సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

Discussion Forum Discussion Forum
ఓ సోదరి.

‘కరోనా’పై మీరెలా యుద్ధం చేస్తున్నారు?

ప్రస్తుతం ప్రపంచంలో ఎటు చూసినా ‘కరోనా’ నీలినీడలు కమ్ముకున్నాయి. తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ మహమ్మారి మన దరిచేరకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాండ్‌వాష్‌/హ్యాండ్‌ శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, ముఖాన్ని తాకకుండా ఉండడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం.. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడంపై అటు అధికారులు, ఇటు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. మరి మన దేశంలో ఈ మహమ్మారి మరింతగా జడలు విప్పకముందే జాగ్రత్తపడడం మనందరి కనీస బాధ్యత. ఈ నేపథ్యంలో ‘కరోనా’ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగతంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఇన్నాళ్లూ అందరితో కలివిడిగా ఉండి ఒక్కసారిగా సామాజిక దూరం పాటించే క్రమంలో మీకెలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ‘వసుంధర.నెట్‌’ వేదికగా మాతో పంచుకోండి.. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అనుభవాలతో ఈ మహమ్మారిని తరిమికొట్టే దిశగా మరింతమందికి అవగాహన కల్పించండి.

Know More

 

నగరంలో ప్రొ-కబడ్డీ సందడి..

క్రీడాభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న కబడ్డీ ప్రీమియర్ లీగ్ 7వ సీజన్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్‌లో భాగంగా తెలుగు టైటాన్స్, యూ ముంబా మధ్య మొదటి మ్యాచ్ జరగ్గా, బెంగళూరు బుల్స్, గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. కబడ్డీ మ్యాచ్‌ల దృష్ట్యా స్టేడియమంతా క్రీడాభిమానులతో సందడిగా మారింది. ఈ మ్యాచ్‌లను చూడడానికి నగర వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలువురు క్రీడాభిమానులు తరలి రావడం విశేషం.