scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

నా కాలు తొలగించే సన్నివేశం చూసి ఒకావిడ కళ్లు తిరిగి పడిపోయింది!

Actress Mayuri Sudha Chandran In Alitho Saradaga Chat Show

మనోధైర్యం మెండుగా ఉన్న నాట్య ‘మయూరి’ ఆమె. అందుకే 13 ఏళ్లకే ఒంటికాలితో తన జీవితాన్ని అంధకారం చేయాలనుకున్న విధిని సైతం ఎదిరించింది. కష్టాలు, కన్నీళ్లకు కుంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. నటిగా, నృత్య కళాకారిణిగా కళలకే తలమానికంలా నిలిచి అశేష అభిమానాన్ని సాధించింది. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆ అందాల తార మరెవరో కాదు ‘మయూరి’ సుధా చంద్రన్‌. సుమారు మూడున్నర దశాబ్దాలుగా నటన, నాట్య రంగంలో తనదైన ప్రతిభ చూపుతోన్న ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఆలీ: రమోలా సికంద్‌‌... అలియాస్‌ సుధాచంద్రన్‌... ఏం చదువుకున్నారు?
సుధాచంద్రన్‌: ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాను. తర్వాత.. మా అమ్మ నన్ను ఐఏఎస్‌.. ఐఎఫ్‌ఎస్‌ చేయించాలనుకున్నారు. కానీ.. మన రాత ముందే రాసి ఉంటుంది. అది మారదు కదా..! 1985లో ప్రమాదం తర్వాత నృత్యం చేయడం మొదలు పెట్టాను. రామోజీరావు గారు గమనించి.. సుధాచంద్రన్‌ జీవిత చరిత్రతో ఒక బయోపిక్‌ తీయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం చాలా బయోపిక్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మొదటి బయోపిక్‌ చేసిన ఒకే ఒక్క నిర్మాత రామోజీ రావు గారు. అదే ‘మయూరి’. ఈ విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నాను. సాధారణంగా బయోపిక్‌లో సెలబ్రిటీలు నటిస్తారు. కానీ.. ‘మయూరి’లో నేనే నా పాత్ర పోషించాను. అది రామోజీరావు గారి గొప్పతనం. మరే ఇతర నిర్మాత కూడా ఇలా చేయలేదు.

mayurisudhachandran650-1.jpg
ఆలీ: ఒక్క సినిమాతోనే ‘మయూరి’ ఎందుకు ఆగిపోయింది?
సుధాచంద్రన్‌: ఆ సినిమాలో ఒక్కో పాట చాలా ముఖ్యం. తెలుగు భాషే నాకు పెద్ద సవాల్‌. ఆ సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్‌లు నాకు ఇంకా గుర్తున్నాయి. రాత్రి వరకూ షూటింగ్‌లో పాల్గొని రూమ్‌లోకి వచ్చిన తర్వాత మొత్తం బట్టీ పట్టి తర్వాత రోజు తెల్లవారుజాము 4 గంటలకే సెట్‌కు వెళ్లేదాన్ని. 15 రోజుల పాటు అలా హైదరాబాద్‌లో షూటింగ్‌ చేశాం. ఆ తర్వాత జయపుర వెళ్లాం. ‘మయూరి’ సినిమా మంచి విజయం సాధించినా తెలుగులో ఆ తర్వాత నాకెందుకో అవకాశాలు రాలేదు. తెలుగులో ఇప్పుడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ‘బాహుబాలి’లో రమ్యకృష్ణను చూసి అసూయ పడ్డాను. అప్పట్లో సినిమా పరిశ్రమ అంటే చాలామందికి ఎన్నో అపోహలు ఉండేవి. అందుకే మా అమ్మ వద్దని చెప్పేది. మా నాన్న మాత్రం.. ఈ ఒక్క సినిమా చేసి వీడ్కోలు తీసుకోమని చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది.. ‘మయూరి’కి ఒప్పుకొన్న తర్వాత హైదరాబాద్‌ బయలుదేరాను. విమానంలో ఉండగానే.. ఇవన్నీ మనకెందుకు? తిరిగి ఇంటికి వెళ్లిపోదామన్న ఆలోచనలు మొదలయ్యాయి. అయోమయంలో పడిపోయాను.

మొదటి రోజు షూటింగ్‌.. కాలేజ్‌ డ్రెస్‌లో ఉన్న నేను ఏడ్చే సన్నివేశం అది‌. ఆ సీన్‌ తర్వాత ఇంటికి వెళ్లిపోతానని నిజంగానే ఏడ్చాను. నేను నటించలేనని సింగీతం (డైరెక్టర్‌) గారితో చెప్పాను. ‘నువ్వు రెండు రోజులు ప్రయత్నించు.. నీ వల్ల కాకపోతే వెళ్లిపో’ అని ఆయన అన్నారు. రెండో రోజు నా నటన చూసి.. ‘చాలా బాగా చేశారు సుధా.. ఈ పాత్ర మీరే చేయాలి. ఇంకెవరూ చేయలేరు’ అని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ అంటే పద్మవ్యూహం. మనం రావడమే తప్పితే వెళ్లడం మన చేతిలో ఉండదు.. ఇదే నా విషయంలో జరిగింది. 15 రోజుల తర్వాత షూటింగ్‌ పూర్తవడంతోనే మళ్లీ ఏడుపు మొదలుపెట్టాను. ‘నేను ముంబయి వెళ్లను. మీకు అసిస్టెంట్‌గా ఉంటా’నని అనడంతో.. సింగీతం గారు నవ్వుతూ.. ‘నేను చెప్పాను కదా.. ఇండస్ట్రీకి వస్తే మళ్లీ బయటికి వెళ్లాలనిపించదు’ అని అన్నారు. ‘మయూరి’ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. వెండితెర, బుల్లితెరపై నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం లభించింది.

