scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

రోజూ ఆ ముగ్గురికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాకనే నిద్ర పోతాను!

Actress Kasturi in Alitho Saradaga Chat Show

‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్‌ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


మీ మాతృభాష ఏది?
కస్తూరి: నేను పుట్టింది తమిళ ఇంట్లో. మా అత్తామామలది మద్రాసు తెలుగు. మా ఆయనకు తెలుగు మాట్లాడటం రాదు. ఇంగ్లిష్ మాట్లాడతారు.
మీ వివాహం ఎలా అయింది?
పెద్దలు కుదిర్చిన వివాహం.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


ఏ సంవత్సరంలో మీకు వివాహం అయింది?
2000లో వివాహం అయింది. ఆ తర్వాత మేము యూరప్‌ వెళ్లిపోయాం. ఇప్పుడు మా ఆయన అమెరికాలో ఉంటున్నారు. ఆయన డాక్టర్‌. నడిచే కాళ్లు.. వాగే నోరూ ఊరుకోదు. అందుకే నేను ఇండియాకు వచ్చేశాను.
ఐదేళ్లలో 21 దేశాలు తిరిగారట!
అవునండీ. పెళ్లయిన కొత్తలో అలా తిరిగాం. శీతాకాలంలో జర్మనీలో ఉండటం అస్సలు సాధ్యం కాలేదు. అక్కడ -17డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అప్పుడు ఈజిప్ట్‌, ఆఫ్రికా తిరిగేవాళ్లం.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


మీరు మిస్‌ మద్రాసు కదా!
అవును! మిస్‌ మద్రాసు అయిన తర్వాత రెండు మూడు సినిమాలు చేశా. ఆ తర్వాత మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లా. ఐశ్వర్యారాయ్‌, సుస్మితాసేన్‌లతో నేను కూడా ఫైనలిస్ట్‌. నేను ఓడిపోయానంటే వాళ్ల అందమే కారణం. శ్వేతామేనన్‌ నా రూమ్మేట్‌. వయసు పరంగా, ఆలోచనపరంగా అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. అప్పుడు మనల్ని చూసి అమ్మానాన్న గర్వపడాలని చాలా బాధ్యతగా ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లతో కలిసి ఆడుకుంటున్నా. అమ్మాయికి 14 ఏళ్లు. పదో తరగతి, బాబుకి 8 ఏళ్లు. మూడో తరగతి చదువుతున్నాడు. చాలా ఇంటెలిజెంట్.
అంటే కస్తూరిలా అన్నమాట!
అయ్యో.. నాలా అస్సలు ఉండకూడదు. జమైకా రాజధాని ఏదంటే ఇట్టే చెప్పేస్తాను. చెన్నైలో కరోనా కేసుల లెక్క చెప్పమంటే కూడా మొత్తం చెబుతాను. కానీ, ఇంట్లో తాళం ఎక్కడ ఉందంటే మాత్రం తెలియదు. వెతుకుతూ ఉంటాను.
మీ తల్లిదండ్రుల గురించి?
అమ్మ.. థైరాయిడ్‌ క్యాన్సర్‌తో కన్నుమూశారు. అది క్యాన్సర్‌ అని తెలియక సాధారణ నొప్పి అని భరిస్తూ, చివరకు చనిపోయారు. అమ్మ మరణించిన తర్వాత నాన్న తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఐదు నెలల్లో ఆయన కూడా చనిపోయారు. నా చిన్నతనంలో వాళ్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండే వారు. కానీ, మా అమ్మ ఆరోగ్యం పాడైన తర్వాత ఆయన చూపించిన ప్రేమ అంతా ఇంతా కాదు. రెండేళ్ల పాటు ఆయన అమ్మ పక్కనే ఉండిపోయారు.
‘భారతీయుడు’ సినిమా ఇప్పుడు తీస్తే.. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది?
అవునండీ. అవినీతి గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడాలి. ఆ ఆలోచన మొత్తం శంకర్‌గారిదే. అయితే, అక్కడ నటుడిగా ఉన్నది కమల్‌హాసన్‌. ఆయన తెరపై ఎలా నటిస్తారో అందరికీ తెలిసిందే.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


‘భారతీయుడు’ కస్తూరికి, నేటి కస్తూరికి తేడా ఏంటి?
‘భారతీయుడు’ సినిమా 1995లో మొదలైందనుకుంటా. 25 ఏళ్ల తేడా ఉంది కదా! అప్పుడు నా వయసు 16 ఏళ్లు.
తెలుగులో తొలి సినిమా ఏది?
‘నిప్పురవ్వ’. ఆ తర్వాత ‘మెరుపు’, ‘చిలక్కొట్టుడు’, ‘అన్నమయ్య’, ‘ఆకాశ వీధిలో’ తదితర సినిమాల్లో నటించాను.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


