అలా నా రోజు ప్రారంభమవుతుంది!
నా యాంకరింగ్‌ని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్లు ‘మీ ఎనర్జీకి కారణమేంటి? రోజూ ఏ ఆహారం తీసుకుంటారు?’ అని పదే పదే అడుగుతుంటారు. సో.. ఈ వీడియోలో నేను వాటి గురించే చెప్పబోతున్నా..
 * ఉదయాన్నే ప్రొబయోటిక్స్ తీసుకోవడం నాకు అలవాటు. నేను ఒకానొక దశలో విటమిన్-బి12 లోపంతో బాధపడ్డా. దాన్ని తిరిగి పొందడానికి ఏవైనా ఇంజెక్షన్స్ తీసుకున్నా మన పేగుల్లోని బ్యాక్టీరియా సరిగ్గా లేకపోతే మనం తీసుకునే విటమిన్లు కానీ, సప్లిమెంట్స్ కానీ శరీరం గ్రహించలేదు. కాబట్టి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడానికి ఈ ప్రొబయోటిక్స్ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే ఇది రోజంతటికీ కావాల్సిన శక్తిని, ఉత్సాహాన్ని శరీరానికి అందిస్తుంది. ఇక ఇది తాగాకే టీ, కాఫీ, అల్పాహారం.. ఏవైనా! * ఆ తర్వాత టీ తాగుతా. పొద్దున్న ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు అంతే! ఇందులో కూడా కొన్ని అల్లం ముక్కలు వేసుకొని తీసుకోవడం నాకు అలవాటు. అయితే ఈ టీ తయారీకి పాలకు బదులుగా జీడిపప్పు పాలు, బాదం పాలు, ఓట్స్ పాలు, కొబ్బరి పాలు.. వంటివి ఉపయోగిస్తున్నా. పాలు పడని వారు వీటిని ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎంచుకోవచ్చు. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. * ఇక అల్పాహారం విషయానికొస్తే.. ఓట్స్ దోసె, ఓట్స్ ఉప్మా, పుట్టు, అప్పం, సేమ్యా ఉప్మా, బ్రౌన్ రైస్ ఇడ్లీ, గోధుమ రవ్వ ఉప్మా, పొంగల్.. ఇలా రోజుకో వెరైటీ తీసుకుంటా. పూరీ అయితే మా ఇంట్లో ఎప్పుడో ఒకసారి ఉంటుందంతే! ఇక అల్పాహారం ముగించాక ఏదో ఒక పండు తీసుకోవడం నాకు అలవాటు.
 * అల్పాహారం తర్వాత, మధ్యాహ్న భోజనానికి ముందు అంటే ఉదయం 10:30 నుంచి 11గంటల మధ్యలో ఏదో ఒక పండు తీసుకుంటా. ఇందులో భాగంగా అరటిపండు, దానిమ్మ, సపోటా, అనాస, పుచ్చకాయ, వేసవిలో అయితే మామిడి పండ్లు తీసుకుంటా. బత్తాయి వంటివైతే జ్యూస్ చేసుకొని తాగుతా. * లంచ్‌లో భాగంగా బ్రౌన్ రైస్/చిరుధాన్యాలు, తెల్ల గుమ్మడికాయ ముక్కలతో చేసిన పప్పు పులుసు, బీరకాయ కూర, అరటికాయ వేపుడు, పప్పు-ఆకుకూర, పెరుగు.. వంటివి తీసుకుంటా. అంతేకాదండోయ్.. నాకు కూరలు ఎక్కువగా తినడం చాలా ఇష్టం.
 * ఇక రాత్రి భోజనం వీలైనంత త్వరగా ముగించేస్తా. చిరుధాన్యాలు, పప్పు, కూరగాయలు.. ఇవే నా డిన్నర్. * మీరు ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి కారణమేంటని చాలామంది నన్ను అడుగుతుంటారు. నేను మంచినీళ్లు ఎక్కువగా తాగుతుంటా. అదే నా ఆరోగ్య రహస్యం. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా నీళ్లు తాగడం మాత్రం మర్చిపోను.
|