ఆలీ: మీ సొంతూరు..?
సుధాచంద్రన్‌: మాది కేరళ. నేను మాత్రం ముంబయిలో పుట్టి పెరిగాను.
ఆలీ: సుధాచంద్రన్‌ బయోపిక్‌ ప్రత్యేకత ఏమిటి?
సుధాచంద్రన్‌: నిజానికి ఈ బయోపిక్‌లో ఒక పెద్ద హీరోయిన్‌ను తీసుకోవాలనేది చిత్రబృందం ఆలోచన. ద్వితీయార్థంలో రోడ్డు ప్రమాదం తర్వాత నా కాళ్లను చూపిద్దామనుకున్నారు. కానీ.. సింగీతం శ్రీనివాసరావు గారితో మీటింగ్‌ తర్వాత.. ‘మీరైతే ముంబయి రండి.. దాని గురించి తర్వాత నిర్ణయం తీసుకుందాం’ అని నాతో చెప్పారు. అదలా ఉండగానే.. నేను హైదరాబాద్‌కు వచ్చిన రెండో రోజు.. నాకు ఫోన్‌ చేసి.. ‘మీరే మీ పాత్ర పోషిస్తే బాగుంటుంది’ అని చెప్పారు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాను. ‘నేనా.. హీరోయిన్‌గానా.. చేయలేను సర్‌..’ అని అన్నాను. ‘చేయలేకపోవడం ఏంటి.. మీరు ప్రయత్నించి చూడండి’ అని చెప్పారు. మా కుటుంబ నేపథ్యం వల్ల సభ్యులందరితో సమావేశమై వాళ్లందరి అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చింది. సినిమా చేయమని మా నాన్న.. వద్దని మా అమ్మ. చివరికి చేయాలని నిర్ణయం తీసుకున్నాను.
ఆలీ: సినిమా పూర్తయ్యేవరకూ రామోజీ గారిని చూడలేదట?
సుధాచంద్రన్‌: అవును. సినిమా పూర్తయిన తర్వాత అట్లూరి రామారావు గారు వచ్చి ‘రామోజీరావు గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు’ అని చెప్పారు. నేను మా అమ్మ, నాన్నతో కలిసి వెళ్లాను. తెలుగు నిర్మాత అనగానే ఆయనను నేను వేరేలా ఊహించుకున్నాను. కానీ.. నా ఊహకు పూర్తి భిన్నంగా ఉన్నారాయన. తెలుగు నిర్మాతకు చిహ్నంలా కనిపించారు. ఆయన్ను చూడగానే మొదట భయపడ్డాను. మ్యాన్ ఇన్‌ వైట్‌. మ్యాన్‌ ఇన్‌ ప్రిన్సిపల్స్‌. నన్ను చూడగానే.. ‘నమస్కారం మయూరి గారు’ అన్నారు. మీ గురించి నేను చాలా విన్నానని చెబుతూనే.. ఇంకేదో చెప్పబోయాను.. ‘మీరు కూర్చోండి.. మీరు మా హీరోయిన్‌.. మీరు కూర్చోవాలి..’ అని రామోజీరావు గారు అన్నారు. అక్కడ ఉన్న టేబుల్‌ మీద పూలు, పండ్లు, స్వీట్లు డెకరేట్ చేసి ఉన్నాయి.

mayurisudhachandran650-2.jpg

అవన్నీ చూసిన తర్వాత మా నాన్నను చూస్తూ.. ‘అప్పా.. యే క్యా హై’ అని అన్నాను. అయితే.. అప్పటివరకూ రెమ్యునరేషన్‌ గురించి ఏం మాట్లాడలేదు. రామోజీ గారు ఒక బ్లాంక్‌ చెక్‌ టేబుల్‌ మీద పెట్టారు. ‘ఇది మీదే.. మీరు సంతకం చేయండి. ఎంత రెమ్యునరేషన్‌ కావాలో మీరే చెప్పండి’ అని అన్నారు. వెంటనే మా నాన్న... ‘నా కూతురి మీద సినిమా తీయాలనే ఆలోచన నాకు ఉండేది. కానీ.. నా దగ్గర డబ్బు లేదు. మీరు ఫైనాన్షియర్‌గా ఉండి నన్ను నిర్మాతను చేయండి’ అని.. చెక్‌ను రామోజీ గారికి ఇచ్చేసి.. మీకేం ఇవ్వాలనిపిస్తే.. అదే ఇవ్వండని చెప్పారు.

అప్పటినుంచి నా బ్యాంక్‌ బ్యాలన్స్‌.. పెరగడమే తప్ప ఒక్కసారి కూడా తగ్గింది లేదు. అప్పట్లో రూ.1.2 లక్షలు ఒక కొత్త నటికి ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ సినిమా విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు వచ్చాను. పెద్ద కటౌట్‌ పెట్టారు. కొంతమంది హారతివ్వడం.. పూజలు చేయడం చూశాను. అదే నా జీవితంలో పెద్ద పురస్కారం.
ఆలీ: మయూరి సినిమా తర్వాత ‘మయూరి’ డిస్ట్రిబ్యూషన్స్‌ అని పెట్టారు తెలుసా..?
సుధాచంద్రన్‌: అవును.. దాని వెనకాల పెద్ద కథ ఉంది. ‘మయూరి’ సినిమా పూర్తయిన తర్వాత రామోజీరావు గారే స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. సినిమా విడుదలైన మొదట్లో వారం రోజులు థియేటర్‌కు ఒక్కరిద్దరూ మాత్రమే వచ్చేవారు. కానీ.. ఒక వారం రోజుల తర్వాత థియేటర్లన్నీ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. టికెట్లు కూడా దొరకలేదు.
ఆలీ: సంగీత దర్శకులు ఎవరో గుర్తున్నారా..?
సుధాచంద్రన్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్‌కు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు.

mayurisudhachandran650-3.jpg
ఆలీ: 35 ఏళ్లు గడిచినా.. జనాలు మిమ్మల్ని ‘సుధాచంద్రన్‌ మయూరి’గానే గుర్తు పెట్టుకున్నారు.
సుధాచంద్రన్‌: సుధాచంద్రన్‌ కూడా లేదు. మయూరిగానే గుర్తు పెట్టుకున్నారు. నేను హిందీ సినిమాలు చేస్తాను. తమిళంలో చేస్తాను. ఇంకా చాలా భాషల్లో నటించాను. కానీ 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నేను దిగగానే ‘మయూరి గారు’ కదా..? అన్నారు.
ఆలీ: ఈటీవీ వాళ్లు మిమ్మల్ని ఎలా కలిశారు..?
సుధాచంద్రన్‌: ఒక పేపర్‌లో నా గురించి చదివిన తర్వాత రామోజీరావు గారు అందరికీ స్ఫూర్తిదాయకమైన సినిమా చేయాలనుకున్నారు. ఆ సమయంలో మా నాన్న ముంబయిలోని అమెరికన్ లైబ్రరీలో ఉద్యోగం చేస్తున్నారు. దాంతో చెన్నైలోని అమెరికన్‌ లైబ్రరీకి ఫోన్‌ చేసి.. వారి వద్ద నుంచి ముంబయి అమెరికన్‌ లైబ్రరీ ఫోన్‌ నంబర్‌ తీసుకుని మా నాన్నతో మాట్లాడారు. అలా ఈటీవీతో బంధం ఏర్పడింది. అదో పెద్ద ప్రక్రియ. సినిమా రంగంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. సినీ పరిశ్రమ మంచిది కాదనే భావన నాలోనూ ఉండేది. కానీ.. అది నిజం కాదు. ‘మయూరి’ తర్వాత నా అభిప్రాయం మారింది. సినిమా ఇండస్ట్రీ చాలా అందమైన ప్రాంతం అని అందరికీ చెప్పాలని అనుకునేదాన్ని.
ఆలీ: మీ కుటుంబం గురించి చెప్పండి..?
సుధాచంద్రన్‌: అమ్మ, నాన్న, ఓ కూతురు, నా భర్త. మాది చిన్న కుటుంబం. 2004లో క్యాన్సర్‌తో అమ్మ చనిపోయారు. మా ఆయన పంజాబీ. హిందీ టెలివిజన్‌ డైరెక్టర్‌, నిర్మాత. ఓ హిందీ సినిమా చేసినప్పుడు ఆయన పరిచయమయ్యారు. సినిమా అయితే విడుదల కాలేదు కానీ.. మా ప్రేమ కథ మాత్రం రిలీజ్‌ అయింది. ఆ సినిమాకు ఆయన అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. మొదట మేమిద్దరం మంచి స్నేహితులం. నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అభిప్రాయం తీసుకుంటాను. నేనేమో వాగుడుకాయ.. మా ఆయన మాత్రం చాలా సైలెంట్.