మీరు చాలా రెబల్‌ అని విన్నాం నిజమేనా?
అవును! చాలా ముఖ్యమైన విషయం. 25 ఏళ్ల ముందు నేను ఒక టీనేజ్‌ అమ్మాయిని. అప్పుడు మనకు ఏమైనా ఆలోచనలు ఉన్నా, మాట్లాడటానికి పరిపక్వత ఉండదు. ఇప్పుడు నాకు లోకజ్ఞానం తెలిసింది. అనేక అనుభవాలు ఎదురయ్యాయి. కష్టాలు.. సంతోషాలు చూశా. సమాజానికి ఏదైనా చేయాలని ఒక ఆలోచన కూడా వచ్చింది. దాని వల్ల ట్రస్ట్‌ ప్రారంభించా. చిన్న పిల్లలకు సాయం చేస్తున్నా. ఎక్కడైనా ఏదైనా జరిగితే నోరు మూసుకుని మాత్రం ఉండను. తమిళనాడులో నేనొక పొలిటికల్‌ అనలిస్ట్ అయిపోయా. నేనంటే భయం, గౌరవం ఉన్నాయి. నేనొక ఫెమినిస్ట్‌. మహిళల గురించి మహిళలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు?. ‘కనెక్ట్‌ విత్‌ కస్తూరి’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ప్రారంభించా.
కాంట్రవర్సీలు లేకపోతే కస్తూరికి నిద్ర రాదు అంటుంటారు. నిజమేనా?
అదేం లేదండీ. మన కల్చర్‌లో ఏ మనిషి అయినా మాట్లాడటానికి ఆలోచిస్తాడు. మామూలుగా ఎన్నో కబుర్లు చెప్పే వ్యక్తిని వేదికపైకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడరు. అందులో సెలబ్రిటీలు బాగా భయపడతారు. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇదిగో ఇలా కాంట్రవర్సీ అనే ముద్ర కూడా పడుతుంది. నేను చెప్పేది అంతా నిజమే. కామన్‌ మెన్‌కు ఏ పార్టీ కూడా మంచి చేయడం లేదు. ఎవరైనా మంచి చేస్తే థ్యాంక్యూ చెప్పి, చెడు చేసినప్పుడు ఇలా చేయకూడదని చెప్పడానికి నాకు స్వేచ్ఛ ఉండాలి. ఒక పార్టీలో ఉంటే నాకా ఫ్రీడం ఉండదు. నేను పీపుల్స్‌ పార్టీని. ప్రజల వెనుక నేను ఉన్నా.

‘అన్నమయ్య’ గురించి?
నా జీవితంలో ‘అన్నమయ్య’ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక వరం. అద్భుతమైన అవకాశం.
నాగార్జున షేక్‌ హ్యాండ్‌ ఇస్తే, ఆ చేతిని కడగకుండా ఆ రోజల్లా పక్కనే పెట్టుకుని పడుకున్నారట!
నేను చాలామంది హీరోలతో పనిచేశా. కానీ, లైఫ్‌ టైమ్‌లో క్రష్‌ అనేది ఒకరిపై వచ్చిందంటే అది నాగార్జున గారి మీదనే. నేను మోడలింగ్‌ చేసే సమయంలోనే ఆయన్ను కలిశా. అప్పుడు షేక్‌ హ్యాండ్‌ ఇస్తే, చేతిని కడగకుండా 24గంటలు ఉంచా. చివరకు ఆకలికి తట్టుకోలేక చేయి కడగాల్సి వచ్చింది. (నవ్వులు) ఆయనతో నేను రెండు సినిమాలు చేస్తానని అనుకోలేదు.
క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీని కూడా ఇష్టపడ్డారట!
లేదండీ.. నాకు ధోనీ అంటే ఇష్టం. అయితే, ధోనీని చూసినప్పుడల్లా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గుర్తొస్తున్నాడు. అలాంటి విషయాలు ఇండస్ట్రీలో జరిగితే మనసుకు చాలా బాధగా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


ధోనీతో ఒక్కరోజు ఉండే ఛాన్స్‌ వస్తే ఎలా ప్లాన్‌ చేస్తారు?
అలా జరిగింది కూడా. సాక్షి, జీవాలతో పాటు నా పిల్లలు కూడా ఉంటారు.
‘ఆమె’, ‘సింధూరం’ ఎందుకు మిస్సయ్యారు?
డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోవడం వల్ల వాటిని మిస్‌ అయ్యా.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


మొదటిసారి మనిద్దరం (ఆలీ) కలిసి చేసిన సినిమా ఏంటో గుర్తుందా?
‘డాన్‌ శీను’
‘కాలా’ లో మిమ్మల్ని అనుకుని తర్వాత వద్దనుకున్నారట..
ముంబయి ధారావిలో జరిగే కథ అది. నేను కూడా ఆడిషన్‌కు వెళ్లాను. అయితే, స్లమ్‌లో ఉండేవాళ్లలా నేచురల్‌ లుక్‌ కావాలన్నారు. నేను చీర కట్టుకుని వెళ్లా. చూడగానే ‘ఆ పాత్రకు మీరు సరిపోరు’ అని చెప్పేశారు. అన్ని విధాలా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశా. నేను చేసిన పాత యాడ్‌లు చూపించా. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. ఆయనతో నటించి ఉంటే నా చిరకాల కోరిక నెరవేరేది.

