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Know More

women icon@teamvasundhara
urvashi-dholakia-says-her-twin-sons-want-her-to-get-married-again-in-telugu

నా పిల్లలు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు!

విడాకులకు సంబంధించి మన సమాజంలో పాటిస్తోన్న కొన్ని కట్టుబాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే మహిళలు, పురుషుల మధ్య ఉన్న అసమానతలేంటో స్పష్టంగా కనిపిస్తాయి. విడాకులు పొందిన మగవారు స్వేచ్ఛగా మరో వివాహం చేసుకోవచ్చు. పైగా ఈ విషయంలో అతనికి కుటుంబ సభ్యుల సానుభూతి, సహకారం రెండూ తోడవుతాయి. ఇదే ఆడవారి విషయానికొస్తే మాత్రం కుటుంబంలోనే కాదు సమాజంలోనూ భిన్న స్వరాలు వినిపిస్తుంటాయి. భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకుంటే అదొక పెద్ద నేరంగా భావిస్తారు. ఇక పిల్లలుండి రెండోసారి పెళ్లిపీటలెక్కిన వారైతే సూటి పోటి మాటలు, అవమానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

Know More

women icon@teamvasundhara
naagin-5-actress-kajal-pisal-tests-negative-for-covid-19-and-shares-her-scary-experiences

కరోనాతో చావు అంచుల దాకా వెళ్లొచ్చాను!

రోగులతో కిటకిటలాడుతోన్న ఆస్పత్రులు... చాలాచోట్ల పడకలు లేక బయటే బాధితుల పడిగాపులు... ఆక్సిజన్‌ కొరతతో గాల్లో కలిసిపోతోన్న నిండు ప్రాణాలు...ఇలా కరోనా వైరస్ రెండో దశ యావత్‌ దేశాన్ని కలవరపెడుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే... సామాన్యులే కాదు... పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బుల్లితెర నటీమణి కాజల్ పిసల్ ఒకరు. ‘నాగిన్ 5’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె... కొద్దిరోజుల క్రితం కరోనాకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోనప్పటికీ... ఇటీవల జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో తనకు నెగెటివ్‌ అని తేలింది.

Know More

women icon@teamvasundhara
women-should-not-give-up-on-any-of-their-passions-says-geeta-basra

ఆ పవర్ మనకు పుట్టుకతోనే వచ్చింది!

అప్పటిదాకా జీవితంలో ఏదో సాధించాలని ఆరాట పడే మహిళల్లో చాలామంది పెళ్లి తర్వాత తమ కలలను పక్కన పెట్టేస్తుంటారు. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు... తదితర బాధ్యతలలో పడి తమ ఆకాంక్షలు, ఆశయాలను త్యాగం చేసేస్తుంటారు. అయితే మల్టీ టాస్కింగ్‌ పవర్‌ అనేది మహిళల్లో సహజంగా ఉంటుందని... ఎవరూ పెళ్లి, పిల్లల కోసం తమ కలలను త్యాగం చేయాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్‌ బ్యూటీ గీతా బస్రా. మాతృత్వం అనేది కేవలం వ్యక్తిగత విషయమని, ఓ మహిళ జీవితాన్ని అది పూర్తిగా నిర్వచించలేదని ఆమె చెబుతోంది. ఆరేళ్ల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌తో పెళ్లిపీటలెక్కిన గీతకు హినయా హీర్‌ అనే నాలుగేళ్ల కూతురుంది. ఈ క్రమంలో మరోసారి తల్లి కాబోతున్న ఆమె తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
pregnant-shreya-ghoshal-shares-pics-from-surprise-baby-shower

శ్రేయా ఘోషల్ సీమంతం వేడుకలు చూశారా?

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన స్వరంతో సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది శ్రేయా ఘోషల్‌. ‘జల జల జలపాతం’ అంటూ ప్రస్తుతం మనందరి మదిని మీటుతోన్న ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ త్వరలోనే తల్లిగా తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోయిందీ అందాల గాయని. పుట్టబోయే బిడ్డ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోన్న ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. శ్రేయ సన్నిహితులు, స్నేహితుల ఆధ్వర్యంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
kanika-kapoor-recalls-the-hate-she-received-after-covid-diagnosis

అప్పుడు కరోనా కంటే వాళ్ల కామెంట్లే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి!

సాఫీగా సాగిపోతున్న మన జీవితాల్లోకి కోరుకోని అతిథిలా వచ్చింది కరోనా. కనికరం లేకుండా కొన్ని లక్షల మందిని బలి తీసుకుంది. అదే సమయంలో భయం పేరుతో మనుషుల్లోని మానవత్వాన్ని కూడా మంటగలిపిందీ మహమ్మారి. ఇప్పుడు కరోనాకు భయపడడం కాస్త తగ్గింది కానీ సరిగ్గా ఏడాది క్రితం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్న సమయాన అక్కడక్కడా జరిగిన కొన్ని సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. చాలా ప్రాంతాల్లో కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపడం, వారి కుటుంబ సభ్యులను అవమానాలకు గురిచేయడం లాంటి సంఘటనల గురించి మనకు తెలిసిందే.