mayurisudhachandran650-4.jpg
ఆలీ: ఒక వ్యక్తి మయూరి బొట్టుబిళ్లలు ఇక్కడ కొని లండన్‌లో ఒక్కోదాన్ని 3 పౌండ్లకు అమ్మాడు. ఆ విషయం మీకు తెలుసా..?
సుధాచంద్రన్‌: పాములు, బొద్దింకలు.. ఇలా అన్ని రకాల బొట్టుబిళ్లలు నేను ప్రయత్నించాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా నుదుటిని ఓ డ్రాయింగ్ ‌బోర్డులా వాడుకునేదాన్ని. ఆ ఆలోచన కూడా నాదే. నేను ఒకసారి నాగ్‌పూర్‌ వెళ్లినప్పుడు.. ఒక చిన్నపాప వచ్చి ‘మేడం.. ఆ బొద్దింక చాలా సెక్సీగా ఉంది’ అని చెప్పింది. బొద్దింక సెక్సీగా ఉండటమేంటని నాలో నేను నవ్వుకున్నాను. బొట్టుబిళ్లతో ఒక ఛానల్‌ లోగో కూడా డిజైన్‌ చేశాను. లండన్‌ నుంచి మా స్నేహితులు ఫోన్‌ చేసి.. మీ బొట్టుబిళ్లలు ఒక్కోటి 120 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది చాలా ఖరీదు తెలుసా అన్నారు. ఒకసారి ముంబయిలో బొట్టుబిళ్లల దుకాణానికి వెళ్లాను (మేకప్‌ లేకుండా). ఒక ప్యాకెట్‌ చూపించాడు. ధరెంత అని అడిగితే.. రూ.650 మేడం అని చెప్పాడు. అంత ఖరీదా? అని అడగ్గా.. అవును మేడం.. ఇది రమోలా సికంద్‌ బొట్టుబిళ్లలు అన్నాడు. ‘హలో.. నేనే రమోలా సికంద్’ అన్నాను. అప్పుడు మేకప్‌ లేకపోవడం వల్ల నన్ను ఆ వ్యక్తి గుర్తు పట్టలేదు. రూ.25కు ఎక్కువ ఇచ్చేది లేదనగానే.. మేడం మా గిరాకీ చెడగొట్టకండి.. వెళ్లండి అన్నాడు.
ఆ సమయంలో.. రమోలా సికంద్‌ బొట్టుబిళ్లలు.. రమోలా సికంద్‌ రింగ్‌లు వాడేదాన్ని. అవి వేసుకొని చేసినప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌ విపరీతంగా పెరిగింది. అందుకే వాటిని వాడటం మొదలుపెట్టాను. ఆ రింగ్‌ ధర కేవలం రూ.45 మాత్రమే ఉండేది. ఒకసారి జయపురలో బంగారం వర్తకుల సమావేశం జరుగుతోంది. నా రింగ్‌ను చూసి.. మేడం మీ రింగ్‌ చాలా బాగుందని అన్నారు. ఇంకో వ్యక్తి వచ్చి.. మేడం 500 రింగులు అమ్మాను. చాలా లాభం వచ్చింది మేడం అన్నారు. నేను వాడే రింగులను బంగారంతో తయారు చేసి ఒక్కో రింగ్‌కు రూ.10 వేలకు అమ్మారట. అప్పుడైనా.. ఇప్పుడైనా.. నా మెడలో నుంచి ఆభరణాలు మాత్రం తీయను. అలా అని ఎక్కువ ధర అసలే పెట్టను. రూ.100 నుంచి 150 అంతకు మించను. అది కూడా రోడ్డు మీదే కొంటాను.