రమ్యకృష్ణతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడం ఎలా అనిపించింది?
ఆమె నాకంటే చాలా సీనియర్‌. ఆమె అంటే కూడా నాకు క్రష్‌ ఉంది. నేను స్కూల్‌లో చదువుకునేటప్పటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నా. ఇప్పుడు నా పిల్లలు స్కూల్‌లో‌ చదువుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె గ్లామర్‌ ఏమాత్రం మారలేదు.

కమల్‌తో నటిస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు?
ఎన్‌సైక్లోపిడియా చదివి ఏం నేర్చుకున్నావ్ అంటే సులభంగా చెప్పగలను. కమల్‌ సర్‌ను సెట్‌లో చూడడమే ఒక పాఠం లాంటిది. ‘భారతీయుడు’ సినిమా కోసం ప్రతి ఒక్కరూ తమ మొదటి చిత్రంగా భావించి పని చేశారు. దర్శకుడు ఏదైనా సీన్‌ చెబితే ‘అలా చేయొచ్చా’ అని అడిగేవారు. ఎప్పుడైనా మనం సినిమా స్టార్స్‌ అని గర్వం వస్తే, వాళ్లను చూస్తే అది పోతుంది. ‘నిప్పురవ్వ’లో ఎక్కువ సన్నివేశాల్లో విజయశాంతి గారితో చేశా. ఒకరోజు ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. అయినా కూడా దర్శకుడు యాక్షన్‌ చెప్పగానే అవన్నీ మర్చిపోయి ఫైట్స్‌ చేశారు. ఆమె నటిస్తున్న తీరు చూసి నేను భయపడిపోయా. ఏయన్నార్‌గారితో ‘గాడ్‌ ఫాదర్‌’లో నటించా. సెట్‌లో ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నా.
ఎవరైనా హీరోకు తల్లిగా చేస్తారా?
చేస్తాను. ఆ హీరో తండ్రిగా, కొడుకుగా డబుల్‌ యాక్షన్‌ చేయాలి. అప్పుడు తప్పకుండా చేస్తా. విజయ్‌ దేవరకొండకు మాత్రం తల్లిగా అస్సలు చేయను. ఆయనంటే చాలా క్రష్‌. ఇటాలియన్‌ మోడల్‌లా ఉంటారు.
మీరు బాగా ఇష్టపడి మిస్సయిన సినిమా ఏదైనా ఉందా?
అలా ఏమీ లేదు కానీ, ‘మెరుపు కలలు’ చిత్రంలో కాజోల్‌ క్యారక్టరైజేషన్‌ నాకు దగ్గరగా ఉంటుంది. ‘బొమ్మరిల్లు’లో జెనీలియా పోషించిన పాత్ర కూడా నాదే. నిజ జీవితంలో నేనూ అలాగే ఉంటాను.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


తెలుగు ఇండస్ట్రీలో నచ్చిన/నచ్చని విషయం?
నచ్చిన విషయం అంటే గౌరవం. నచ్చనిది ఏమీ లేదు.
ఏ వయసులో కస్తూరికి ప్రేమలేఖ వచ్చింది?
కస్తూరి: 14 ఏళ్ల వయసులో.. అయితే, ఆ లెటర్‌ను ‘ఆ అమ్మాయికి ఇవ్వు.. ఈ అమ్మాయికి ఇవ్వు’ అని చెబుతుండేవారు.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


నిద్రపోయే ముందు ముగ్గురు వ్యక్తులకు ‘థ్యాంక్స్‌’ చెప్పి నిద్రపోతారట!
అవును! నా జీవితంలో నన్ను ఉత్తమంగా తీర్చిదిద్దిన వాళ్లు. నేను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇళయరాజా సంగీతం నన్ను ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసింది. ఆ తర్వాత పుదుమైపిత్తన్‌ అనే తమిళ రచయిత. ఆయన చనిపోయి వందేళ్లు దాటిపోయింది. అయినా ఆయన రచనలు నాలో ఎంతో స్ఫూర్తి నింపుతాయి. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా. ఆయన కృప వల్ల నా కూతురు బతికింది.
అమెరికాలో మన తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారట
చాలా సినిమాలు చేశాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశాం.