Know More

women icon@teamvasundhara
mira-rajput-interacting-with-instagram-fans-and-held-thisorthat-session

అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!

మీరా రాజ్‌పుత్‌.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్లను మించిన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్‌ ఆర్‌ దట్‌’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
dia-mirza-clarification-over-her-pregnancy-getting-married

అందుకే అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేకపోయాను!

‘బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌’ అన్న మాటలకు సరిగ్గా సరిపోతుంది బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా. సామాజిక అంశాలు, మహిళల సమస్యలపై తనదైన శైలిలో స్పందించే తెగువే ఆమెకు ఆ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిందీ అందాల తార. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో వివాహం చేసుకున్న దియా తన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందా? అన్న సందేహాలు చాలామందిలో తలెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్‌, విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, నెటిజన్లు లేవనెత్తిన పలు సందేహాలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
actress-and-tv-host-hariteja-blessed-with-a-baby-girl-in-telugu

women icon@teamvasundhara
from-yoga-to-ghar-ka-khaana-shilpa-shetty-reveals-20-things-she-loves

ఈ 20 నాకెంతో ఇష్టం!

శిల్పా శెట్టి...ఈ పేరు తలచుకోగానే సన్నజాజి తీగ లాంటి నాజూకైన శరీరాకృతి, అందమైన రూపం మన కళ్ల ముందు కదలాడుతుంది. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని ఈ అందాల రాణి పూర్తి స్థాయి సినిమాలో నటించి సుమారు పద్నాలుగేళ్లు గడిచాయి. అయినా తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదంటే అందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియానే అని చెప్పుకోవచ్చు. తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలతో పాటు.. తాను పాటించే ఆహార, ఫిట్‌నెస్‌ నియమాల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం ఈ సొగసరికి అలవాటు. అందుకు తగ్గట్టే సామాజిక మాధ్యమాల్లో శిల్పను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
miss-india-finalist-diksha-singh-to-contest-up-panchayat-poll

ఈ అందాల రాణి అందుకే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని మున్సిపాలిటీ, పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ తారలు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేస్తూ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మోడల్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ పంచాయతీ ఎన్నికల బరిలో దిగింది. 2015మిస్ ఇండియా ఫైనలిస్ట్‌ అయిన ఆమె.. పలు వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది. మరి అలాంటి అందాల రాణి పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
these-star-kids-are-making-a-splash-on-social-media-in-telugu
women icon@teamvasundhara
meet-geeta-a-52-years-teacher-turned-lingerie-model-who-is-redefining-beauty-standards

ఈ వయసులో లో దుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే!

చూడగానే ఆకట్టుకునే అందం... సొగసైన శరీరాకృతి... పొడవాటి కేశ సౌందర్యం... ఇలా నవ యవ్వనంతో మెరిసిపోయే యువ అందాలనే తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా, అంబాసిడర్లుగా నియమించుకుంటాయి దుస్తుల తయారీ సంస్థలు. యువతులు, మధ్య వయసు మహిళలు, వృద్ధులు... ఏ వయసు వారి దుస్తులకైనా యువతులనే ప్రచారకర్తలుగా తీసుకుంటాయి. వయసు ప్రతిపాదికన మోడల్స్‌ను తీసుకునే సంస్థలు ఎక్కడా కనిపించవు. ఈ క్రమంలో ‘నా వయసు వారి లో దుస్తులకు నా వయసు వారినే మోడల్స్‌గా ఎందుకు నియమించకూడదు’ అనే ఓ సరికొత్త ఆలోచనను రేకెత్తించింది ముంబయికి చెందిన 52 ఏళ్ల గీత. లో దుస్తుల మోడలింగ్‌లో దూసుకెళుతోన్న ఆమె లింగరీ మోడలింగ్‌పై ఆన్‌లైన్‌ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఎవరామె ఎందుకీ ఉద్యమం చేస్తున్నారో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
shweta-tiwari-on-how-failed-marriages-impacted-her-children

నేను చేసిన తప్పులు నా కూతురు అస్సలు చేయదు!

స్వశక్తితో సొంత కాళ్లపై నిలబడినా... వ్యక్తిగతంగా ఎంత ఎత్తుకు ఎదిగినా విడాకులు తీసుకున్న స్త్రీలంటే ఈ సమాజంలో కాస్త చిన్నచూపు ఉంటుంది. వాళ్లేదో తప్పు చేశారన్నట్లుగా చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాన్ని వారి పిల్లలకు ముడిపెడుతూ సూటిపోటి మాటలతో అవమానాలకు గురిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా నేటికీ తాను, తన పిల్లలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామంటోంది ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీ. తన అందం, అభినయంతో బాలీవుడ్‌ బుల్లితెరను ఏలుతోన్న ఈ ముద్దుగుమ్మ రెండుసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే కొనసాగుతోన్న ఆమె.. ఓవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈక్రమంలో తన విడాకుల వ్యవహారం, పిల్లలపై దాని ప్రభావం గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More