ఆలీ: ఇప్పుడేం చేస్తున్నారు?
సుధాచంద్రన్‌: ఒక సీరియల్‌ చేస్తున్నాను. అది మంచి పాత్ర. చదువు ప్రాముఖ్యాన్ని తెలిపే పాత్ర అది. నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినదాన్నే. చదువు.. మధ్య తరగతి కుటుంబాలకు బ్లాంక్‌ చెక్‌ లాంటిదని మా అమ్మ చెబుతుండేది. అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమని మంచి సందేశమిచ్చే సీరియల్‌ అది.
ఆలీ: ప్రతిరోజూ మీ నాన్నతో గొడవ పడతారట?
సుధాచంద్రన్‌: అవును.. బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకూ మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మళ్లీ ఇద్దరం కలిసిపోతాం. ‘ఐ లవ్యూ డాడీ’ అని నేను.. ‘ఐ టూ లవ్యూ’ అంటూ మా నాన్న చెప్పుకొంటూ ఉంటాం. ఆ తర్వాత రోజు ఉదయం ఇంకో విషయంపై మళ్లీ గొడవ మొదలవుతుంది.
ఆలీ: అసలు ప్రమాదం ఎలా జరిగింది..?
సుధాచంద్రన్‌: నాకు 13 ఏళ్ల వయసులోనే రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచిరాపల్లి నుంచి చెన్నై రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో అందరికంటే తక్కువ గాయపడ్డది నేనే. కానీ మా నాన్న ముక్కుకు పెద్ద గాయమైంది. అమ్మ చనిపోయిందని పోలీసులు చెప్పారు. అయితే.. ఆమె శ్వాస తీసుకోవడం గమనించాను. దీంతో వెంటనే అంబులెన్సులో అమ్మను ఆస్పత్రికి పంపించారు. నాలుగు రోజుల పాటు నేను చిన్న పిల్లల వార్డు.. అమ్మ మహిళల వార్డు.. నాన్న పురుషుల వార్డులో ఉన్నాం. ‘అమర్‌ అక్బర్ ఆంథోనీ’ సినిమాలోని సీన్‌ నా జీవితంలో నిజంగానే జరిగింది. నాలుగు రోజుల తర్వాత మేం ఒకర్ని ఒకరం కలుసుకున్నాం. అందరం బతికే ఉన్నామని అప్పుడే తెలిసింది. నాకు అయింది చిన్న గాయమే కానీ.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల అది పెద్దదైంది. మోకాలి కంటే మూడు ఇంచులు కింద నుంచి కాలు కోల్పోవాల్సి వచ్చింది. విధిని మనం మార్చలేం కదా. ఒక్కగానొక్క కూతురినైన నా భవిష్యత్‌ గురించి మా అమ్మానాన్న బాధపడుతుండటం చూసి.. నేను ఎలాగైనా డ్యాన్స్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.
జయపురలో ఉండే రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్‌ పీకే శెట్టి గారికి ఒక ఉత్తరం రాశాను. మీ అపాయింట్‌మెంట్‌ కావాలని అడిగాను. వెంటనే జయపురకు రమ్మని అక్కడి నుంచి నాకో లెటర్‌ వచ్చింది. అక్కడ శెట్టిగారిని కలిసి.. నేను మళ్లీ డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు ఆయనతో చెప్పాను. ‘ఆ విషయంలో మీకు నేను హామీ ఇవ్వలేను.. కానీ జయపుర ఫుట్‌ ఇస్తాను. ఎందుకంటే అది నా బాధ్యత’ అని అన్నారు. ఆ కృత్రిమ కాలుతో ఎలా డ్యాన్స్‌ చేయాలని అడిగితే.. ఆ విషయం మాకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. అక్కడ 12 గంటల్లోనే కృత్రిమ అవయవం తయారు చేస్తారు. అలా ఒక కృత్రిమ అవయవం తయారు చేసి ఇచ్చారు. దాదాపు 8 నెలల తర్వాత నేను నేలపై నిల్చోగలిగాను. ఆ కృత్రిమ కాలితో నేను ముంబయికి చేరుకున్నాను. మూడేళ్ల పాటు నిరంతరంగా కఠోర సాధన చేశాను. రోజూ దాదాపు 18-20 గంటలు నృత్యం చేయడమే నా పని.

mayurisudhachandran650-5.jpg
ఆలీ: సినిమాలో చూపించిన ఆ ముగ్గురూ మీ నిజ జీవితంలో ఎవరు?
సుధాచంద్రన్‌: నిర్మలమ్మ మా నాయనమ్మ. ఫ్రెండ్‌ క్యారక్టర్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉమ. ఆమె ముంబయిలో ఉంటుంది. మాస్టర్‌ గారు.. పీకే శెట్టిగారు. కానీ.. శుభాకర్‌ అనే బాయ్‌ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ మాత్రం నా నిజ జీవితంలో లేదు. ఒకసారి గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లాం. అక్కడ శుభాకర్‌పై ‘మీరే కదా.. ఆ హీరో’ అంటూ ఒక వ్యక్తి ఆగ్రహంతో చెప్పు విసిరాడు. వాళ్లు ఆ సినిమాను అంతలా ఫీల్‌ అయ్యారు. అప్పటి నుంచి మీతో ఏ కార్యక్రమానికి నేను రానని ఆయన అంటుండేవారు. ఆ పాత్రను జనం అంతలా ద్వేషించారు.
ఆలీ: సినిమాలో కట్టు తీసి మీ కాలు చూపించారు. అప్పుడే ఇది నిజమైన కథ అని జనానికి తెలిసింది కదా..!
సుధాచంద్రన్‌: హైదరాబాద్‌లో సినిమా చూసేటప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. సినిమాలో డ్యాన్స్‌ చేసిన తర్వాత కాలు తొలగించే సన్నివేశం చూసి మొదటి వరుసలో కూర్చొని ఉన్న ఒక మహిళ కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే థియేటర్‌లో సినిమాను నిలిపేశారు. అది డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావుగారి గొప్పతనం. నిజంగా ఇదొక మైలురాయి.
ఆలీ: ఈ సినిమా మంచి జ్ఞాపకాలు ఇచ్చింది కదా..!
సుధాచంద్రన్‌: అందమైన.. గొప్ప జ్ఞాపకాలు.
ఆలీ: ‘మయూరి’ సినిమా చూసి ఓ చిన్నపాప వాళ్ల అమ్మానాన్న దగ్గరికి వెళ్లి నా కాలు కూడా తీసేయండి. సుధాచంద్రన్‌లాగా నేను కూడా గొప్ప డ్యాన్సర్‌ అవుతా అని చెప్పిందట. ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
సుధాచంద్రన్‌: నాకు యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత ఎందుకు?.. ఎందుకు?.. ఎందుకు? అనే ప్రశ్నలే ఎదురయ్యాయి. అయితే, ఇలాంటి సంఘటనలు వాటన్నింటికీ సమాధానం చెప్పాయి. ఈ ప్రపంచానికి మనం ఏదో ఒక లక్ష్యంతో వస్తాం. ఇది నా లక్ష్యం. నా జీవిత కాల లక్ష్యం. నేను చనిపోయిన తర్వాత.. కనీసం ఒక్క వ్యక్తి నా గురించి మాట్లాడుకున్నా చాలు. నేను బతికున్నట్లే.