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri) on


మంచి పాత్రల్లో నటిస్తూ, ఒక మ్యాగజైన్‌కు బోల్డ్‌ ఫొటో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది?
అది ఇక్కడ ఇవ్వలేదు. అందరూ దొంగతనంగా వేసుకున్నారు. ఈ కల్చర్‌కు ఆ ఫొటో సూట్‌ కాదు. అది అమెరికన్‌ ప్రాజెక్టు. మాతృత్వానికి వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరు. ఆ ఫొటోలు లీక్‌ కావడం నాకు చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. మహిళల నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. గ్రామీణ మహిళలు కూడా నాకు సపోర్ట్‌ చేశారు.
వచ్చే జన్మలో తెలుగు హీరోలా పుట్టాలంటే ఎవరిలా పుడతారు?
ఎన్టీఆర్‌ డ్యాన్స్‌, ఫైట్స్‌.. ప్రభాస్‌ కండలు.. అల్లు అర్జున్‌ స్టైల్‌.. విజయ్‌ దేవరకొండ లుక్స్‌ అన్నీ కలిపి కావాలి.

women icon@teamvasundhara
ellen-degeneres-shares-her-covid-19-experience-in-telugu

ఆ నొప్పితో నా పక్కటెముకలు విరిగిపోయాయేమో అనిపించింది!

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఇప్పట్లో అంతమయ్యేలా లేదు. ఓవైపు వివిధ దేశాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ... మరోవైపు కొత్త రూపు దాల్చుకుని విరుచుకుపడుతోందీ మహమ్మారి. లక్షణాలు తెలియనివ్వకుండా, కొత్త కొత్త లక్షణాలతో ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ అందరిలో గుబులు రేపుతోంది. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత అప్రమత్తంగా ఉంటున్నా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. అదే సమయంలో సరైన మందు లేని ఈ మహమ్మారిని మనోధైర్యంతో జయిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుని వైరస్‌పై విజయం సాధిస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ అమెరికన్‌ నటి ఎలెన్‌ డీజెనెరెస్‌ కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ బారిన పడ్డారు. ఇంట్లోనే చికిత్స తీసుకుని ఇటీవలే పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా కరోనాకు సంబంధించిన తన అనుభవాలను అందరితో షేర్‌ చేసుకునేందుకు ఇలా మన ముందుకు వచ్చారు.

Know More

women icon@teamvasundhara
madhumitha-and-siva-balaji-in-alitho-saradaga-chat-show-in-telugu

మా పెళ్లికి జాతకాలు కలవలేదు... కానీ!

ఆమె ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమాతో ప్రతి తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది. అతనేమో ‘ఆర్య’, ‘చందమామ’, ‘సంక్రాంతి’ చిత్రాలతో అమ్మాయిల మనసులు కొల్లగొట్టాడు. వ్యక్తిగతంగా తమ సహజ నటనతో మెప్పించే వీరిద్దరు సిల్వర్‌స్ర్కీన్‌పై ఎప్పుడూ జంటగా కనిపించలేదు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం సక్సెస్‌ ఫుల్‌ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వారే నటులు శివబాలాజీ, మధుమిత. పుష్కర కాలం కిందట పెళ్లిపీటలెక్కిన ఈ అందాల జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ యువతకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోంది. ఎప్పుడు చూసినా నవ్వుతూ సరదాగా కనిపించే ఈ లవ్లీ కపుల్ ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సరదాగా షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon@teamvasundhara
celebrities-who-adopt-hydroponic-gardening-in-telugu

మట్టి లేకుండానే పండిస్తున్నాం.. మీకూ ఈ సంతోషం కావాలా?

కరోనా వచ్చిన దగ్గర్నుంచి అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే ఆహారం దగ్గర్నుంచి చేసే పనుల దాకా ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గార్డెనింగ్‌కి ఆదరణ పెరిగింది. సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా సహజ పద్ధతుల్లో కాయగూరలు పండించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ ఎలాంటి మట్టి ఉపయోగించకుండా కేవలం నీటితోనే మొక్కల్ని పెంచే హైడ్రోపోనిక్‌ గార్డెనింగ్‌కి ఓటేస్తున్నారు. తాను కూడా ఇలాంటి పద్ధతిలోనే తన ఇంట్లో మొక్కల్ని పెంచుకుంటున్నానని చెబుతోంది బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పాశెట్టి. ఈ క్రమంలోనే ఇటీవల తన హైడ్రోపోనిక్‌ గార్డెన్‌కి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది శిల్ప. ఇక మొన్నటికి మొన్న అలనాటి అందాల తార సుహాసిని కూడా తన హైడ్రోపోనిక్‌ గార్డెన్‌ని తన ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది. వీళ్లే కాదు.. ఇంకొందరు ముద్దుగుమ్మలు కూడా ఈ సరికొత్త గార్డెనింగ్‌ ట్రెండ్‌ని తమ లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకొని అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. మరి, వాళ్లెవరో చూసేద్దామా..?!