mayurisudhachandran650-6.jpg
ఆలీ: జయపుర కాలుతో మొదటి డ్యాన్స్‌ ప్రదర్శన ఎక్కడ చేశారు?
సుధాచంద్రన్‌: 1984 జనవరిలో ప్రదర్శన ఇచ్చాను. మూడు గంటల నిడివిగల ప్రదర్శన అది. అందుకోసం బాగా సిద్ధమై వెళ్లాను. నేను మొదటి స్టెప్‌ వేయగానే మా అమ్మ లేచి నిల్చుంది. నువ్వేం భయపడకు.. నేనున్నానని అభయమిచ్చింది. ఆ తర్వాత మూడు గంటలు నేను డ్యాన్స్‌ మాత్రమే చేశాను. అందరూ లేచి జయధ్వానాలు చేశారు. అదంతా చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె దగ్గరికి వెళ్లి ‘అమ్మా నేను సాధించాను’ అని చెప్పాను. ఇంటికి వెళ్లిన తర్వాత నా ప్రదర్శన గురించి.. ‘పప్పా.. ఎలా చేశాను’ అని అడిగాను. ఆయన ఏం మాట్లాడకుండా నా కాలిని తాకారు. ‘ఇది సుధాచంద్రన్‌ కాదు.. సరస్వతి’ అని చెప్పారు. నా జీవితంలో సాధించిన గొప్ప ఘనత అదే. నాకు అంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడా దేవుడు.
ఆలీ: 85 ఏళ్ల ఆవిడ మీ షూ కావాలని అడిగిందట!
సుధాచంద్రన్‌: వాంకోవర్ (కెనడా)లో ఒక కార్యక్రమం కోసం అక్కడికి వెళ్లాను. ప్రదర్శన అయిపోయిన తర్వాత ఒక పెద్దావిడ వచ్చి నన్ను కలిసింది. ‘మీరు చేసిన డ్యాన్స్‌ ఏంటో నాకు తెలియదు. కానీ.. నీ షూ కావాలి’ అని అడిగారు. షూ ఎందుకని నేను అడగ్గా.. ‘నేను ఇండియాను వదిలి 30 ఏళ్లు దాటింది. మీ షూలో భారత మట్టి సువాసన ఉంది’ అని ఆమె సమాధానమిచ్చారు. ఆ క్షణంలో.. ఓ ఇండియన్‌గా ఎంతో గర్వపడ్డాను.
ఆలీ: సాధారణంగా అబ్బాయిలకు గోళీలాడటం ఇష్టం. మరి మీరు..?
సుధాచంద్రన్‌: అవును.. నేను గోళీలు బాగా ఆడేదాన్ని. నేనొక టామ్‌ బాయ్‌. ఇప్పుడు కూడా మా ఆయన ఒక అమ్మాయిలాగా ఉండాలని చెబుతుంటారు.
ఆలీ: హీరోయిన్‌ మయూరి నెగెటివ్‌ పాత్రలు చేయడం ఏంటి..?
సుధాచంద్రన్‌: ఎమోషనల్‌‌ పాత్రలు చేసీ చేసీ బోర్‌ కొట్టింది. నా కళ్లలో నెగెటివిటీ బాగా ఉందని.. ఏక్తాకపూర్‌ నన్ను విలన్‌గా మార్చారు. ఆ తర్వాత ఒక్కరు కూడా పాజిటివ్‌ పాత్రలు ఇవ్వలేదు.

mayurisudhachandran650-7.jpg
ఆలీ: పక్కవాళ్ల పేపర్‌లో కాపీ కొట్టి పరీక్షలు రాసేవారట..!
సుధాచంద్రన్‌: నేనెప్పుడూ కాపీ కొట్టలేదు. పనిష్‌మెంట్‌ కోసం కావాలనే నేను అబద్ధం చెప్పాను. ‘ఒట్టు మేడం.. నేను కాపీ కొట్టాను’ అని చెప్పడంతో.. మూడు రోజుల పాటు పాఠశాల నుంచి బహిష్కరించారు. క్లాస్‌లో మొదటి ర్యాంక్‌ నాదే. ఒకసారి సెకండ్‌ ర్యాంక్‌ వచ్చిందని అమ్మ ఇంటి బయట నిల్చోబెట్టింది. ఆమె ఎక్కువ మాట్లాడదు. కానీ.. ఇంట్లో అమ్మ చెప్పిందే వేదం.
ఆలీ: మీ అమ్మగారు మరికొన్ని గంటల్లో చనిపోతారని చెప్పినప్పుడు.. ఆవిడతో మీరు ఎలా సమయం గడిపారు?
సుధాచంద్రన్‌: అమ్మకు వచ్చింది రెక్టమ్‌ క్యాన్సర్‌. సాధారణంగా మాంసాహారం తీసుకునే వాళ్లకే ఎక్కువగా వస్తుంది. మా అమ్మ అలాంటివేం తీసుకునేది కాదు. ఒకసారి నేను అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లాను. అప్పుడే ఆమెకు క్యాన్సర్‌ ఉందని వైద్యులు చెప్పారు. రెక్టమ్‌ క్యాన్సర్‌ ఉంటే రెండేళ్ల కంటే ఎక్కువ బతకలేరు. షూటింగ్‌లో పడి నేనంతా మర్చిపోయాను. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు నేను ట్రాఫిక్‌ నిబంధనలు కూడా ఉల్లంఘించి సిగ్నళ్లు దాటుకుంటూ వెళ్లిపోయాను. ఆ రోజంతా మా అమ్మ చేతిని పట్టుకునే కూర్చున్నాను. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
ఆలీ: ‘మయూరి’ తర్వాత ఏమైనా అవార్డులు వచ్చాయా..?
సుధాచంద్రన్‌: ఒక జాతీయ పురస్కారం వచ్చింది. స్పెషల్‌ జ్యూరీ అవార్డు. దాంతో మా అమ్మ కూడా నా సక్సెస్‌ను చూసింది.
ఆలీ: మీ ఆయన గురించి..?
సుధాచంద్రన్‌: ఆయనది (రవి) పాకిస్థాన్‌లోని పెషావర్‌. ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస వచ్చారు. తొలినాళ్లలో మా ఆయన అంటే మా అమ్మకు ఇష్టం ఉండేది కాదు. పంజాబీ వాళ్లకు కల్చర్‌ ఉండదు. సౌత్‌ ఇండియా వాళ్లకు కల్చర్‌ ఉంటుందని చెప్పేది. దానికి మా ఆయన బదులిస్తూ.. ‘సౌత్‌ ఇండియన్స్‌కు కల్చర్‌ ఉంటే.. పంజాబీలకు అగ్రికల్చర్‌ ఉంది’ అని చెప్పేవారు. క్యాన్సర్‌ వచ్చిన తర్వాత అమ్మకు నా కంటే మా ఆయనే ఎక్కువ సేవ చేశారు. అమ్మ చివరి దశలో ఉన్నప్పుడు.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆయనకు క్షమాపణలు కూడా చెప్పింది.
ఆలీ: తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా..?
సుధాచంద్రన్‌: కచ్చితంగా చేస్తా.
ఆలీ: మీ గురించి పాఠాలున్నాయి కదా..?
సుధాచంద్రన్‌: అవును. ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, బెంగాల్‌తో పాటు సీబీఎస్‌ఈలో నా గురించి పాఠాలున్నాయి. 35 ఏళ్ల తర్వాత పోలవరంలో షూటింగ్‌ చేసేటప్పుడు ఒక పాఠశాల విద్యార్థులు వచ్చి నన్ను ఆటోగ్రాఫ్‌ ఇవ్వండి మేడం.. అంటూ అడిగారు. నేనెవరో మీకు తెలుసా..? అని అడిగితే ‘మీ గురించి మాకు పాఠం ఉంది మేడం’ అని చెప్పారు. వాళ్లకు నేను సుధాచంద్రన్‌గానే తెలుసు. అలా నా గురించి భవిష్యత్తు తరం కూడా చెప్పుకొంటున్నారు.
ఆలీ: రామోజీరావు గారు ఈ కార్యక్రమం తప్పకుండా చూస్తారట. ఆయనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
సుధాచంద్రన్‌: ఆయన ‘మై లివింగ్‌ గాడ్‌’. ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వచ్చినా ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాను.

women icon@teamvasundhara
jayasudha-latest-grey-hair-look-goes-viral-on-social-media

మా ‘సహజ నటి’ ఎందుకిలా మారిపోయారు?

జయసుధ... నాలుగున్నర దశాబ్దాలుగా సినీ కళామతల్లికి సేవలు అందిస్తున్న ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలనాడు కథానాయికగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆమె... నేడు మోడ్రన్‌ మదర్‌గా వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఇలా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సహజనటి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న జయసుధ చివరిగా రెండేళ్ల క్రితం ‘రూలర్‌’ సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత ఎక్కడా కనిపించని ఆమె చాలా రోజుల తర్వాత మన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్‌ బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియోను రిలీజ్‌ చేశారీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
richa-gangopadhyay-announces-pregnancy-on-social-media

మా బార్బీ డాల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం!

అమ్మతనం మాటలకందని అనుభూతినిస్తుంది. కడుపులో నలుసు పడిన క్షణం మొదలు ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచిస్తుంటుంది అమ్మ మనసు. ఎప్పుడెప్పుడు తన చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురుచూస్తూ మాతృత్వంలోని మధురిమలను ఆస్వాదిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లోనే తేలియాడుతోంది రిచా గంగోపాధ్యాయ్‌. ‘మిర్చి’ సినిమాలోని ‘మానస’ పాత్రతో కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ అందాల తార త్వరలోనే అమ్మగా ప్రమోషన్‌ పొందనుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా తను తల్లి కాబోతున్న శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
sreemukhi-chitchat-with-fans-in-instagram-in-telugu

నా బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటంటే...!

శ్రీముఖి... తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై తనదైన స్టైల్‌, మ్యానరిజమ్స్‌తో ఇట్టే ఆకట్టుకునే ఈ అందాల తార ..‘నేను శైలజ’, ‘జులాయి’ తదితర హిట్ సినిమాలతో వెండితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక బిగ్‌బాస్‌-3 రియాల్టీ షోలో రన్నరప్‌గా నిలిచి అమితమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ ప్రస్తుతం పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటోంది. సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ... తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘Post A Picture of’! Or ‘Ask Me Anything’ పేరుతో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులతో దిగిన ఫొటోలతో పాటు ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది.

Know More

women icon@teamvasundhara
mira-rajput-held-an-ask-me-anything-session-on-instagram-and-answered-multiple-questions-about-her-life-marriage-and-more

షాహిద్‌ కాదు.. అతడే నా ఆల్‌టైమ్‌ క్రష్!

మన జీవితంలో మనకు ఇష్టమైన వాళ్లు ఎంతమంది ఉన్నా.. తొలిచూపులోనే మన మనసు దోచుకున్న వాళ్లు (క్రష్‌) మాత్రం ఒక్కరే ఉంటారు. ఈ ప్రశ్నకు సమాధానం తన భర్త షాహిద్‌ మాత్రం కాదంటోంది మీరా రాజ్‌పుత్‌. బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ భార్యగానే కాదు.. తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌కు అనుక్షణం టచ్‌లోనే ఉంటుందీ అందాల అమ్మ. అంతేనా.. వీలు చిక్కినప్పుడల్లా వారితో ముచ్చటిస్తుంటుంది కూడా! అలా తాజాగా ఇన్‌స్టాలో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్‌ నిర్వహించింది మీరా. ఈ క్రమంలో తన భర్త, పిల్లలు, బ్యూటీ సీక్రెట్స్‌, ఫిట్‌నెస్‌.. వంటి బోలెడన్ని విషయాలతో పాటు తన క్రష్‌ ఎవరో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
interesting-facts-about-big-boss-14-winner-rubina-dilaik-in-telugu

మన ‘ఛోటీ బహూ’ బిగ్‌బాస్‌ విన్నరైంది!

బిగ్‌బాస్‌.. ఈ టీవీ కార్యక్రమానికి ఉన్న పాపులారిటీ, ప్రత్యేకతే వేరు! వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ షోకు విపరీతమైన జనాదరణ ఉంది. ఏటా ఓ సీజన్‌తో మన ముందుకొస్తోన్న ఈ టీవీ షో.. ఏ భాషలో ప్రసారమైనప్పటికీ అందరి కళ్లూ విజేత ఎవరవుతారన్న ఆతృతతోనే ఎదురుచూస్తుంటాయి. అలా ఈసారి హిందీ బిగ్‌బాస్‌-14 విజేతగా నిలిచింది టీవీ నటి రుబీనా దిలాయిక్‌. ప్రపంచంతో సంబంధం లేకుండా 143 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్లో గడిపిన ఆమె.. తన పెర్ఫార్మెన్స్‌తో ఇతర కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇచ్చింది. అందుకే ఈ సీజన్‌ విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 36 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. మరి, షో ఆద్యంతం తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో, పోటీతత్వంతో అలరించిన రుబీనా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alitho-saradaga-special-chat-show-with-srilakshmi-and-hema

అందుకే... నాకు కష్టమొస్తే గోడకు చెప్పుకుంటున్నా!

వారు తమ నటనతో వెండితెరపై నవ్వుల పువ్వులు పండించారు. తమకే సాధ్యమైన మేనరిజమ్స్‌తో, డైలాగులతో ప్రేక్షకుల మదిని దోచారు. కామెడీ నుంచి క్యారక్టర్‌ ఆర్టిస్టు దాకా ఎలాంటి పాత్రలకైనా ప్రాణం పోయగల వారిద్దరే సీనియర్‌ నటీమణులు శ్రీలక్ష్మి, హేమ. సున్నితమైన హాస్యంతో సిల్వర్‌ స్ర్కీన్‌పై తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ తాజా ఎపిసోడ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, అనందపడ్డ క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
top-chef-winner-melissa-king-is-proud-of-changing-her-life-style

లేట్‌నైట్ పార్టీలు, మద్యపానంతో నా శరీరాన్ని, మనసును ఎంతో బాధపెట్టా!

మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికం గానూ ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతమున్న యాంత్రిక జీవనంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం లేదు. పని ఒత్తిడిలో పడిపోయి కొందరు ఏ అర్ధరాత్రో తింటున్నారు. మరికొందరు సులభంగా దొరుకుతుందనే కారణంతో జంక్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. ఇక లేట్‌ నైట్‌ ప్రోగ్రామ్స్‌, వీకెండ్‌ పార్టీలంటూ ఇంకొందరు ఏది పడితే అది తింటున్నారు. దీంతో తమకు తెలియకుండానే విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. ఈ క్రమంలో ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే ఒకానొక సమయంలో విపరీతంగా బరువు పెరిగానంటోంది ప్రముఖ అమెరికన్‌ చెఫ్‌ మెలిస్సా కింగ్‌. అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌తో లావెక్కిన తన శరీరాన్ని చూసి ఎంతో బాధపడ్డానని చెబుతోంది. ఇక ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదన్న విషయం ఆలస్యంగా గ్రహించినా... అప్పట్నుంచి తన శరీరాన్ని తనకు నచ్చినట్లుగా మార్చుకున్నానంటోంది. ఈ క్రమంలో తన ఫ్యాట్‌ టు ఫిట్‌ జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్‌ చేసుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
meghan-markle-wax-statue-gets-a-baby-bump-after-pregnancy-announcement

women icon@teamvasundhara
urvashi-dholakia-shares-her-views-about-body-shaming-and-loving-her-body
women icon@teamvasundhara
meghana-raj-introduces-her-son-to-world-in-telugu

ఇదిగో.. నా జూనియర్‌ చిరు!

భర్తతో పదేళ్ల ప్రేమ బంధం... రెండేళ్ల దాంపత్య బంధానికి ప్రతిరూపంగా కొన్ని నెలల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది నటి మేఘనా రాజ్‌. దీంతో తనను విడిచి వెళ్లిన చిరంజీవే మళ్లీ తన దగ్గరకు వచ్చాడని తెగ సంబరపడిపోయింది. తన భర్త వదిలి వెళ్లిన మధుర జ్ఞాపకాలను కుమారుడిలో చూసుకుంటూ మురిసిపోయింది. ఈ క్రమంలో బిడ్డే సర్వస్వంగా బతుకుతోన్న మేఘన తాజాగా తన రాకుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో తన భర్త జ్ఞాపకార్థం కుమారుడికి ‘జూనియర్‌ చిరు’ (సింబా) అని నామకరణం చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలతో మేఘన షేర్‌ చేసుకున్న ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
manya-singh-daughter-of-a-rickshaw-driver-crowned-miss-india-2020-runner-up

చిన్నప్పుడు పాచిపనులు కూడా చేశా.. అందాల రాణి కన్నీటి గాథ!

‘అందాల పోటీల్లో పాల్గొనే అమ్మాయిలందరూ హై క్లాస్ ఫ్యామిలీస్‌ నుంచే వస్తారు. పుట్టుకతోనే స్థితిమంతులైన అలాంటి వారికి సకల సౌకర్యాలకెలాంటి లోటూ ఉండదు’... మోడలింగ్‌ను కెరీర్గా ఎంచుకునే అమ్మాయిల గురించి చాలామంది అనుకునే మాటలివి. అయితే అందరూ అలా ఉండరని, ఈ మెరుపుల వెనుక మాటలకందని కన్నీళ్లు, దిగమింగలేని కష్టాలు కూడా ఉన్నాయంటోంది తాజా మిస్ ఇండియా రన్నరప్‌ మాన్యాసింగ్‌. తెల్లవారితే ఇంట్లో పొయ్యి వెలుగుతుందో లేదో తెలియని ఓ పేద కుటుంబంలో పుట్టిన తానే ఇందుకు నిదర్శనమంటోంది. మరి కటిక పేదరికం నుంచి ప్రతిష్ఠాత్మక అందాల పోటీల దాకా ఆమె సాగించిన విజయ ప్రస్థానం గురించి మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
lisa-haydon-ropes-in-son-zack-for-pregnancy-announcement-baby-no-3-coming-this-june

ముచ్చటగా మూడోసారి అమ్మను కాబోతున్నా!

అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చే అమ్మతనం ఆడవారికి మాత్రమే దక్కిన గొప్ప వరం. ఎన్నెన్నో సందేహాలు, మది నిండా సంతోషంతో కొత్తగా తల్లయ్యే అమ్మలందరూ తొలిసారి అమ్మతనాన్ని ఆస్వాదిస్తే.. ఇప్పటికే అమ్మగా ప్రమోషన్ పొందిన మహిళలు అటు అనుభవం, ఇటు మాతృత్వపు మాధుర్యం కలగలిసిన ఈ సరికొత్త అనుభూతిని తనివితీరా ఆస్వాదిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి అంతులేని ఆనందంలోనే మునిగితేలుతోంది బాలీవుడ్‌ అందాల తార లిసా హెడెన్‌. నాలుగేళ్ల క్రితం జాక్‌ అనే పండంటి మగబిడ్డను ప్రసవించిన ఈ ముద్దుగుమ్మ గతేడాది ఫిబ్రవరిలో లియో అనే మరో బాబుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతోంది ఈ అందాల అమ్మ. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్‌ వీడియోతో తానే స్వయంగా ఈ శుభవార్తను అందరితో షేర్‌ చేసుకుందీ బ్యూటిఫుల్‌ మామ్‌. దీంతో అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Know More

women icon@teamvasundhara
fashion-designer-manali-jagtap-shares-about-her-cancer-treatment-and-experiences

గుండె రాయి చేసుకున్నా.. క్యాన్సర్‌ను జయించా!