Know More

women icon@teamvasundhara
sania-mirza-shares-about-her-covid-experience-in-telugu

అదో భయంకరమైన అనుభవం.. కరోనాను జోక్‌గా తీసుకోవద్దు!

కరోనా కారణంగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసొచ్చింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు; ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. పదేళ్ల క్రితం పాక్‌ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ టెన్నిస్‌ క్వీన్‌ రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చింది. అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే... ఇటు తన కెరీర్‌నూ కొనసాగిస్తోందీ సూపర్‌ మామ్‌. ఈక్రమంలో తన కుమారుడి ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సానియా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిందట. ఈ కారణంగా కొద్ది రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ టెన్నిస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
kajol-says-her-father-was-against-the-idea-of-her-getting-married-to-ajay-devgan-at-young-age

అప్పుడు మా పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు!

ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి సుమారు రెండు దశాబ్దాలకు పైగా గడిచినా..ఎంతో అన్యోన్యంగా ఉంటూ నేటి తరం జంటలకు ఆదర్శంగా నిలుస్తుంటారీ లవ్లీ కపుల్‌. ఇక గతేడాది ‘తానాజీ... ది అన్‌ సంగ్‌ వారియర్‌’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ... ఆన్‌ స్ర్కీన్... ఆఫ్‌ స్ర్కీన్‌ ఎక్కడైనా తమది ‘పర్ఫెక్ట్‌ జోడీ’ అని మరోసారి నిరూపించుకున్నారు. ఇలా ఓవైపు తల్లిగా తన ఇద్దరు పిల్లల ఆలనాపాలన చూసుకుంటూనే ... మరోవైపు నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తోంది కాజోల్. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘త్రిభంగ’ జనవరి 15 న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
anita-hassanandani-flaunts-her-eight-month-old-baby-bump-with-hubby-rohit-reddy

ఈ లవ్లీ కపుల్‌ రొమాంటిక్‌ ఫొటోషూట్‌ చూశారా?

తమకు పుట్టబోయే బుజ్జి పాపాయిని ఊహించుకోవడం, ఎప్పుడెప్పుడు తమ ముద్దుల చిన్నారిని చేతుల్లోకి తీసుకుందామా అని ఆత్రంగా ఎదురుచూడడం... ఇలా ప్రతిక్షణం పుట్టబోయే బిడ్డ ఆలోచనల్లోనే గడపడం తల్లయ్యే ప్రతి మహిళకు సహజమే. ఇక పుట్టబోయేది తొలుచూరు బిడ్డ అయితే కాబోయే తల్లిదండ్రుల ఆనందానికి అంతే ఉండదు. మరికొన్ని రోజుల్లో తమ గారాల పట్టిని ఈ లోకంలోకి తీసుకురాబోతున్న అనితా హస్సానందాని-రోహిత్‌ రెడ్డి ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతున్నారు. తను తల్లిని కాబోతున్నానని ప్రకటించిన మరుక్షణం నుంచే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తోన్న ఈ బ్యూటీ.. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్ కూడా తీయించుకుంది. అనంతరం ఆ మధురానుభూతుల్ని ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తెగ మురిసిపోయింది.

Know More

women icon@teamvasundhara
virat-kohli-and-anushka-sharma-welcome-a-baby-girl

మాకు అమ్మాయి పుట్టింది..!

గర్భం ధరించిన క్షణం నుంచి నెలలు నిండుతున్న కొద్దీ కాబోయే అమ్మగా ప్రతి క్షణాన్నీ మహిళలు ఎలా ఆస్వాదిస్తారో.. తమకు పుట్టబోయే చిన్నారిని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అన్న ఉత్సాహం కాబోయే తండ్రుల్లో మిన్నంటుతుంది. ప్రస్తుతం విరుష్క జంట అలాంటి ఆనందోత్సాహాల్లోనే తేలియాడుతోంది. తాజాగా బాలీవుడ్‌ అందాల తార అనుష్కా శర్మ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిగా ప్రమోషన్‌ పొందిన విరాట్‌ ఈ ఆనందకరమైన క్షణాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘బుజ్జాయి రాకతో మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది’ అంటూ పట్టరానంత సంతోషంలో మునిగి తేలుతున్నారీ లవ్లీ కపుల్.

Know More

women icon@teamvasundhara
actress-hariteja-dances-and-has-fun-with-friends-at-her-baby-shower-function

అమ్మయ్యే వేళ.. ఆనంద హేళ..!

హరితేజ... సీరియల్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి సిల్వర్‌ స్ర్కీన్‌పైకి అడుగుపెట్టిన ఈ అందాల తార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ సినిమాతో పలువురి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్‌గానూ, హోస్ట్‌గానూ సత్తాచాటింది. ఇక ‘బిగ్‌బాస్‌ 1’ తో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. ఇలా బుల్లితెరపై, వెండితెరపై వరుస సినిమాలు, షోలతో దూసుకెళుతోన్న హరితేజ త్వరలో అమ్మగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వేడుకగా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
opens-up-about-the-casting-director-called-her-home-and-berated-her

ఆ మాటలతో బ్యాగ్‌ సర్దుకుని ఇంటికెళదామనుకున్నా!

రంగుల ప్రపంచం లాంటి సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే సాధారణ విషయమేమీ కాదు. పరిశ్రమలోకి అడుగుపెట్టడం నుంచి అవకాశాలు దక్కించుకునేదాకా ఇన్నో ఇబ్బందులు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. తెరపై కనిపించి అభిమానుల ప్రేమాభిమానాలు పొందాలంటే తెర వెనుక వారు ఎదుర్కొనే వేధింపులు, చేదు అనుభవాలు ఎన్నో! ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్‌ హోదాను అనుభవిస్తున్న నటీమణులు కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఈక్రమంలో తాను కూడా కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటోంది ‘బాహుబలి’ ఫేం నోరా ఫతేహి. తనకు ట్యాలెంట్‌ లేదన్న ఓ క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ మాటలు తనను చాలా రోజులు వేధించాయంటోందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో తనకెదురైన చేదు అనుభవాల గురించి అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kabir-singh-fame-vanita-kharat-boldly-poses-for-body-positivity

నా శరీరం నన్ను గర్వపడేలా చేసింది!

సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు తమ శరీరాకృతిని చూసుకొని తెగ ఫీలైపోతుంటారు. ‘సన్నగా, నాజుగ్గా ఎందుకు లేమా’ అని మనోవేదనకు గురవుతుంటారు. అదే సమయంలో తమను ఉద్దేశిస్తూ ఎదుటివారు చేసే విమర్శలు, కామెంట్లతో తీవ్ర అత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. తమను తాము అసహ్యించుకుంటూ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల్లోకి వెళ్లిపోతుంటారు. కానీ మరికొందరు అమ్మాయిలు ఎంత లావుగా ఉన్నా సానుకూల దృక్పథంతో ముందుకెళుతుంటారు. ‘ఇది దేవుడిచ్చిన శరీరం.. ఎవరేమనుకుంటే నాకేంటి.. నా శరీరం.. నాకు నచ్చినట్లుగా నేనుంటా’ అంటూ బాడీ షేమింగ్‌ను బాడీ పాజిటివిటీగా మార్చుకుంటుంటారు. బాలీవుడ్‌ నటి వనితా ఖరాత్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. ‘కబీర్‌ సింగ్‌’ సినిమాతో అశేష గుర్తింపు తెచ్చుకున్న ఈ నటీమణి బాడీ పాజిటివిటీని చాటుతూ చేసిన ఓ పని పలువురి ప్రశంసలు అందుకునేలా చేసింది.

Know More

women icon@teamvasundhara
raveena-tandon-about-adpot-decision-they-said-no-one-would-want-marry-me

అలా చేసినందుకు నాకు పెళ్లికాదన్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం.. వంటి పలు కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. దీంతో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకుని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలున్నా-లేకపోయినా, వివాహం చేసుకున్నా-చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఓవైపు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆ చిన్నారులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. అలాంటి వారిలో ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ ఒకరు. రెండు పదులు వయసులో.. అది కూడా పెళ్లి కాకుండానే ఇద్దరు అనాథ బాలికలను అక్కున చేర్చుకుందీ అందాల తార. ఈ సందర్భంగా పిల్లల్ని దత్తత తీసుకోవడం, వారి పెంపకం విషయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
pooja-kumar-is-now-mom-to-a-baby-girl-in-telugu

అలా నా పుట్టినరోజుని మరింత మధురంగా మార్చావు..!

పూజా కుమార్‌...‘విశ్వరూపం’ సిరీస్‌లో కమల్‌ హాసన్‌తో పోటీపడి నటించి మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్‌. తెలుగులో నటించింది కొన్ని చిత్రాల్లో అయినా తన అందం, అభినయంతో టాలీవుడ్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషా సినిమాల్లోను నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అక్కడి ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. ఈక్రమంలో సుమారు రెండేళ్లుగా సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించని ఈ అందాల భామ అమ్మగా ప్రమోషన్‌ పొందింది. తన భర్త విశాల్‌జోషితో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసిందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
celebrities-new-year-wishes-in-telugu

అలా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు!