క్యాన్సర్‌.. మందు లేని ఈ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా మానవజాతిని పట్టి పీడిస్తోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అన్న తేడాల్లేకుండా అందరినీ భయపెడుతోంది. అయితే దీనిపై ముందు నుంచీ అవగాహన పెంచుకోవడం, తొలిదశలోనే గుర్తించడం, క్యాన్సర్‌ అంటూ భయపడిపోకుండా సరైన చికిత్సలు తీసుకుని ధైర్యంగా ముందుకు సాగితే దీని నుంచి బయటపడవచ్చు. ఎందరో సెలబ్రిటీలు తమ అనుభవాల ద్వారా ఈ మాటలను అక్షర సత్యం చేశారు. అలాంటివారిలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనాలీ జగ్తాప్‌ ఒకరు. రెండేళ్ల క్రితం ప్రమాదకర గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన అనుభవాలు షేర్‌ చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ‘ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం’ సందర్భంగా క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుంది మనాలీ.

Know More

women icon@teamvasundhara
winner-of-‘world-most-beautiful-face’-speaks-about-the-hate-she-has-received

‘బ్యూటీ క్వీన్‌’ కాదు.. ‘అగ్లీ క్వీన్‌’ అన్నారు!

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పేరుతో సోషల్‌ మీడియాలో కొంత మంది నెటిజన్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలున్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తుంటారు. ఈక్రమంలో ‘ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం’ గల యువతిగా గెలిచిన ఓ అందాల తార కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొందట. ఇంతకీ ఎవరామె?ఎందుకు ట్రోలింగ్‌ బారిన పడిందో తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
celebrities-who-flaunted-their-stretch-marks-with-absolute-pride
women icon@teamvasundhara
ram-charan-wife-upasana-konidela-took-the-initiate-gets-herself-vaccinated-at-apollo

మేం కరోనా టీకా తీసుకున్నాం! మీరూ తీసుకోండి!

కాలయముడిలా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో వేల ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదకర వైరస్‌కు విరుగుడు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే కొవిడ్‌ రక్కసిని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలోనూ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలు ఉన్నాయంటూ చాలామంది టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్‌పై భయాన్ని పటాపంచలు చేస్తూ మెగా కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన తాజాగా టీకా తీసుకుంది.

Know More

women icon@teamvasundhara
ellen-degeneres-shares-her-covid-19-experience-in-telugu

ఆ నొప్పితో నా పక్కటెముకలు విరిగిపోయాయేమో అనిపించింది!

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతమయ్యేలా లేదు. ఓవైపు వివిధ దేశాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ... మరోవైపు కొత్త రూపు దాల్చుకుని విరుచుకుపడుతోందీ మహమ్మారి. లక్షణాలు తెలియనివ్వకుండా, కొత్త కొత్త లక్షణాలతో ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ అందరిలో గుబులు రేపుతోంది. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అదే సమయంలో సరైన మందు లేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ అమెరికన్‌ నటి ఎలెన్‌ డీజెనెరెస్‌ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ బారిన పడ్డారు. ఇంట్లోనే చికిత్స తీసుకుని ఇటీవలే పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించిన తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకునేందుకు ఇలా మన ముందుకు వచ్చారు.

Know More

women icon@teamvasundhara
madhumitha-and-siva-balaji-in-alitho-saradaga-chat-show-in-telugu

మా పెళ్లికి జాతకాలు కలవలేదు... కానీ!

ఆమె ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమాతో ప్రతి తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది. అతనేమో ‘ఆర్య’, ‘చందమామ’, ‘సంక్రాంతి’ చిత్రాలతో అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు. వ్యక్తిగతంగా తమ సహజ నటనతో మెప్పించే వీరిద్దరు సిల్వర్‌స్ర్కీన్‌పై ఎప్పుడూ జంటగా కనిపించలేదు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ ఫుల్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వారే నటులు శివబాలాజీ, మధుమిత. పుష్కర కాలం కిందట పెళ్లిపీటలెక్కిన ఈ అందాల జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ యువతకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోంది. ఎప్పుడు చూసినా నవ్వుతూ సరదాగా కనిపించే ఈ లవ్లీ కపుల్ ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
celebrities-who-adopt-hydroponic-gardening-in-telugu

మట్టి లేకుండానే పండిస్తున్నాం.. మీకూ ఈ సంతోషం కావాలా?

కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే ఆహారం దగ్గర్నుంచి చేసే పనుల దాకా ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గార్డెనింగ్‌కి ఆదరణ పెరిగింది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా సహజ పద్ధతుల్లో కాయగూరలు పండించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఎలాంటి మట్టి ఉపయోగించకుండా కేవలం నీటితోనే మొక్కల్ని పెంచే హైడ్రోపోనిక్‌ గార్డెనింగ్‌కి ఓటేస్తున్నారు. తాను కూడా ఇలాంటి పద్ధతిలోనే తన ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటున్నానని చెబుతోంది బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పాశెట్టి. ఈ క్రమంలోనే ఇటీవల తన హైడ్రోపోనిక్‌ గార్డెన్‌కి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది శిల్ప. ఇక మొన్నటికి మొన్న అలనాటి అందాల తార సుహాసిని కూడా తన హైడ్రోపోనిక్‌ గార్డెన్‌ని తన ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది. వీళ్లే కాదు.. ఇంకొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ సరికొత్త గార్డెనింగ్‌ ట్రెండ్‌ని తమ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకొని అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. మరి, వాళ్లెవరో చూసేద్దామా..?!

Know More

women icon@teamvasundhara
sania-mirza-shares-about-her-covid-experience-in-telugu

అదో భయంకరమైన అనుభవం.. కరోనాను జోక్‌గా తీసుకోవద్దు!

కరోనా కారణంగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసొచ్చింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు; ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. పదేళ్ల క్రితం పాక్‌ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ టెన్నిస్‌ క్వీన్‌ రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చింది. అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే... ఇటు తన కెరీర్‌నూ కొనసాగిస్తోందీ సూపర్‌ మామ్‌. ఈక్రమంలో తన కుమారుడి ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సానియా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిందట. ఈ కారణంగా కొద్ది రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ టెన్నిస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
kajol-says-her-father-was-against-the-idea-of-her-getting-married-to-ajay-devgan-at-young-age

అప్పుడు మా పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు!

ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సుమారు రెండు దశాబ్దాలకు పైగా గడిచినా..ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం జంటలకు ఆదర్శంగా నిలుస్తుంటారీ లవ్లీ కపుల్‌. ఇక గతేడాది ‘తానాజీ... ది అన్‌ సంగ్‌ వారియర్‌’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ... ఆన్‌ స్ర్కీన్... ఆఫ్‌ స్ర్కీన్‌ ఎక్కడైనా తమది ‘పర్ఫెక్ట్‌ జోడీ’ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇలా ఓవైపు తల్లిగా తన ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే ... మరోవైపు నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తోంది కాజోల్. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘త్రిభంగ’ జనవరి 15 న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More