కొంగొత్త ఆశలు, కలలను మోసుకొస్తూ కొత్త ఏడాది ప్రారంభమైంది. గతేడాది మిగిల్చిన చేదు అనుభవాల నుంచి బయటపడుతూ అందరూ కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు తమ స్వస్థలంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తే, మరికొందరు తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. అనంతరం తమ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కొందరు సినీతారలు కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించారో, వారి న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ ఏంటో చూద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
actress-mayuri-sudha-chandran-in-alitho-saradaga-chat-show

నా కాలు తొలగించే సన్నివేశం చూసి ఒకావిడ కళ్లు తిరిగి పడిపోయింది!

మనోధైర్యం మెండుగా ఉన్న నాట్య ‘మయూరి’ ఆమె. అందుకే 13 ఏళ్లకే ఒంటికాలితో తన జీవితాన్ని అంధకారం చేయాలనుకున్న విధిని సైతం ఎదిరించింది. కష్టాలు, కన్నీళ్లకు కుంగిపోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. నటిగా, నృత్య కళాకారిణిగా కళలకే తలమానికంలా నిలిచి అశేష అభిమానాన్ని సాధించింది. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆ అందాల తార మరెవరో కాదు ‘మయూరి’ సుధా చంద్రన్‌. సుమారు మూడున్నర దశాబ్దాలుగా నటన, నాట్య రంగంలో తనదైన ప్రతిభ చూపుతోన్న ఆమె ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనంద క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
singer-sunitha-pre-wedding-party-photos-goes-viral

సునీత ప్రి వెడ్డింగ్‌ పార్టీలో సెలబ్రిటీల సందడి!

తన మధురమైన గాత్రంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ జంట. ఈ క్రమంలో వివాహ సమయం దగ్గరపడుతుండడంతో స్నేహితులు, సన్నిహితుల కోసం వరసగా ప్రి వెడ్డింగ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు సునీత-రామ్‌. కొద్ది రోజుల క్రితం ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టాలీవుడ్‌ నటీనటులు, సింగర్స్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన వీరు తాజాగా మరోసారి పార్టీని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Know More

women icon@teamvasundhara
telugu-actresses-annapoorna-and-vijaya-in-alitho-saradaga-chat-show

అందుకే ఇరవై ఏళ్ల లోపే పెళ్లి చేసుకున్నా!

వెండితెరపై వారిద్దరిదీ విభిన్న ప్రస్థానం. ఒకరు తల్లి పాత్రలతో అందరి మదిలో ‘అమ్మ’గా నిలిచిపోతే, మరొకరు గయ్యాళి పాత్రలతో ‘అమ్మో’ అనిపించుకున్నారు. తమ యాభై యేళ్ల సినీ ప్రస్థానంలో వారు ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. తమ అద్భుత అభినయంతో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వారే సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై. విజయ. గతేడాది ‘ఎఫ్ 2’ సినిమాలో కలిసి నవ్వుల పువ్వులు పండించిన వీరు తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సినీ కెరీర్‌, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందపడ్డ క్షణాలు... ఇలా ఎన్నో అనుభూతులను అందరితో పంచుకున్నారు. మరి, ఆ సరదా సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sonali-phogat-gets-emotional-remembering-her-late-husband

women icon@teamvasundhara
shikha-malhotra-who-suffered-paralysis-stroke-is-not-sure-when-she-will-be-able-to-walk-again

మళ్లీ నా కాళ్లపై ఎప్పుడు నడుస్తానో తెలియడం లేదు!

నర్సింగ్‌ విద్యను అభ్యసించిన ఆమె నటనపై ఉన్న ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్ని పోషిస్తూనే ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత తన నటనా ప్రతిభతో షారుఖ్‌ లాంటి స్టార్ హీరో పక్కన నటించి ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకుంది. కానీ సినిమాల్లోకి వెళ్లినా తన సేవాభావాన్ని మరచిపోలేదామె. అందుకే కోరుకోని అతిథిలా వచ్చిన కరోనా వైరస్‌ నుంచి సామాన్యులను కాపాడేందుకు మళ్లీ సేవకే ఓటేసింది. ఆరు నెలల పాటు కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడింది. కానీ దురదృష్టవశాత్తూ అదే వైరస్‌ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా. కొవిడ్‌ను జయించి ఇంటికి చేరుకున్న ఆమె పక్షవాతానికి గురై మళ్లీ ఆస్పత్రి పాలైంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
candid-moments-from-anita-hassanandanis-baby-shower-function

అందుకే మీ బేబీ కోసం ఎదురుచూస్తున్నాం!

అనితా హస్సానందాని... ‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకున్న అందాల తార. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులు కొల్లగొట్టిన ఈ భామ పలు కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ బుల్లితెరపై అడుగుపెట్టి అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. సినిమాల్లో ఉండగానే రోహిత్‌ రెడ్డి అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో తల్లిగా ప్రమోషన్‌ పొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె బేబీ షవర్‌ (సీమంతం) ఫంక్షన్‌ వేడుకగా జరిగింది. అనిత సన్నిహితురాలు, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ ఏర్పాటుచేసిన ఈ ఫంక్షన్‌లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న అనిత-రోహిత్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
mohanlal-daughter-vismaya-loses-22-kilos-share-her-weight-loss-journey

'స్టార్ హీరో కూతురేంటి.. ఇలా ఉంది..' అనేవారు!

కాస్త బొద్దుగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తే చాలు..‘అబ్బ ఎంత లావుగా ఉందో... బరువు తగ్గి కొంచెం సన్నగా మారొచ్చు కదా! ’ అని కామెంట్ చేసేవారు, ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. కొన్ని నెలల క్రితం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంది మలయాళీ నటుడు మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ. సోషల్‌ మీడియాలో తన ఫొటోలు షేర్‌ చేసినప్పుడల్లా ‘స్టార్‌ హీరో కూతురేంటి ఇలా ఉంది’?అని చాలామంది నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా కనిపించిన ఈ స్టార్‌ కిడ్‌ ఇప్పుడు నాజుగ్గా మారిపోయింది. ఫిట్‌నెస్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనర్స్‌ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకుని 22 కిలోల బరువు తగ్గిపోయింది. ఈ సందర్భంగా బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా ఎలా మారిందో, ఈ జర్నీలో తనకెదురైన అనుభవాలేంటో సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల తార. బరువు తగ్గడానికి తానెంత కష్టపడిందో చెబుతోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon@teamvasundhara
vidya-balan-offers-to-auction-a-special-sari-for-a-cause
women icon@teamvasundhara
tv-actress-divya-bhatnagar-dies-of-covid-19-at-34

నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లినా... జీవితాంతం గుర్తుంటావు!

కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి కారణంగా మనదేశంలో ఇప్పటివరకు లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను బలి తీసుకున్న ఈ వైరస్‌ తాజాగా మరో వర్ధమాన నటిని కబళించింది. పలు బాలీవుడ్ సీరియళ్లలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యా భట్నాగర్‌ (34) కరోనాతో కన్ను మూసింది. కరోనాతో కొద్ది రోజుల క్రితం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె కోలుకోలేక తుదిశ్వాస విడిచింది.

Know More

women icon@teamvasundhara
rhea-chakraborty-top-yahoo-most-searched-female-celebrities-of-2020-list
women icon@teamvasundhara
i-will-kill-my-sons-if-they-hurt-anybody-says-shefali-shah

అమ్మాయిలను అలా చేస్తే మా అబ్బాయిలకు కూడా అదే శిక్ష వేస్తా!

‘దిల్లీ క్రైమ్’... గత వారం రోజుల నుంచి బాగా వినిపిస్తోన్న పేరు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ గతేడాది ఓటీటీలో విడుదలైంది. ఆ సమయంలో బాగుందనే ప్రశంసలు తప్ప అందులో నటించిన నటీనటుల గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ చిత్రం ఎమ్మీ అవార్డు గెలుచుకుందో అందులో నటించిన ఒక క్యారక్టర్... ఆ పాత్ర పోషించిన నటి పేర్లు బాగా మార్మోగిపోతున్నాయి. మహేశ్‌బాబు, హృతిక్‌రోషన్‌ లాంటి సెలబ్రిటీలు ఆమె అభినయాన్ని అభినందిస్తున్నారు. ఆ క్యారక్టర్‌ పేరు డీసీపీ వర్తికా చతుర్వేది కాగా... ఆ పాత్ర పోషించిన నటి షెఫాలీ షా.

Know More

women icon@teamvasundhara
manushi-chhillar-reveals-why-she-decided-to-go-vegetarian

అలా చేయమని నన్నెవరూ బలవంతపెట్టలేదు!

తల్లిదండ్రులు చేసే పనులను పిల్లలూ అనుకరిస్తారంటారు.. వారి అలవాట్లు చిన్నారుల పైనా ప్రభావితం చూపుతాయంటారు. అలా తన తల్లిదండ్రుల ఆహారపుటలవాట్లు తన పైనా ప్రభావం చూపాయంటోంది మాజీ ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్. 2017లో ప్రపంచ సుందరిగా అవతరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన మానుషి.. మహిళా సాధికారతకు కృషి చేస్తూ తన మంచి మనసును సైతం చాటుకుంటోంది. అంతేనా.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించే ఈ చక్కనమ్మ.. ఈ క్రమంలో తాను పాటించే చిట్కాలను సైతం సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తన ఫ్యాన్‌్ులో స్ఫూర్తి నింపుతుంటుంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ సందర్భంలో మాట్లాడుతూ తన ఆరోగ్యకరమైన జీవనశైలి వెనకున్న మరో సీక్రెట్‌ని బయటపెట్టింద